పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, జూన్ 2014, సోమవారం

Divya Kiran Takshikasri కవిత

శతాబ్దాలు గడిచాయి, దశాబ్దాలు దాటాయి! ఎన్నో మార్పులు మరెన్నో చేర్పులు ! కొన్ని కలయికలు మరిన్ని చీలికలు! ఆనందాలు అవధులు దాటుతున్నాయి, సంప్రదాయాలు సాకిల పడ్డాయి ! కానీ....... పీడితులు, పీడించేవారు, కార్మికులు, కార్పోరేటువారు, రైతన్నలు, రాజకీయ వాదులు,ఓటర్లు నాటకాల నాయకులూ, ఇంకా ఉన్నారు...... పేదలు, పేరు గడించిన వారు, నిర్భాగ్యులు, నీటు తాగే వారు, దౌర్భాగ్యులు, దౌర్జన్యాలు చేసే వారు, ఈ లోకంలో ఇంకా ఉన్నారు ..... ఆకలి దప్పుల ఆర్త నాదాలు, అన్యాయాల అరణ్య రోదనలు టపాసులై పేలుతున్నాయి, దీపావళి దీపాలు ఆర్పుతున్నాయి! బానిసత్వం బాట విడలేదు, కులం గోల కూత ఆపలేదు, రాక్షసులు రాజ్యం వదలలేదు, మద్యం సీసా మనసు దోచింది, సిగరెట్టు పొగ సిగానేక్కి కూర్చుంది! రాజకీయం రాబందులాగా రక్కసి కోరలు చాచింది ! ఇన్ని భూతల మధ్య అమాయకపు జనం ... ఎన్ని యుగాలు మరీనా ఉదయించని జ్ఞానం! అందుకనే ఈ లోకం.... మండుతోంది మండుతోంది ఆరని ఒక మంటలా! రావణుడి కాష్టం లా ! మండుతోంది మండుతోంది వెలుగులేని దివ్వెలా ! ఎగరలేని గువ్వలా ! మండుతోంది మండుతోంది అలుపు లేని ఆర్తి లా! అణగారిన జాతిలా! మండుతోంది మండుతోంది తీరని ఆకలిలా! ఆరని ఒక మంటలా!

by Divya Kiran Takshikasri



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V54GqC

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి