పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

26, మే 2014, సోమవారం

Sanjeev Goud కవిత

SANJEEVANAANEELU/sanjeevgoud మరో ప్రపంచపు రూపకల్పనకై మహాప్రస్థానంచేస్తున్నయోధుల్ని వాళ్ళ త్యాగం వాళ్ళ యాగం గుర్తించక వారి చావుకి వాళ్ళనోదిలేసిన ఈ లోకంలో ఎన్నికల గందరగోళపు గల్లిల అంగట్లో పదవులపందేరపు లోల్లిగాల్ల సందట్లో రాజకీయ ఉద్యమాటికలో ఓటి పాత్ర ఓలే రాజనేతిరాక్షసక్రీడలో క్షీణభాగమై పోయి ఉద్విగ్నత ఉగ్రమయ్యొ ఉద్రేకమే ఎక్కువయ్యో ఉరుకుతుంది ఎందుకోసమో ఎరుగని ఉడుకు నెత్తురు వయసుఉరవడి లో ఆత్మ బలిదానం చేసుకున్నదొకడైతే అతడి సమాధిపై హక్కుల బేరమింకొకడిది !! బిడ్డ శవాన్నితాకలేని తలితండ్రుల శోకానికి బడాదొరల స్లోగన్తో అమరుడని బిరుదొకటి !! అందుకే చిన్నా ! అనుభవంతో చెబుతున్నా !! నీవెంతమాత్రమూ కపటోద్యమాలకు కవచమై ఉండకు !! నీ కన్నవారి కలలకి ఆశలకి నిప్పుల కుంపటి వై మండకు !! నీ కన్నవారికి నిన్ను నమ్ముకున్న వారికీ ఊతమవ్వు !! నీ ఉన్నఊరుకి నిన్ను కోరుకున్నవారికి చేయుతనివ్వు !!! నిజమైన నీ సమర స్పూర్తికి నీవే సమర్థ నాయకుడివి !! నిక్కమయిన నీ మనో ప్రపంచానికి నీవోకడే పాలకుడివి !!!

by Sanjeev Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Rrs66A

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి