పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మే 2014, సోమవారం

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా/యువత నేలపై ను0చి నూకలు ఏరుకు0టున్నా మట్టిలో ను0చి బయిటికొచ్చి పందిరి ఎక్కుతున్నా ఒక్కో రాయిని ఏరుకొని పేర్చుకొని గోడగా తయారవుతున్నా నరాలను మెల్లగా ఇచ్చుకు0టుకున్నా లోపల రక్తం బలాన్ని పు0జుకు0టున్నా పరిగెత్తమంటే ఎలా యుద్దానికి దిగమంటే ఎలా పులులను బోనులో బంది0చి జి0కలు విహరి0చేనా పిల్లులను బొక్కలో తోసి ఎలుకలు ఇల్లంతా తిరిగేనా ఆధిపత్యం ఆధిగా వస్తు0టే ఇష్టానుసారంగా ఎదగడానికి చోటెక్కడా చెప్పి0దే చెయలనే తల్లీ దండ్రుల ప్రేమ నచ్చి0దే చెయమనే స్నేహితుల ఇష్టం నీ స్థాయిలోనే ప్రయత్ని0చమనే ధనాపత్యం ఆధిపత్యల ఈర్ష పెరగడాల మధ్య పె0చడాల మధ్య వత్తి ఎముకలు ఇరగదీస్తు0టే వీల్ చెయిర్ ఎక్కకా ఏమవుతు0ది యువత. 26-05-2014

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r7yeBI

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి