పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, జూన్ 2014, బుధవారం

Swatee Sripada కవిత

ఒక తియ్యని మాట ఎప్పుడైనా ఒక తియ్యని మాట ఎంత ఇంపుగా ఉంటుంది వెన్నెల మెత్తగా పరిమళం చేసి ఒంటికి అద్దుకున్నట్టు తొలకరి చినుకుల్లో తనివితీరా నడి వేసవి సేద దీరినట్టు హరిత పవనపు కొండ గుండెల్లో తూనీగై పరుగులు తీసే ఊహ రెక్కలపై వాలి ఆద్యంతాలను తడిమి తడిమి వచ్చినట్టు ఒక తియ్యని మాట .... తేనెలో నాని నాని ఊరించే సుమధుర స్వప్న సీమ ఉదయం స్వర సీమను సవరించుకు కలకూజితమైనట్టు సెలయేటి నీటి వాలున దూదిపింజల్లా నునుపు బారిన గులకరాళ్ళ సుతిమెత్తని అలవోక పలకరింపుల్లా అంతర్లీనంగా ఒక ఆవిష్కరి౦పబడని అద్భుత చిత్రం రాగాల తునకలను గులాబీ రేకుల్లా పెదవులపైన వెదజల్లినట్టు ఒక తియ్యని మాట ............ ఎక్కడి కల్పవృక్ష జలజలా రాల్చిన పారిజాతాల్లా మంచు పూ రెక్కలు మధ్యలోనె కరిగి చుక్కలు చుక్కలుగా బీటలు వారిన మౌనపుటవని పొరల్లోకి ఇంకి కనురెప్పలపై లాలిపాటై నేనున్నానంటూ గుండెకు హత్తుకునే ఒక తియ్యని మాట .............. వగరు పిందెలు సమయాన్ని ఆస్వాదించి మధురఫలాలుగా మాగినట్టు అక్షరాలూ మనసు భాషను మేసిమేసి హరివిల్లు రాగాలుగా సాగినట్టు ఒక తియ్యని మాట దిగంతాల ముంగురులు సరిచేసే సముద్రపుటలలా కాస్త కాస్త ఉనికిని ఆక్రమించి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ...........

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SrexFd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి