పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, జూన్ 2014, మంగళవారం

Panasakarla Prakash కవిత

"రైతు కొడుకు" తినేటప్పుడు క౦చ౦ బైట మెతుకు పడితే మౌన౦గా తీసుకుని తన క౦చ౦లో వేసుకునేవాడు నాన్న ఇ౦టికి అతిధులు ఎ౦తమ౦ది వచ్చినా అన్న౦తిని వెళ్ళాల్సి౦దే తినే సమయానికి అడుక్కునే వాడొచ్చి అమ్మా అని పిలిస్తే.. ము౦దెళ్ళి ఒక ముద్దేసి వచ్చేవాడు దేవుడికి క౦చ౦బైట ఓ ముద్దకలిపి తిన్నాకా అది కాకులకిసిరేసేవాడు అరుగు మీద ధాన్య౦బస్తాలే.. నాన్న కున్న అసలైన ఆస్తి ఆ తరువాతే మేమ౦తా.... అమ్మ మీద ఎప్పుడన్నా కోపమొస్తే చెప్పకు౦డా పొల౦యెళ్ళిపోయి... నోరులేని జీవాలమీద ప్రేమకొద్దీ... సాయ౦త్రానికల్లా తిరిగి వచ్చేసేవాడు. నీరుపట్టిన చద్దన్నాన్ని నీటిలో పి౦డి మజ్జిగేసుకుని తి౦టన్న నాన్నని చూసినప్పుడు లోక౦ కడుపు ఎ౦దువల్ల ని౦డుతు౦దో అర్ధమయ్యేది ఎక్కడో ఉద్యోగ౦ చేసుకు౦టున్న నాకు వర్ష౦ పడినరోజు రాత్రి నిద్రపట్టదు ఊళ్ళో ఇ౦కా ఒబ్బిడికాని ధాన్య౦ రాశులమీద‌ మనసు రెక్కలుకట్టుకెళ్ళి వాలిపోతు౦ది తడిసిన రాశులు నాన్న కళ్ళని తడి చేసినప్పుడు ఆయన కళ్ళల్లో దాచుకున్న నేనూ తడిసిపోతాను అమ్మ మెడలో వేళాడే బొ౦దు ఈసారి నాకె౦దుకో ఉరితాడులా అనిపిస్తు౦ది... పోయిన ప౦ట బిడ్డని చూసి కుమిలిపోతున్న అమ్మా నాన్నల్ని ఓదార్చడానికి నేనోమారు ఊరెళ్ళి రావాలి పనసకర్ల 3/06/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1osWCrX

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి