పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెలుగు రచన కవిత

ఓడిపోయి గెలవటమే జీవితం గెలిచి ఓడిపోవటమది తధ్యము మరణానికి పెట్టలేని ముహూర్తం జననానికి ఎందుకంట ? విచిత్రం! సుఖదుఃఖపు అదినేతది కన్నీరని తెలిసికూడ వెతకటం-గెలుపుకొరకు ఆరాటం. గెలుపులాట పందెంలో చివరికోడిపోవటం. ఇదేకదా జీవితం , చివరికిలా మిగలటం . పది పదుల యానంలో పదికాలాలుండేవి పదిలమైన గురుతులే-పదిలమైన గురుతులే. ఓటమికీ గెలుపునకూ ఒకే ఒక్కమైలురాయి తలకాడది స్థంభించగ తోడురాని ఖలనమిదీ నాది నీదదేదిలేదు, నీది కూడ నీకులేదు. సాధించది సాధ్యమైతే - శాశ్వతమది సాత్వికమే సాధించది సాధ్యమైతే - శాశ్వతమది సాత్వికమే !! ..........య.వెంకటరమణ

by తెలుగు రచన



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gecIS4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి