పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మార్చి 2014, గురువారం

Gaddamanugu Venkata Satyanarayana Rao కవిత

తను నా అభిమాని తను నన్ను అనుసరిస్తుంది.. నా ప్రతీ కదలిక పరికిస్తుంది.. పరిక్షిస్తుంది.. నా తప్పుల్లో తనకేదో ఒప్పు కనిపిస్తుంది.. దానిని కూడా మహా ప్రసాదం లా స్వీకరిస్తుంది.. నాతో మాట్లాడుతుంది.. నాతో పోట్లాడుతుంది.. మిగిలిన పనులకు ఎందుకు ఆలస్యం చేస్తున్నానని.. నన్ను ప్రోత్సహిస్తుంది.. నాకు బలాన్నిస్తుంది తనెంత అభిమానిస్తోందో చెప్పి తనలాగే ఎంతమంది అభిమానిస్తున్నరో చెప్తుంది.. ఇంక ఎందర్నో అభిమానులుగా చేసుకునేందుకు ఊతంలా తన మధురమైన మాటల మల్లెలు నాపై కురిపిస్తుంది.. నాకు తెలియకుండానే నాపై తన మదిలో ఓ పుస్తకాన్ని రచిస్తుంది.. ఆ పుస్తకాన్నే మళ్ళీ మళ్ళీ చదువుకుంటుంది.. తన మార్గదర్శకం ఆ పుస్తకమే అని నాతో గర్వంగా చెప్తుంది.. నాకెవరున్నారని నేను ఆలోచించే సమయాన నాకై తన దగ్గర ఒకటి ఉన్నదంటూ తన లో దాక్కున్న "అభిమానా"న్ని కొంత వొలకబోస్తుంది.. నాకు తను వొలికించిన అభిమానం కల్ప తరువుగా గోచరిస్తుంది.. ఇక అక్కడ్నుంచి నాకు కనక యోగం పట్టుకుంటుంది.. బంగారు ఆలోచనలు బయలుదేరుతాయి. అవి ఒక గమ్యాన్ని చేరే క్రమంలో వాటికి మళ్ళీ తనే ప్రేరణగా నిలిచి ఆయువై చేవందించే నీలాకాశం గా నిలుస్తుంది. క్రమంగా తనలో నా అలోచనల్ని నింపుకుంటుంది.. ఆలోచనలు కాస్తా అంతర్ముఖంగా నన్ను అనుసరిస్తుంటాయి. ఇంకేముంది చివరికి ఒక్కో ఆలోచన ఒక్కో నేనుగా పరిణితి చెంది నా అభిమానే నేనైపోయి నేనైన వేలమంది నా అభిమానుల్ని తయారు చేస్తుంది. - సాట్నా సత్యం గడ్డమణుగు, 06-03-2014, 16:30

by Gaddamanugu Venkata Satyanarayana Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f0qZEd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి