పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

23, జూన్ 2014, సోమవారం

Jyothirmayi Malla కవిత

మిఠాయిపొట్లం ||జ్యోతిర్మయి మళ్ళ|| బంగారమంటే ఇష్టం నాకు.. పెంకుటింటి పద్మ చెవిలోలాకులు ఉత్తుత్తినే ఊగుతున్నపుడూ మేడింటి మాలక్ష్మి లాకెట్టుగొలుసు మరిమరీ మెరిసిపోతున్నపుడూ ఎక్కడో ఏదో వెలితి.. అలాటివేవీ నాకెందుకు లేవో! అమ్మదగ్గరా నాన్నదగ్గరా ఎన్నోసార్లు బయటపెట్టిన ఆశ ఎన్నాళ్ళయినా నిజమవదెందుకో! పండగపండక్కీ చింతపండేసి తోమితే మెరిసే నా చెవిదిద్దులు ఆలోలాకులూ లాకెట్టుగొలుసూ ఎదురవగానే చిన్నబుచ్చుకుని వన్నెతగ్గుతాయెందుకో! కారణం తెలిసేసరికి నాకు చాలా వయసొచ్చేసింది పద్మ పెంకుటిల్లిపుడు మేడయింది ఆమె చెవుల్తో పాటూ మెడ కూడా మెరుస్తోంది మాలక్ష్మి మేడ ఇపుడు నెత్తిన మరో మూడు మేడల్ని పేర్చుకుంది ఆమె మెడే కాదు వొళ్ళంతా ధగధగలాడుతోంది మా గుడిసె మాత్రం మరికాస్త శిధిలమయింది మా నాన్నలాగే! నా బంగారు ఇష్టం చిటారుకొమ్మన వేళ్ళాడుతోంది ఎప్పటిలాగే!

by Jyothirmayi Malla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5E6h2

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి