పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మే 2014, మంగళవారం

Ravela Purushothama Rao కవిత

పునఃస్మరణ ^^^^^^^^^^^^^^^^^^^^^^^ రావెల పురుషోత్తమ రావు ఎప్పుడు దాని వైపు దృష్టిని సారించినా అది ఎంతో ఉన్నతాసనంగానే నాకు అవగతమౌతుంది అతితి అభాయాగతులను సముచితంగా ఆదరించే గృహష్తు గానే నాకు అనవరతం గోచరిస్తుంది. తన రెండు చేతులను బార్లా సాచి వారినాహ్వానించే గృహస్థులాగా సౌహార్దాన్నీ సౌజన్యన్యాన్నీ కలబోసిన వ్యక్తిగా నా చెవులకు ధ్వనిస్తుంది. ఆదరాభిమానాలను అందించడంలో తనకెప్పరూ సాటిరారన్నట్లు ప్రవర్తిస్తున్నట్లుంటుంది. భోజనానంతరం భుక్తాయాసం తీర్చుకునే పట్టెమంచంలా దర్శనమిస్తుంది. హంసతూలికా తల్పంలా శయన శుఖాన్నందిస్తుంది. అది ఎందుకో చాలామందికి బద్ధకమ్నేర్పే యంత్రంలా సాక్షాత్కరిస్తుంది. అయినా నాకు మత్రం అది స్నేహశీలిగా ప్రవచనాలు పలికే హితైషిగానే నన్ను నడిపిస్తూ అత్యంత ఆదరాభిమానాలను చూరగొన్న పడకకుర్చీ నీకు శతాధిక అభిందనపూర్వక కృతజ్ఞతలు. [నరసరావుపేట చెక్క కుర్చ్చీలను మనోపధంలో స్మరించుకుంటూ]--6-may -14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QapY2G

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి