పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

Sriarunam Rao కవిత

జాతి విడిపోయినా... భాష చీలిపోయినా... ప్రాంతం రెండుముక్కలైపోయినా...భావం మారదు. బ్రతుకు నీచమైన... నడక వక్రమైనా... నమ్మకం చనిపోయినా...వాస్తవం వదిలిపెట్టదు. పదవి నిలుపుకోవటానికి పక్కలెయ్యక్కరలేదు రాజకీయమంటే రంకు సంతకాదు, నమ్మిన ప్రతివారినీ వంచించిన ఈ గమనం.... కుష్టివ్యాదిని మించిన నికృష్టపుగమకం. కలిసుండటం...విడిపోవటం...మనందరి హక్కు. కానీ జరగాల్సిన సహజాన్ని ఇలాంటిస్థాయికి దిగజార్చిన విషయాన్ని భారతీయులుగా మనం మర్చిపోవద్దు, గద్దెనెక్కించిన ప్రజలతోనే ఇలాంటి వికృతక్రీడ నడిపినవారిని వదలొద్దు, సమైక్యమైనా,విభజనైనా ప్రజలందరిదీ ఒకేజాతి. దాని వక్రీభవనం వల్లనే రెండువైపులా ఎన్నోలేతజీవితాలు బలైపోయాయి. ఈ పాపం ఎవరిదో...వారి గదుల్లో రేపటినుండి ఆ ఆత్మలు సంచరిస్తాయి. ఆకాంక్షను తీర్చటానికి అడ్డగోలుపనులు చేస్తున్నవారినే గమనిస్తుండండి. లేకుంటే...మన నమ్మకాలను దోచుకునే దొంగనాకొడుకులకు మన భవిష్యత్తు అమ్ముడైపోతుంది. శ్రీఅరుణం

by Sriarunam Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h16pBQ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి