పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మే 2014, సోమవారం

Jwalitha Denchanala Jwalitha కవిత

జ్వలిత/చండాలిక రాజ్యం వీరస్వర్గాన్ని విశ్వసించని రావణ సంతతి నేను నా నీడలు నేలను తాకవు నా దు:ఖనది నిద్రపోదు దారాలు మెడల్లో కట్టబడి కొందరు నడుముకు చుట్టుకొని మరికొందరు వేపుల మీదుగా చుట్టుకొని ఇంకొందరు పవిత్ర సమూహాలయి సంచరిస్తూన్నారు నూలుపోగులు ఏ మూల చుట్టబడినా బడుగు బహుజన బాహుభలులు కుబుసాలను వదిలించుకోవాలిప్పుడు కోరకుండా లభించిన చ్నద్రహాసం బలి కోరుతూ తలపై వేలాడుతూన్నది పడగలిప్పిన వర్ణసర్పాలు శ్రీరంగ నీతుల ధర్మాని భోదిస్తూనే ఉన్నాయి స్పృహను చైతన్యంగా మార్చగల చాతుర్యం ఒక ఔషధం పొదల మధ్య వధించబడుతున్న జంబుకుమారులు కాంక్రీటారణ్యంలో వేటాడబడుతున్న తారకా సమూహాలు లోహపు తెరల మాటునసమ్హరించ బడుతున్న శంబూకులు ఏక మంత్రోచ్ఛారణతో అజగస్తనాలు కుట్రను గుర్తించాలి రుషుల మూలాలు నదుల మూలాలు లభ్యమే అనాదిగా స్త్రీసమ్హార మూలాలే అలభ్యం సంతృప్త స్థానాల అధికారాన్ని దొరకనివ్వనిది దు:ఖనాడులను పసిగట్టిన హరిశ్చంద్రం పవిత్ర పట్టెడను పట్టిబిగించిన పాతివ్రత్యం పుట్టబోయె ముసలాలను మనువు కాతాలో వేసే బానిసత్వం వీరులయిన వారి పార్దివదేహాలూ గౌరవయోగ్యాలే జీవితాంతం ధీరవనితలకు వీరమాతలకు అవమానాల ఆభారాణాలే లభ్యం సకల యుగాల యగ్నవల్కులందరూ మారు మనువులకై కాత్యాయనులను అన్వేషిస్తారు మోదుగుపూవనాలు బహువిధ పవనాలను కూడి ధర్మరాజు రథాలయి గులాబీ ఏకవీరులతో ఏకమవుతున్నాయి జేగురు రంగు బాసలతో జీబురుగడ్డపు నల్లని ముసుగు శ్వేతవస్త్రాల వెనుక వున్న నెత్తురు మరకలు రేపటి చరిత్రకు పునాదులు అధికారపు కత్తిపదునున్నవాడు ఏరంగునయినా ఏమారుస్తాడు అణిచివేతల రాజ్యం పై కత్తిగట్టే వాడికి ఏ రంగూ అవసరం లేదు పైడికోటల్లో పసిడిబొమ్మలను ఎండ కన్నెరుగని వెండికాంతలను పక్కకు నెట్టి కాలచక్రంలో కణకణమండే కాష్టం నుండి లేచి నిషిద్ద మర్మాలెరిగిన చండాలిక రాజ్యమేలాలి ......... జ్వలిథ/ చండాలిక రాజ్యం/ 25-05-2014(ఉదయం 5.50)

by Jwalitha Denchanala Jwalitha



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r7QBXh

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి