పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, జూన్ 2014, మంగళవారం

Kks Kiran కవిత

ఆకాశంలో అందంగా అరుదెంచిన పంచమి నాటి చంద్రుడిని చూసి నాకీ వర్ణన గుర్తుకొచ్చింది కాళిదాసు రాసిన " కుమార సంభవం " లోది. శివుడు పార్వతీ దేవితో ఇలా అంటాడు ఓ అందమైన రాత్రి ! ! ! " రాత్రి చీకటిని పారద్రోలడానికై తూర్పు దిశన చంద్రుడు ఉదయిస్తున్నాడు. మొగలిపూలు విచ్చినట్లు ప్రాగ్దిశన తొలిరేకులు విచ్చుకుంటున్నాయి. నక్షత్రయుక్తమైన ఈ రాత్రి, ఇంతవరకూ మందరపర్వతంలో దాగిఉండి ఇప్పుడే ఉదయించిన చంద్రునితో కలిసి, నీవు నీ సఖులతో కూడి నాతో ముచ్చటిస్తున్నట్లు కనిపిస్తున్నది ! చంద్రుడు వెన్నెల నవ్వు నవ్వుతున్నాడు చూశావ? ఈ లేత వెన్నెల వెలుగులు కొనగోళ్ళతో త్రుంచి నీకు కర్ణాభరణాలు చేయవచ్చు సుమా ! వ్రేళ్ళతో కురులను సవరిస్తున్నట్లు చంద్రుడు తన " కిరణాలతో " చీకటిని తొలగత్రోసి, ముకుళిత పద్మలోచన అగు రాత్రి ముఖాన్ని ముద్దాడుతున్నాడు !! పార్వతీ ! ఆకాశంవంక ఒకమాటు చూడు ! చంద్రుని లేత వెన్నెలలో చీకటి తెరలు తొలగిపోగా ఆకాశం, ఏనుగులు కలచివేసిన పిమ్మట నిశ్చలంగా ఉన్న మానససరోవరంలా కనిపిస్తున్నది ! ఉన్నత ప్రదేశాలలో వెన్నెల వెలుగులు అలముకున్నాయి. పల్లపు ప్రాంతాలలో చీకట్లు పరుచుకున్నాయి, అవునుమరి, గుణదోషాలను బట్టి సృష్టికర్త ఉచ్చనీచలు కల్పిస్తూ ఉంటాడు !!! చెట్టు కొమ్మల సందులగుండా,ఆకుల మధ్యగుండా పువ్వులవలే నేల వ్రాలుతున్న చంద్ర"కిరణ" కోమలరేకలను, వ్రేళ్ళతో పట్టి నీ మ్రుంగురులకు కట్టివేయవచ్చు సుమా !!!! " అని అంటూ ఇంకా చక్కటి వర్ణనలతో వర్నిస్తాడు రాత్రి తాలూకు అందాన్ని,ప్రస్తుతానికి ఇంత వరకూ వర్ణన చాలు,మిగతాది ఇంకెప్పుడైనా వివరంగా పోష్ట్ చేస్తాను, కాలిదాసు ఎంత బాగా రాసాడో కదా? అతను వర్ణిస్తుంటే ఆ రాత్రి మన కళ్ళముందే కనపడుతున్నట్లు,దానిని ఆస్వాదిస్తునట్లు ఉంది కదూ? అదీ కాళిదాసు గొప్పదనం,తప్పకుండా చదవండి అతని రచనలు సాహిత్యంపై ఇష్టం ఉంటే, శుభరాత్రి. - మీ Kks Kiran

by Kks Kiran



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oSLFUt

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి