పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, జూన్ 2014, సోమవారం

Ravela Purushothama Rao కవిత

అక్షరం ప్రవహించే వేళ ****************************** నాచుట్టూ పరిసరాలు చిమ్మ చీకటిలో చెమ్మగిల్లుతూ పరభాషావ్యామోహపరివర్తనంలో దాసోహమంటూ సాగిలబడుతున్నవి, అంతటా తళుకుబెళుకుల తన్మయత్వాలే మమ్మీ దాడీ అంటూ చిన్నపిల్లల చిలుకపలుకుల కులుకులు, అనురాగ రాహిత్యపుసంబోధనలు తల్లిదండ్రులను తన్మయత్వపు ప్రవాహాల్లో ముంచేసి శైశవాన్నతటినీ చికాకులపాల్జేస్తున్నది. ఉదయాస్తమానాలమధ్య పిల్లవాండ్ర మాతృభాషా సంబోధనలు యజమాన్యాలను కలవరపెడుతూ శిక్షించాలన్న తపన వారిమనసుల్లో దినదినాభివృద్ధి చెందుతున్నది. అభంశుభం తెలియని అమాయక విధ్యార్ధులమెడల్లో నేనిక ఇంగ్లీషునే పలుకుతాను తెలుగస్సలు మట్లాడను అంటూ హెచ్చరికల బోర్దులు వేలాడుతూ వ్యవ స్థను వెక్కిరిస్తూన్నవి. నా ఉనికి మృగ్యమై పోతుందేమోనన్న భాషామతల్లి భయకంపితమౌతున్న దృశ్యం ఇదేంవరస ?ఇదిన్యాయమేనా అంటూ నిలదీసి గద్దించే దిశగా కొందరిహృదయాలైనా ముందడుగు వేయడం నిజంగా గర్వించదగిన అంశం. అభిమానుల అంతరంగాలను ఆందొళనాపధంలోకి పడేస్తుందేమోనని పండితవర్గం వేదనపడుతున్న దాఖలాలు అనేకానేకాలు వ్యయమధికమైనా పరభాషాధ్యయనానికి పోటీ పడుతున్న యువత అంతరంగాన్ని అర్ధం చేసుకోలేక భాషామతల్లి తలపంకించి రోదిస్తున్నది. ఆ గద్గదస్వర వేదనలు కన్నీటి పర్యంతమై కకావికలౌతున్న అమ్మ సరస్వతమ్మ ఆక్రందనల స్వరాల విజృంభణలతో తెగిపడిపోతున్న ఆమె కచ్చపి వీణా తంత్రులను సరిచేసుకుంటూ నినమ్రయై నిలుచున్నది నాలో యెదో నాకే తెలియని కదలిక మరుగునపడిపోతున్న మాతృభాషా సంపదనంతా ఒక చోటికి చేర్చాలన్న భావన నన్ను ఉన్నపళాన జాగృతం చేసి వెన్వెంటనే నానిద్రమత్తును వొదిలించాయి. మరుక్షణంలో నాకళ్ళెదుటే అక్షరాలన్నీ అమృతవాహినులై పరవళ్ళతో ప్రవహిస్తున్నదృశ్యం చేదోడువాదోడుగా మనం సహకకరించగలిగితే ఆమె ఇకపై నిరంతరం అమందానంద కందళిత హృదయారవిందయై విరాజిల్లుతుందని నా ప్రగాఢ విశ్వాసం

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lLb0hI

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి