పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

11, మార్చి 2014, మంగళవారం

Sriramoju Haragopal కవిత

కాపిశ్కెడు నెనరు పిడీలు గడిచినయి పిడికెడు దయగలిగిన మనుషులు పిడికెడుగూడ దొరకలే దోసెడు దోసెడు కన్నీళ్ళు తాగి ఆశలు దూసిన బతుకుచెట్టునీడల ఎండిపోయినయి చల్లటి అయినోల్లనీడలు ఎవల్నడుగాలె బాధలెందుకుంటయని మొగులొడ్డున పొద్దొకనది యెలుగు, మాపొకనది సీకటి బురద బురద కప్పు తొర్రల్లో చిక్కిన యాదిచుక్కలు పొయ్యిల కొర్రాయిలెక్క చిటపట యిడిచిపోయినోల్లె కాని వున్నదెవరుతోడు? పుటుకపొద్దు, సావుమునిమాపుల నడుమ చానా ముచ్చట్లు కతలుగ చెప్పడానికే నిజం మనం కలిసి బతికిన రోజులన్నిట ఆత్మగల్లలోకం వొకటుంటదనే భావుకం, నీకు నాకు నడుమ వెలిసిపోని పావురం దుక్కం మొగురమై గుండెల్లో దిగబడితే బొమ్మరిల్లు బొమ్మయిల్లే తండ్లాడి పేర్చుకన్న బతుకమ్మయితే బతుకు పిడీలకవుతల కూడా ప్రేమలచేన్లే పండుతయి

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i3zFd5

Posted by Katta

Bandla Madhava Rao కవిత

కవి మిత్రులారా మీ మీ కవితలు ఏ పత్రికలో ప్రచురితమైనా వాటి వివరాలు లేదా ఆయా కవితలు కవిత 2014 ప్రచురణల డైరీ పేజీలో అతికించడి.

by Bandla Madhava Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i9qngm

Posted by Katta

Rajkumar Bunga కవిత

ఆర్కే||ఓ క్షణం చాలు|| అవును, జీవితం అందమైనది ఒక యుగమైన ఒక్క క్షణమైనా జీవితం అందమైనది కొన్నిసార్లు ఎవరో చెప్తేగాని తెలియదు అంతమయ్యేలోపు మరింత అందమని తెలుసుకో ఎందుకు ఆ భయం రోగంనిన్ను పీడుస్తుందా లేక రోగిని అనే దిగులు నిన్ను పీడుస్తుందా What is more hurting you? Disease or fear about Disease. ఇదిగో మనసా నీకో రహస్యం చెప్పనా, రోగం లేనోళ్ళు ఉన్నారేమో గాని మరణం లేనోళ్ళు కాదు...పిచ్చిముఖమా! న్యాయ సమ్మతమైన సమయంలో పరస్పర సమ్మతిపత్రం తీసుకొని ఏ ఉద్దేశ్యంతో ఇక్కడకు వచ్చావో నీకు ఆ భగవంతునికి మాత్రామే తెలుసు అదో రహస్యం ....మీ ఇరువురి మధ్య ఒప్పందం ప్రయాణంలో ఎన్నో మజిలీలు, తోటి ప్రయాణికులు!! కార్యం ముగింపులో కార్యాలయం ఆలోచన ఎందుకు ఎలా వచ్చావో అలాగే స్వచ్చంగా, లేతగా వెళ్ళిపో కార్యాలయం బీటలు వేస్తే నీకేంటి, బూజులు పడితే నీకేంటి శిధిలాలు భుజాన్నేసుకొని తిరుగు ప్రయాణం ఎందుకు, భూమిలో పాతెయ్ కాన్సర్ కణాలు మట్టితోకట్టిన కార్యాలయపు గోడలను కూల్చగలవు గాని, నిన్నుదాటుకొని నీ గుండెను కాదుగా ...తెలుసుకో అద్దెకొంపలో ఏమైనా కట్టిపడేసే బాధ్యతలుంటే తేలికపాటి ప్రయాణం కోసం అన్ని ఖాళి చేసుకొని నీగుండెలో నువ్వు చేరి సిద్దపడిపో పక్షిలా ఎగరడానికి Everything looks like important in life, but everything is not need in life, until unless you know the difference between important and need. సమస్తం ఆవశ్యకమైనవే, కాని అవసరము కాదు వాటి మధ్య వ్యత్యాసము తెలియనంతసేపు జీవితమంటే శరీరంలోనే నివాసం కాదు .... జీవితమంటే ఓ అందమైన ప్రయాణం, ఓ జ్ఞాపకం అందరిలో జీవించడానికి , అందమైన జ్ఞాపకంగా మిగిలిపోవడానికి వందేళ్ళు అవసరం లేకపోవచ్చు.. ఒక్కోసారి ఓ క్షణమే చాలు What is more hurting you? Death or fear about Death నవ్వినా నవ్వించగల్గిన...ఓ క్షణం చాలు ఎవరో ఒకరిలో నీవు తిరిగి జీవించడానికి..కమ్మని జ్ఞాపకంలా!! ఆర్కే||ఓ క్షణం చాలు|| 20140311

by Rajkumar Bunga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nFMHQ0

Posted by Katta

Yasaswi Sateesh కవిత

యశస్వి.. ఎన్నికల లోగిళ్ళలో.. ఎదురుచూపులు చాలిక తెరతొలగించి చూపించాలి మొదలైంది డచ్చాల యుద్ధం రంగం సిద్ధం చూస్తున్న వారిప్పుడూ.. మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు ఈలలు వేసి గోల ఆడేవారే చేస్తున్నారు జీడిపప్పు తిని బలిసిన పందెం కోళ్ళు బరిలో నించున్నాయ్ ప్రయాణంలో, పనివేళల్లో.. కాలక్షేపం కబుర్లు బోలెడు పేపరు నిండా కాలక్షాపం బఠాణీలే చోద్యం పంచడానికి తోడున్నాయిగా మన ఛానళ్ళు ప్రజలంతా ఎవరినో గెలిపించడానికి సిధ్ధమైపోయారు లేదా తాము ఓడిపోవడానికి సిధ్ధమైపోతారు ఏమీ అడగలేక పోతారు అయాచితానికి ఆశపడిపోతారు చూపున్నా దృష్టి లేక బ్రతికున్నా స్పృహలేక ఆకలికి తాళలేక బరువుకీ కరువుకీ తాయలాలకై తొందరపడిపోతారు ఎన్నికలలనో పోగేసిన మాటల్ని నెమరేయలేక కలల్ని కనే అవకాశాన్ని వదిలిపోతారు అలవాటైన చీకట్లోకి నడిచిపోతారు.. కవీ! గోరీలు తవ్వి లేపనక్కరలేదు.. బ్రతికున్న మనుషులేగా మనవాళ్ళు! అయోమయంలో వారి ఆనవాళ్ళు ఎన్నిక చేసుకునేది మనుషుల్ని కాదు ముందురోజుల జీవితాన్నని.. మరలచెప్పు. అమ్మ-నాన్న, ఊరూ-కులం, భాష- ప్రాంతం పుట్టుక- చివరికి నువ్వు మగో- ఆడో నిర్ణయించుకునే అవకాశం కూడా లేకుండానే ప్రయాణం మొదలెట్టాముగా! నీపరమైన వన్నీ గౌరవించే మనసున్నోడివి బతుకు బండి నడిపే వాడిని ఎన్నుకోమని అడిగితే తలదించుకు పోతావే? అని కదా మనం అడగాలి!! ఓటు కోసం వచ్చిన వాడ్ని ప్రశ్నించమని చేప్పేవి- చేసేవి చిట్టాల తూకం వెయ్యమని మరలచెప్పు మన మనిషికి గొంతెత్తి పిలువ్! వెలుగు దారి తొక్కమని ==11.3.14==

by Yasaswi Sateesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N3slTl

Posted by Katta

Usha Rani K కవిత

మరువం ఉష | అనుసంధానం ---------------------------- ఆ విముక్తాకాశతలాన విలాసంగా విహరించే విహంగం మదిలో అసూయ గుప్పిస్తోంది అప్రయత్నంగా రెక్కగూడు తడుముకున్నాను ఎక్కడో అగాథపు లోతుల్లో మొండి పర్వతం ఇబ్బందిగా కదులుతూనే ఉంటుంది ఊహల్లో ఎగిరే నాకింత అత్యాశ కలిగితే, గతించిన యుగాల్లో సుఖించిన రెక్కజోరు కడలి హోరులా ఊపుతూనే ఉండాలిగా ఈ విశాలభూతలాన విస్తారంగా పరుచుకున్న వనం ఎదలో అనుభూతిని రగిలిస్తోంది అనుకోకుండా కళ్ళు మూసుకున్నాను ఇక్కడే ఎక్కడో శాపవిముక్తి పొందని నిస్త్రాణ దేహమొకటి స్థాన భ్రంశం కోసమని ఆరాటపడుతుందేమో కలలకే అబ్బురపడే నేను, భ్రమణ కాంక్షకి లోనైతే కామరూప విద్యల కలదిరిగిన విలాసాలు శ్వాస నిశ్వాసలుగా ఆయువిస్తున్నాయేమో అనుభవానికి రాని ఆరాటాలు ఆగవెందుకో ఆనవాళ్ళ మాయతివాచీ మీద పయనాలు చేస్తుంటాయి నిదురలోనూ మూత పడని మనసు, మూస్తున్న కళ్ళలో పక్క వేసుకుంటుంది కుతూహలపు కేరింతలతో వింత ప్రదర్శనలు చూసి వస్తుంది 11/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g4CfuN

Posted by Katta

Murthy Kvvs కవిత

KVVS MURTHY|జ్ఞానీలు-32 మాటలు ఒక్కొక్కసారి వాటి భావాన్ని సరిగా మోసుకుపోలేవెందుకని..? మాటలు ఒక్కొక్కసారి ఒట్టి శబ్దాల వలెనె ధ్వనిస్తాయెందుకని....? మాటలు ఒక్కొక్కసారి వాటి వ్యతిరేక భావాన్ని వ్యక్తంచేస్తాయెందుకని...? మాట ఒక్కొక్కసారి కుంటిది...! మాట ఒక్కొక్కసారి మూగది...! ------------------------------ 11-3-2014

by Murthy Kvvs



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g4Cfeu

Posted by Katta

Aruna Naradabhatla కవిత

వృద్ధి _______అరుణ నారదభట్ల ఎంతకాలం అభివృద్ది బాటలోనే సాగుతాం వందేళ్ళు గడచినా నేర్చుకుంటునే ఉన్నాం! కాలాలు నల్లమబ్బుల్లా పరుగెడుతూనే ఉన్నాయి జీవితాలు కుప్పలుగా కూలడం గమనించావా!?! ఎన్ని కాగడాలో పథకాలై పరిచినా గుడిసె మేడయి కూచుందా...! రాచరికం రాజకీయమై రంగురాళ్ళలా పేరుకుపోతుంది! నడుస్తున్న వారసత్వం జీన్స్ తొడిగి నూతన భాష్యం చెబుతుంది! పెరిగే వృద్ధి రేట్లు కేవలం కొందరి లెక్కలే... వసుదైక కుటుంబపు రహదారి కింద కంకర రాళ్ళై నలిగిపోయే ఇసుక తిన్నెలను ఎప్పుడైనా పలకరించారా! సాఫ్ట్ వేర్ ఆడిన పాచికలో పెరిగిన ధరలను ఎన్నడైనా మాటాడిస్తే తెలిసేది పేదరికపు ఆనవాళ్ళు! భూమీ చిన్నది... అయినా మోసే స్థాయి కంటే ఎక్కువే మోస్తుంది... ఇసుకా చిన్నది అయినా భవంతులై మోస్తుంది ఇక్కడ అభివృద్ధీ అంతే....పేద..మధ్య తరగతులు భారాన్ని మోసి పన్ను కడితే రాజ్యమై నిలబడుతుంది! ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే... చెందిన దేశం ఎన్నడవుతుందో...మరి ఇంగ్లీషు రాజ్యలను వీసాలై ఆహ్వానించడానికి! 11-3-2014

by Aruna Naradabhatla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iwBZg8

Posted by Katta

Satya Srinivas కవిత

మోదుగ చంద్రవంక అర్ధచంద్రాకార కిటికీ అద్దం రాలిన చుక్కతో పడుకున్న నేను ఆకులు పూలైన మోదుగ వనంలా ఓ నగ్నాకాశం నేల వాంఛల పచ్చని పున్నమి వెన్నెలదారుల కలయిక మనస్సు చూచుక కళ్ళలో ఒకే దృశ్యమైన కనుపాప బీజం (నా ప్రయాణంలో వెన్నంటే వుండి, వచ్చిన మోదుగ పూలకి)

by Satya Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nF4VkH

Posted by Katta

Kavi Yakoob కవిత

SELECTED READINGS ~

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ke3FDK

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

సంటోడి కయిత్వం ----------------------------------------------- ఎం రా భయ్.. నువ్వేమైనా కవితల్గనుక్కున్నవా రా..? నువ్వు గాదూ, నీ ముత్తాతల్ గుడక పుట్తలే కవితల్బుట్టినప్పుడు.. అర్రె, ఏదో చంటి పోరగాండ్లు వాళ్లకొచ్చిన తీర్ల నాలుగు ముక్కల్ రాస్తంటే అది బాలే, ఇది బాలే అంటావ్.. ముళ్ళల్ల తిరిగి ఏరకొచ్చిన పండ్లమ్మె అవ్వకు దెల్సు కష్టమేందో.. అంతెగానీ బాల్కనీల మొక్కల్వెంచి సప సపా కొసుకదినే నీకేం తెల్సురా భయ్,, గట్లనే అప్పుడప్పుడే కవితలంట ఆసక్తొచ్చినోడికి ముంగలే బయపెడితే ఎట్ల.. అవసరమైతే గానికి అట్ల గాదు ఇట్లా అని సెప్పాలే.. ఒక పదం కాకపోతే ఇంకోటని సెప్పాలే.. అంతెగానీ ఇట్ల రాయద్దు అట్ల రాయద్దంటే గానికి అసల్ రాయడమే సిరాకొస్తది.. ఇంగొ ముసలాయనా.. నువు బానే గ్యానమున్నోనివి లే గానీ గిట్ల అందరికి గ్యానం రావల్నంతే ఇట్టంటి సిన్న సిన్న తప్పుల్జెయ్యలే.. చెయ్యకుంద ఎట్ల తెలుస్తయ్..? అర్రె మనింట్ల సంటోడే పది సార్లు లేస్తడు పడతడు.. ఇది గుడక అంతె అంకోవాలె.. నిజమే, తప్పుల్ని సెప్పకపోతే ఎట్టా తెలుస్తయ్ అంటావ్.. కరక్టే వయా, కానీ ఇంటి దానికి అది జేసిన కూర బాలే అన్నమనుకో ఎమైతది..? రెండో రోజు మన కడుపే మాడిద్ది.. అట్లగాకుంద గా కుర్ల అట్ల కాకుండ ఇట్టా సెయ్యవే నాకు శాన ఇట్తం అన్నవనుకో, ఏముంది ఇంగ పండగే పండగ.. గట్లనే వాడు ప్రతీ పాటకుడికీ కవి హృదయం ఇంటిదాని లెక్క.. దాన్ని ఎంత స్మూత్ గా యాండిల్ జేత్తే అంత సక్కటి కవిత్వం బైటికొస్తదప్ప.. ఏంది.. ఓకేగా..? - సాట్నా సత్యం, 11-03-2014, 15:12

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/N33UoX

Posted by Katta

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

కవిత్వీకరించటం - ఈరోజు చూసిన ఒక కొత్త పదం.. చాంద్ గారి కవితకి మన యాకూబ్ గారు ఇచ్చిన వ్యాఖ్య లో ఈ పదాన్ని వాడారు.. బాగుంది.. అనువదీకరించటం, ఆంధ్రీకరించటం, విశదీకరించటం లాగా "కవిత్వీకరించటం" అన్నమాట.. సొ మన మనసులో పుట్టిన భావాలని కవిత రూపంలోకి తీసుకురావటాన్ని "కవిత్వీకరించుకోవటం" అని అనుకోవచ్చు. - తెలుగు కవి సాట్నా సత్యం.

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NVnftj

Posted by Katta

Madhu Eruvuri కవిత

||మధు ఇరువూరి||గడ్డి పూలు-2|| పూటకో పువ్వు పూస్తూ...రాలుతూ... జీవితం. *** గోడపై శకుని ఎటుదూకాలో తెలియక మనిషి ఆలోచన. ***** రేయి ఓ నల్ల రాయి శూన్యంలో శిల్పానికి దిష్టి చుక్కలు తారలు. ***** ఊడ్చి ఎంత శుభ్రం చేసినా... మూల మూలిగే ముసలి చీపురు. ******* మనసులో మళ్ళీ పూస్తున్నాయి గడ్డి పూలు. 11-03-2014.

by Madhu Eruvuri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Ogv1Ov

Posted by Katta

Kapila Ramkumar కవిత

సిహెచ్.మధు||అధ్యయనంతోనే సాహితీ సేద్యం|| రచయితకు అధ్యయనం చాలా గొప్పది. అధ్యయనం లేకుండా మంచి రచయిత కాలేడనేది వాస్తవం. వర్తమాన రచయితలు, కవులు ఇప్పుడొస్తున్న రచనలన్నీ చదువుతున్నారా? చదవకపోవడం వల్లే మంచి సాహిత్యం రావడం లేదా? ఎందుకంటే రచయితకు అధ్యయనం చాలా అవసరం. అభిప్రాయాలతో మనం విభేదించవచ్చు. పుస్తకంలోని సిద్ధాంతం మనకు నచ్చకపోవచ్చు. రచయిత పేరు మనకు ఎలర్జీ గావచ్చు. పుస్తకం మీద ఎవరో చెప్పిన మాటలతో ఓ అభిప్రాయం ఏర్పాటుచేసుకోవచ్చు. అయినా ఆ పుస్తకం చదవాలి. తప్పక చదవాలి. అలా చదివినపుడే ఏది ఎందుకు నచ్చలేదో మనకు తెలుస్తుంది. ఏది ఎందుకు వ్రాయకూడదో మనకు తెలుస్తుంది. పది సంవత్సరాల క్రితం పేరుగాంచిన రచయితల గూర్చి, కవులగూర్చి ఒక మాట తరచుగా వినిపించేది. ఇంగ్లీషులో చదివి తెలుగులో రాస్తారని.. అందుకే ఇప్పుడు మన ముందున్న పేరున్న రచయితల ఇంటర్వ్యూలలో మీకు ఎవరి రచనలంటే ఇష్టం? అనే ప్రశ్నకు ఇంగ్లీషు రచయితలు కవుల పేర్లు, పుస్తకాల పేర్లు చెపుతుంటారు. ఇంగ్లీషు సాహిత్యం తప్పని అనలేం. అది ప్రపంచ సాహిత్యం. అయితే ఇంగ్లీషు సాహిత్యం చదవటమే ముఖ్యం కాదు. తెలుగు సాహిత్యంలో ఎన్నో మంచి రచనలున్నాయి. తెలుగు సాహిత్యమంటే వీరికి ఎలర్జీ. ఇది మంచి అధ్యయనం గాదు. కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’ గొప్ప కథ, తెలుగు కథకు వనె్నతెచ్చిన కథ. దీన్ని వర్తమాన రచయితలలో ఎందరు చదివారు? ఈ కథే చదవనపుడు- మిగతావి చదివినా అది ‘అధ్యయనం’ క్రిందికి రాకపోవచ్చు. ‘మంచికథ’ చదవాలి. మంచి కవిత్వం చదవాలి. మంచి నవలలు చదవాలి- వీటన్నిటికంటే విమర్శనాత్మక సాహిత్యాన్ని ఒంటబట్టించుకోవాలి. విమర్శ అంటే మెచ్చుకోలు గ్రంథాలు కావు. సాహిత్య లోతుపాతులు సామాజిక దృష్టికోణంతో వచ్చిన ‘విమర్శ’ పుస్తకాలు చదవాలి. ఈ గ్రంథాల నుంచి చాలా నేర్చుకోవచ్చు. రావూరి భరద్వాజ నవల ‘పాకుడురాళ్లు’కు జ్ఞానపీఠ అవార్డు యిచ్చారు. అంతకుముందు ఆ నవల గురించి పెద్దగా తెల్సింది లేదు. జ్ఞానపీఠ అవార్డు లభించిన తర్వాత ‘పాకుడురాళ్లు’ను- భరద్వాజను అందరూ ఆకాశానికి ఎత్తుతున్నారు గానీ- ‘పాకుడురాళ్లు’పై విమర్శనాత్మక వ్యాసం ఇప్పటివరకు రాలేదు. సరియైన అధ్యయనం జరిపినపుడు ఈ విషయం కూడా రచయిత దృష్టిలోకి వస్తుంది. అధ్యయనం అంటే రామాయణ భారత భాగవతాలను కూడా చదవాలి. వేదాలు చదివితే ఇంకా మంచిదే! ఖురాన్, బైబిల్ చదివారా? రచయితకు అన్నీ తెలిసివుండాలి. గతం వర్తమానం బాగా గుర్తింపు వుంటే భవిష్యత్తు చెప్పగలడు. భవిష్యత్ పరిణామాలు చెప్పగలవాడే మంచి రచయిత. భగవద్గీత చదివారా? ఇది సాహిత్యం కాదని అనుకోవద్దు. భగవద్గీతలో సాహిత్యముంది. ప్రతి అక్షరంలో సాహిత్యముంటుంది. అక్షరమే సాహిత్యం. ప్రతి రచయిత ‘మార్క్సిజం’ చదవాల్సిన అవసరముంది. మార్క్సిజం మూల సూత్రాలు తెలుసుకోకుండా ‘రచయిత’ మంచి రచనలు చేయలేడు. ‘గతి తార్కిక భౌతికవాదం’ ‘పెట్టుబడి- దాని పుట్టుపూర్వోత్తరాలు’ ఇవి తెలుసుకోకుండా ప్రజల గూర్చి- వ్యవస్థగూర్చి ఏమి వ్రాయగలం? ‘మార్క్సిస్టు’ అయినా- విశ్వనాథ వేయిపడగలు చదవాల్సిందే, కృష్ణశాస్ర్తీ వెంకిపాటలు చదవాల్సిందే. మన రాజ్యాంగం మూల సూత్రాలు చదవకుండా మంచి రచయిత కాలేడు. అధ్యయనం అంటే ఇదే! సాహిత్యానికి రాజ్యాంగానికి సంబంధమేమిటని రచయిత భావిస్తే- ప్రపంచ జ్ఞానం రచయితకు కరువవుతుంది. రాజ్యాంగం తెలియకుండా మంచి సాహిత్యాన్ని ఎలా సృష్టించగలం? ప్రజల కన్నీళ్లకు, బాధలకు కారణాలు తెలుసుకోవాలంటే రాజ్యాంగం చదవాల్సిందే. ‘రాజ్యాంగం’ అంతిమ లక్ష్యం సమానత్వం. అంతరాలు లేని సమాజం. ఇపుడు అంతరాలు పెరుగుతున్నాయి. ఇవి తెలియటానికి రచయిత రాజ్యాంగం చదవాల్సిందే. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడో ఓ దగ్గర ఎన్‌కౌంటర్ జరిగింది. కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఎందుకు? ఇవి అన్నీ రచయితకు అవసరమే, కారణాలు తెలియాల్సిందే. రైతు ఆత్మహత్యను కథగా, దుఃఖంతో కవితగా వ్రాసినా, రాజ్యాంగం తెలియకుండా రాస్తే పరిపూర్ణత వుండదు. తెలిసి రాస్తే ఆ రచనలో చాలా లోతులు కనిపిస్తాయి. ‘అధ్యయనం’ అనేది చాలా గొప్పది. పుస్తకాలు చదవటం అలవాటు కావాలి. విసుగు అనిపించకూడదు. టైంపాస్ కొరకు చదువుతున్నామనుకోకూడదు. మొదట చదవకుండా వుండలేం అనే పరిస్థితి రావాలి. ప్రతిదినం ఏదైనా పుస్తకం చదవకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ కావాలి. దిన చర్యలో ఏదో లోపం జరిగినట్టుగా భావించగలగాలి. కొందరు పెద్ద రచయితలు కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలు చదివామని చెప్పుకుంటారు. అవి అందరినీ చదివించే నవలలు. అధ్యయనంపైన ఆసక్తి కల్గించే నవలలు. నవల ప్రారంభించిన తర్వాత ఆఖరు వరకు విడిచిపెట్టలేం. ఇటువంటి పుస్తకాలు డిటెక్టివ్‌లోనే కాదు, శరత్‌బాబు నవలలు చదివి చూడండి. గొప్ప నవలలు అధ్యయనం పెంచే నవలలు బెంగాలీ రచయిత కావచ్చు. తెలుగు అనువాదం సులభంగా చదివిస్తుంది. అనువాద నవలలుగా వుండవు, శరత్‌బాబులోనే ఆ ప్రతిభ వుంది. దేవదాసు అందరికీ తెలుసు. భారతి, శేషప్రశ్న, చరిత్రహీనులు- ఈ నవలలు చదివిన తర్వాత తెలుగులో ఇంత మంచి నవలలు వచ్చాయా అనిపిస్తుంది. అధ్యయనం లేకుండా మనం మంచి రచనను సృష్టించలేం. మంచి కవిత్వాన్ని అల్లలేం. అజంతా చెట్లు కూలుతున్న దృశ్యం. తిలక్ అమృతం కురిసిన రాత్రి, శివసాగర్ కవిత్వం మొత్తం చదవాల్సిందే. మొదట చదవటం అలవాటు కావాలి. అధ్యయనం అలవాటు అయితే పుస్తకం విడిచిపెట్టలేరు. అధ్యయనం ప్రతి రచయితకు వ్యసనంగా మారాలి. మంచి కవి, మంచి రచయిత కావాలంటే మంచి పాఠకుడు కావాలి. మంచి పాఠకులవౌదాం.-, 9949486122 10/03/2014http://www.andhrabhoomi.net/content/a-26

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUZgdR

Posted by Katta

Kavi Yakoob కవిత



by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ggE4tj

Posted by Katta

Narayana Sharma Mallavajjala కవిత

జుగుప్స __________________________ అక్కడక్కడే అక్కడొక్కదగ్గరే బతికెయ్యాలి అసలిక్కడెవడూ అవసరం లేదు వాడుమసైతున్నా నున్నటి ఎగిరె జెండానే కలగంటూ జీవితాన్ని వదిలేసి నానుంచినేను స్ఖలనమైపోయి నామట్టిలేకుండా పాండ్స్ పౌడర్ పూసుకుని పెద్ద ఆకాశంలో గిలగిలా తన్నుకుంటూ ఒక్కొక్క రాత్రీ నువ్వు వెన్నెల్లో కూచుని రక్తంతో పావురాళ్లబొమ్మలుగీసి వరి పండిచొచ్చు సత్యాన్నో అసత్యాన్నో భ్రమనో విభ్రమాన్నొ తర్కిస్తూ తాత్వికమనితేల్చేస్తూ నున్నటి బోడగుండుమీద చక్కటి సరళరేఖని గీయొచ్చు ఆచ్చాదన అవసరంలేకుండా ఓ నల్లటి పిడికిలిని పట్టుకొని బతకొచ్చు ఆకుల్నినాకి స్వర్గాన్ని చేసిందెవడు ఉన్నదగ్గరే కళ్లు ముడుచుకుని భ్రమించడం తప్ప నిమిషనిమిషానికి అలా మునిగిపవిత్రమవలేను ఒకే సారి చచ్చి..మళ్లీ మళ్లీ నేనుగా పుడుతాను

by Narayana Sharma Mallavajjala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ggE2By

Posted by Katta

Sky Baaba కవిత

మొహబ్బత్ కీ తాజీ దునియా `-.-`-.`-.-`-.-`-.-`-.-`-.-` తను తోడిందాకా తెలియరాలేదు నాలో ప్రేమ జల ఇంకి పోలేదని..! * తను జలజలా మాట్లాడుతుంటే గలగలా నవ్వుతుంటే టపటపా ఆ కనురెప్పలు కొట్టుకుంటుంటే చకచకా సౌందర్య శాస్త్రమేదో చదువుతున్నట్లుంటుంది నాకు తన హావభావాలపై మనసులో ఎన్ని కావ్యాల్ దొర్లిపోతుంటాయో..! ఆ కనుల రశ్మికి మాటి మాటికీ నా మోము వెలుగుతూ... ...! నన్ను చూసిన మెరుపుతో నన్నే పొదువుకునే ఆ తేనెల కనుపాపలకు నా రూపం రోజు రోజుకీ దగ్గరవుతూ... ... ఇద్దరి ముచ్చట్ల గిచ్చుట్ల మైమరపులకు కాలం స్థాణువై నిలుచుండి పోతుంది చుట్టూ జన హోరు మా ఇద్దరి గొంతుల మధ్య నలిగి మూగబోతుంది మనసు లేకమైతేనే లోకం అద్రుశ్యమైపోతున్నదే... ఇక తనువు లేకమైతే... ... ...! * స్థిత ప్రగ్నుణ్ణని మహా గొప్పలు పోయేవాణ్ణి తను పాదం మోపి నా అహాన్ని వెయ్యి ముక్కల్ చేసింది

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivSHMv

Posted by Katta

Kapila Ramkumar కవిత



by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUNkZs

Posted by Katta

Kapila Ramkumar కవిత



by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUNkJ5

Posted by Katta

Kapila Ramkumar కవిత



by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oHy51p

Posted by Katta

Nvmvarma Kalidindi కవిత

కె.ఎన్.వి.ఎం.వర్మ//107 DSNR to SEC// కాకా నాల్గు దినాలైంది కనిపిస్తలేవ్? సుస్తీసేసుండె దావఖన బోయిన టికెట్ టికెట్ ముషీరాబాదా అన్నా పదమూడు రూపాయలు మూడు రూపాయలు చిల్లరియ్యన్నా... టికెట్ తీసుకుని కిటికీలోంచి చూస్తున్నా కొండను తవ్వి కట్టిన బవంతులు సిగ్నల్ దగ్గర పెరిగిన బిచ్చగాళ్ళు ఎన్ని చెరువులుండేవి ఈ పట్నంలో ఇప్పుడన్ని షాపులముందూ వాటరు బాటిల్సే మొలలో చిన్న గుడ్డ సంచి నోట్లో ఆకు వక్కతొ పండిన ఆ అవ్వ చటాకో అర్దపావో కూరలమ్ముతూ కంటబడుతుందనుకుంటే నిరాశే ఆవహించిది ఆ పుటెపాత్ మీద ఆమేనా ఆ ముసలి లంబాడీ చిన్నప్పుడు బాలానగర్ రింగులో ఎడ్లబండి మీద సీతాఫలాలు అమ్మిన ఆమేనా సంఘటిత సంచార జాతులూ ఒంటరివాళ్ళయ్యరే ఆ పట్నం ఆ లష్కరూ మారిపోయిందే... ఆలోచనలకి సడన్ బ్రేక్ పడ్డ బస్సు అందరినీ అటో ఇటో విసిరేసింది ఒక చేత్తో తోలు డబ్బు సంచి ఒకచేత్తో టికెట్లు తూలుకుంటా పోయి డ్రైవరు దగ్గర ఆగాడు కండక్టర్ ఇంద అని సాయి బాబా గుడికి పోయొస్తున్న బిడ్డ సంగం అరటి పండు కండక్టరుకి ఇచ్చి ఇంకో పండు డ్రైవరు ఇవ్వమని ఇస్తే డ్రైవర్ ఆలీ సాబ్ నాకు సగమే నీకు మొత్తం పండు దానే దానేమే కానేవాలేకా నామ్మ్ అరటిపండు అరటిపండుమే కానేవాలేకా నామ్మ్ అంటూ కండక్టర్ నువ్వు నీ బిడ్డలు సల్లగుండాలె అక్కా చిలుకూరి బాలజీ జై అనగానే బస్సంతా అమ్మల అక్కల జ్ణాపకాలే నేనూ అరటిపండు అడిగి తిన్నాను దిగుతూ కండక్టరుతో హైదరబాదు మారలేదు అన్నంతలోనే రైట్ రైటంటూ బస్సు ముందుకు సాగిపోయింది....10.03.2014.

by Nvmvarma Kalidindi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nf9Wnl

Posted by Katta