పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Ramabrahmam Varanasi కవిత

బ్రాహ్మణులు - బ్రాహ్మణ మతము వారణాసి రామబ్రహ్మం 18-2-2014 భారత దేశంలో ప్రస్తుతమున్న అన్ని కష్టములకు, కలవరములకు, విచక్షణలకు బ్రాహ్మణులను, బ్రాహ్మణ మతాన్ని నిందించడము ఒక పరిపాటి అయిపోయింది. ఇందులోని నిజానిజములు తర్కించవలసినవి. ఎవరికీ ఆ ఓపిక లేదు; అంతటి మానసిక స్తోమత, బుద్ధికుశలత్వము గుండుసున్న. అయినా తెల్లారింది మొదలు ప్రొద్దుగూకె వరకు బ్రాహ్మణులను బ్రాహ్మణ మతాన్ని తిడుతూ, భారత దేశపు అన్ని క్రూరత్వాలకు, కఠినత్వాలకు బ్రాహ్మణులనే బాధ్యులను చేసి వారిని అనరాని మాటలు అనడము, వారి పట్ల అనాగరికముగా ప్రవర్తించడము దక్షణాదిన ఒక వ్యతిర్రెక ఉద్యమము మొదలై ఓట్ల బంకలా తయారై , వ్యాపారములా నడుస్తోంది. ఉత్తరాదికీ అది పాకింది. భారత దేశములో ఎప్పుడూ engineering and technology బ్రాహ్మణుల చేతిలో లేవు. ఇవి రకరకాల కులముల వారికి అప్పగించబడ్డాయి. ఒక కులము ఒక సాంకేతిక జ్ఞానానికి ప్రతీక. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క Profession. ఎవరు అప్పగించారు? ఎవరు ఇవన్నీ నిర్దేశించారు? అందరూ కలిసి నిర్ణయించుకున్నారా? ఎవరికీ ఏమీ తెలియదు. బ్రాహ్మణులని మాత్రము అన్ని అనర్ధాలకు బాధ్యులను చేయడము ఓక మేధావితనముగా విరాజిల్లుతోంది. Engineering and technology అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు జీవికకు, ధనము సంపాదించి బ్రతుకు నడుపుకోవదానికి వీలు కలిగిస్తుంది. అలా జీవికకు ధనము తెచ్చే Engineering and technology బ్రాహ్మణుల చేతిలో లేనప్పుడు బ్రాహ్మణులు మిగతా వారిని ఎలా నిలువరించారు? ఎలా దోచుకున్నారు? What Brahmins deprived others of? And there were no government jobs till the British started ruling. బ్రాహ్మణులు భారతజాతికి చేసిన ఉపకారాన్ని స్మరించే వాళ్ళే లేరు. ఆధ్యాత్మిక జ్ఞానము, లలిత కళలు, వైద్యము, గణితము, సాహిత్యము, ఒక రమ్యమైన సృష్టి; ప్రపంచమంతా ఈ సృష్టికి ముగ్ధయై భారతదేశాన్ని మెచ్చుకుంటూంటే, కుహనా మేధావులు మాత్రము బ్రాహ్మణులను, బ్రాహ్మణ మతాన్ని మన అన్ని ఇక్కట్లకు బాధ్యులని చేసి నిరసిస్తున్నారు; అనాగరిక భాషలో నిందిస్తున్నారు. అలా నిందించడము ఒక సరదా (fashion) అయింది. ప్రపంచములో మరెక్కడా బ్రాహ్మణ మతము లేదు. కాని అక్కడా భారత దేశములో ఉన్న అన్ని కష్టములు, కలవరములు, విచక్షణలు ఉన్నాయి. అన్ని రకాల అనర్దాలు అక్కడా చోటు చేసికుంటున్నాయి. అక్కడి అనర్ధాలకు ఎవరు కారణము? సంస్కృతీ, సంప్రదాయము ఏ సంఘములోనైనా మార్పుకి లోనవుతాయి. ఇది అన్ని సంఘాలకు, దేశాలకు వర్తిస్తుంది. దీన్ని అందరు "మేధావులు" గమనిస్తే సరియైన దోవని నడిచి ప్రస్తుత ఇబ్బందులని అధిగమించవచ్చు. లేనిచో బ్రాహ్మణులను, బ్రాహ్మణ మతాన్ని అన్ని అనర్ధాలకు బాధ్యులని చేస్తూ, "మేధావులుగా" చెలామణీ ఆవుతూ, అసలు అందర్నీ బాధిస్తున్న సమస్యలను అలాగే ఉంచేసి, వదిలేసి, రోగము ఒకటి అయితే మందు మరొకటి వేసి సంఘ అనారోగ్యాన్ని పెంచుతూ డాక్టర్లని తప్పు పడుతూ, నిందిస్తూ సంఘాన్ని, దేశాన్ని తప్పుదారి పట్టిస్తూ ఎన్నడూ రోగనివారణ జరగకుండా ఆపేస్తూనూ ఉండవచ్చు. ఒక వర్గమే అన్ని అనర్ధాలకు కారణము అనే అబద్ధపు ప్రచారము, ప్రకటనలు ఆగిపోతే వర్గభెదము లేకుండా మనందర్నీ ఇబ్బంది పెడుతున్న మిగతా ముఖ్య అంశాలపై దృష్టి సారించవచ్చు. We also can find solutions and implement them. మనందరికీ తాగడానికి మంచి నీరు లోటుగా ఉంది. పాలన దరిద్రముగా ఉంది. విద్యుత్ శక్తి లోటు, ఇతర అవసరాలు, చదువు, వైద్యము అందటము లెదు. ఎంతో ఖరీదు అయిపోయాయి. ద్రవ్యోల్బణము, ధరల ఉత్తర దిశా గమనము, పాలనలో, వ్యాపారములలో, పరిశ్రమలను నడపడములో, ఉద్యొగస్థులలొ, నాయకులలో, corporate bigwigs లో అవినీతి; మనందర్నీ సమానముగా పట్టి పీడిస్తున్నాయి. వీటికి అన్నిటికీ ఎవరు కారణము? బ్రాహ్మణులు, బ్రాహ్మణ మతము కాదు కదా!! నిదురలోంచి మేలుకుని పూర్తి మెలకువలో దేశాన్ని, సంఘాన్ని సరియైన మార్గములో పెట్టుకోవడము మనందరి కర్తవ్యము. బ్రాహ్మణులను, బ్రాహ్మణ మతాన్ని నిందించుకుంటూ పోవడము "మేధావితనము" అవుతుందేమో తప్ప మనకష్టాలకు, జీవితములోని వడి దుడుకులకు పరిష్కారము మాత్రము కాదు. Let wisdom dawn on us.

by Ramabrahmam Varanasi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jylEnA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి