పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మే 2014, మంగళవారం

Krishna Mani కవిత

చూస్తున్నా ___________________కృష్ణ మణి నన్ను కాల్చి నన్ను కొట్టి నన్ను ఒంచి ఒక ఆకారాన్ని ఇచ్చి నన్ను మనిషికి మిత్రున్ని చేసిన చేతులకు వందనాలు ! బతుకు నడకలో మనిషికి తోడునై నేలకు గాట్లు పెట్టె నాగలి మొననై కలుపులేరే కల్వారనై పంట కోసే కొడవలినై యంత్రమై నాగరికతలో భాగమై మనిషి ద్వారా ఎంతో ఎదిగాను కాని , మనిషి అనాగరిక లక్షణాలను మాత్రం వదలలేదు అందుకే మల్లి కణకణ మణి నిప్పుల కొలిమిలో దాగి కూర్చున్న కమ్మరి మనసున కసిని చూస్తున్న లోకం తీరులో చీకటి బేతాలలను చూస్తున్న ! బీదల బిక్కుల బాదల కేకలు వింటున్నా కన్నవారినే కడతేర్చే కసాయి పాపాత్ముల చూస్తున్న బేలపై అడివి మృగాల ఆకలి చూస్తున్న తెల్ల బట్టల్లో మెరిసే నల్లని మనసుల్ని చూస్తున్న ఆన్యాయాన్ని ఆటగా చూసే వెకిలి నవ్వుల నోళ్లను చూస్తున్నా ! నీచుల తలలు నారికే గండ్ర గొడ్డలిగా మారాలని చూస్తున్న చేతినేత్తి నన్ను పట్టే మనిషి కోసం ఎదురు చూస్తున్నా ! కృష్ణ మణి I 06-05-2014

by Krishna Mani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1on0MC4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి