పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Indira Bhyri కవిత

ఇందిర అమానుషం నీకేందమ్మా మారాజువు 'కొడుకులగన్న కోట'వని నలుగురూ ఎకసెక్కాలాడినపుడు లోలోపల ఎంత ఉప్పొంగిపోయావో కుడిచెయ్యీ ఎడమచెయ్యీ అనకుండా అందరి ముడ్లూ మూతులు కడిగి అడ్డమైన చాకిరంతా ఆనందంగా చెయ్యలేదా ఏడేడు ఇళ్లల్లో పిల్లిలా తిప్పి కళ్లలో వత్తులేసుకుని పూచికపుల్లా దాచిపెట్టి తినీతినక కూడబెట్టి ఇల్లుకట్టి పిల్లల్ని నీ వీపుకు కట్టుకోలేదా అంతా ఒక రేవుకొచ్చేదాకా కునుకైనా తీశావా పిల్లలకై బ్రతకాలంటూ జీవితాన్ని ప్రేమించావే ఇళ్లూ వాకిళ్లు పంచుకుని ఇప్పుడు నిన్నేపంచనుంచాలో తోచక ఎటూతేల్లుకోలేక కొడుకులంతా కొట్టుకుచస్తున్నారే నువ్వేమైనా ఆస్తివా పాస్తివా ఆబగా పంచుకోడానికి ! ఆరుబయట అరుగుమీద బండరాయి గుండెలపై బుక్కెడు బువ్వకోసం నీ గాజుకళ్ల ఎదురుచూపు చావుకు చేరువైన చేతులు వాలుతున్న ఈగల్ని తోలలేక వేలాడబడ్డాయి నీచేతుల్లో ఏముందింక కనకమ్మత్తా !! (2009) 18/2/2014

by Indira Bhyri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N4in4n

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి