పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మే 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

తస్మాత్‌ జాగ్రత్త Posted on: Sun 25 May 22:52:03.703351 2014 ఒక అప్రకటిత నిషేధాజ్ఞ ఇక ఎప్పుడూ నీ కనురెప్పల నీడ కింద నీడలా మెదులుతుంది అదృశ్య ఆంక్షల ఇనప వలల విసురు శబ్దాలు ఎప్పుడూ నీ దేహం లోలోపలి చెవుల్లో అలజడి సృష్టిస్తాయి నీ అక్షరాల మీద నీ కలమే నిఘా కన్ను వేస్తుంది కాళ్ళూ చేతులూ కళ్ళూ చెవులూ కనపడని తాళాలు మోసుకుంటూ కదులుతాయి అంతా ఎప్పట్లానే ఉంటుంది కానీ స్వేచ్ఛగా నీ గుండె ఊపిరి పీల్చుకునేప్పుడు మాత్రమే శ్వాసనాళంలో ఓ చూపుడు వేలు అడ్డు తగులుతుంది నీతికీ అవినీతికీ కొత్త నిర్వచనాల నిఘంటువుల తయారీ మొదలవుతుంది ఇక అంతా మోరల్‌ పోలీసింగ్‌! పద్మవ్యూహాల కత్తుల పంజరాలే! గుండెల మీద చెగువేరా బొమ్మలతో చేతుల్లో కమలాలతో రోడ్లూ గేట్లూ కూడా మన పబ్లిక్‌ పార్కుల్ని హెచ్చరిస్తూ పహారా కాస్తాయి! వేలాడదీయండి.. మీ కలలకైనా.. కనుచూపులు ముడిపడే మునిమాపులకైనా తూర్పును చెక్కే వెలుగు ఉలులకైనా రాత్రిని పాడే అక్షరాల అలలకైనా ఎక్కడైనా సరే వేలాడాల్సింది మేడిన్‌ ఇండియా శిలాఫలకాలు మాత్రమే! ఇక భయం కూడా ఒకానొక అవ్యక్త సుషుప్త నిశీధి నిశ్శబ్దంలో భయం భయంగా ముడుచుకుపోవాల్సిందే! ఉన్నట్టుండి నీలో దేశభక్తి లబ్‌ డబ్‌ శబ్దాలు కనపడని నియంత్రణ రేఖల దగ్గర నెత్తురు కక్కుకుంటాయి వస్త్రాలనే కాదు, చర్మాలను చీల్చి కూడా నీలో లౌకికత్వానికి డిఎన్‌ఏ పరీక్షలు సాగుతాయి నీ చుట్టూ నీ ఆలోచనల కంచె నీ చేతే వేయించి చేను మేసిన నేరారోపణ నీమీదే మోపి నిన్ను చూసి నువ్వే నవ్వుకునే ఏడ్చుకునే నీ నుంచి నువ్వే పారిపోయే పరిస్థితులు కల్పించి నీ పక్కనుంచే ఓ గాలి దెయ్యం కదిలిపోతుంది వాసన..వాసన.. పురా సంస్కృతి సురావాసన రెచ్చిపోతే మధువు చచ్చిపోతే విషం మిత్రులారా!.. ఇక జాగ్రత్త ఇక్కడ దేశం ఉంది దేశమంటే మనుషులు కాదోరు మతమోరు! - ప్రసాదమూర్తి 8498004488 http://ift.tt/1mcAAbx

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mcAAbx

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి