పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, జూన్ 2014, బుధవారం

Thilak Bommaraju కవిత

తిలక్ /ఖాళీ సముద్రం ____________________ సముద్రపు కళ్ళు మట్టిని నింపుకున్న తీరాలు అలలన్నీ అలసి ఒడ్డుకొచ్చి కూర్చుందామనుకున్నాయి కాని వేళయ్యిందంటూ ఇంట్లోకి లాక్కుపోయింది ఇసుక చీమల వరుస తీరం తెల్లవార్లు మట్టి కంపే డొక్కలెండిపోయిన శూన్యం చంద్రుడి భోజనం ఓ ప్రక్కగా వెళ్ళిపోతున్న సూరీడు రోజూ నీళ్ళోదులుతూనే తూరుపు రెక్కలు విరిగిపోయాక పడమర అస్తమయపు అతుకులు కొత్త నిశాచరాలు గుండెగతుకుల్లో సుడులదారాల్లా వేలాడుతూ నీరెండ పలకరింపు నిత్యం కళ్ళునులుముకున్నాక నిశ్చలమైన శరీరం ఉప్పుకణికలై తిలక్ బొమ్మరాజు 04.06.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1krUWkn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి