పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, జూన్ 2014, బుధవారం

Yessaar Katta కవిత

సురెక || తెలుగు గజల్-10 .. మనిషికి మనిషే తోడై నిలుచునులే మనసన్నది ఇస్తుంటే మనిషికి మనిషే నీడై మెసలునులే మమతన్నది ఇస్తుంటే. కులమతభేదాల గడులు బీటలు బాఱునులే మంచితనం మనిషిలో చిరునవ్వులు వీస్తుంటే. పరమతవాదాల సుడులు మెల్లగా మారునులే ప్రేమబలం మనిషిలో విరిపువ్వులు పూస్తుంటే . తరతమరాగాల సడులు తక్కెఱ చేరునులే స్నేహగుణం మనిషిలో సిరితొవ్వలు వేస్తుంటే. స్వ-పరప్రాంతాల జడులు చక్కగ తీరునులే అన్యోన్నత కాంతుల్నీ మదిదివ్వెలు యిస్తుంటే . ఈర్ష్యాద్వేషాల మడులు సుధలుగ మారునులే సహనత్వం ఆసరుండి బరిదవ్వులు కోస్తుంటే . .. (తెలుగు గజల్-10 ....... 04/06/2014)

by Yessaar Katta



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Tc3FvG

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి