పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మే 2014, సోమవారం

Kapila Ramkumar కవిత

చుండూరు తీర్పునకు నిరసనగా కవితా సంకలనం Posted on: Sun 25 May 22:49:21.62343 2014 1991 ఆగష్టు 6వ తేదీన గుంటూరు జిల్లా చుండూరు దళితవాడపై వందలాది మంది భూస్వాములు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిచేసి 8 మందిని దారుణంగా హత్య చేశారు. అందులో ఇద్దరిని పరమ కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి గోనెసంచుల్లో కుక్కి తుంగభద్ర కాలువలో విసిరివేశారు. దశాబ్దాల తరబడి విచారణ జరిగిన ఈ కేసులో ప్రత్యేక కోర్టు 21 మందికి యావజ్జీవ శిక్ష, 53 మందికి జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవని, ముద్దాయిలందరూ నిర్దోషులని తీర్పు ఇచ్చింది. అందరూ నిర్దోషులైతే హంతకులు ఎవరు? చుండూరు తీర్పుకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసనోద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో దళిత రచయితల వేదిక చుండూరు తీర్పుకు నిరసనగా వెలువరించబోయే కవితా సంకలనం కోసం కవితలను ఆహ్వానిస్తున్నాం. కవితలను జూన్‌ 20లోపు లాడె ధనంజయ, బి-4-122, బి.కె. ఎన్‌క్లేవ్‌, మియాపూర్‌ - 500 050, సెల్‌ : 9618241994 చిరునామాకు పంపాలి. - లాడె ధనంజయ

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mcAAbA

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి