పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Thilak Bommaraju కవిత

తిలక్/what if i say.... ---------------------------- నేను ఇసుకనై నేల మీద పరుచుకున్నపుడు నువ్వు నాపై నడుస్తూ ఉంటావు నీ మెత్తని పాదాల కింద అలుముకున్న నా మనసు నీ నుదుటిపైనుండి జాలువారే శ్వేదానికి స్నేహితుడిలా నేను ఎప్పుడన్నా ఎదురొస్తుంటే తలదించుకుని ఉండిపోయె ఒక ఆత్మ ఇక్కడ నిలుచుంది నిన్నుగా పొదువుకొందామని నన్ను నీకు చూపిద్దమని చాలాసార్లు ప్రయత్నించాను కాని నువ్వొచ్చేసరికి ఎందుకో దాచేస్తాను లోనకు ముడుచుకుపోతూ రూపమో అపురుపమో విరిగిన ఊహలను ఎన్నిసార్లు అతికించుకోను ఇంకా నువ్వు కనపడనప్పుడల్లా నీ చూపుల చిరునగవును కళ్ళతోనే ముద్దాడాను కొన్నిసార్లు ఊపిరాడకుండాను నీకు తెలియకుండాను నేను మాత్రమే కురూపిని మనసు కాదు. తిలక్ బొమ్మరాజు 18.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cSGSYH

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి