పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మే 2014, మంగళవారం

Sree Kavita కవిత

||శుభసూచకాలు|| శ్రీ కవిత @ 06.05.2014 గగగన కుసుమ వయారియది నీ వదనం ఎదో మరిచీ మరువని వలపు కొమ్మల్లో దాగిన కోయిల పిలుపులా మది వూహల్లో పరిమళించిన సంపంగిలా కళకళలాడే నా వూహా సౌంధర్య రాశి ఊర్వశి వంటి నీతో చెలిమి నాకెంతో కలిమి మేనకలా మెరిసే నీ అందం కలిగించెను నాకెంతో మనో ఉల్లాసం చెలిమితో కలగలిపి అందంగాచిరుమందహాసంతో చిద్విలాసంలా ప్రతిబింబించే ముఖారవిందం కలిగించును నా మదిలో పులకింతల గమకం నీ హృదయం కోరాలనీ నా వూపిరి సాగాలనీ నీ మనసంతా నేనై నిండాలనీ నా కలలు పండాలనీ పరిపరి విధాల తలచి వలచాను నీ మమతల బంధాలతో ఈ ప్రపంచాన్నీ మరిచాను నీ పలుకుల మాధుర్యంలో ఇహలోకంలో మునిగి నిన్నే నా దేవిగా తలచి ప్రతి నిత్యం ఆరాధిస్తున్నాను పెద్దగా నిన్ను ఏది కోరను నా పేద మనసుతో నీ పెదవుల చాటున దాగిన ఆ "చిరునవ్వు" తప్ప అందమైన ఆ చిరునవ్వులు మన నిష్కల్మష మైన ప్రేమకు అంకురాలు వలపుల బంధానికి శుభసూచకాలు

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kGxw5C

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి