పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, జూన్ 2014, గురువారం

Laxman Swamy Simhachalam కవిత

లక్ష్మణ్ స్వామి || విశ్వ మోహన గీతం!! || భూ బంతి విష్ణు చక్రమై గిరగిరా తిరుగుతూనే ఉంది చండ ప్రచండ కాల దండ యాత్ర సాగుతూనే ఉంది. శిథిల చరిత్ర పుటలకింద బీటలు వారిన ఒక పురాగీతం కన్నీటి వూటై నన్ను ముంచెత్తూనే ఉంది ..!! చెల్లా చెదురైన నక్షత్రాలలో రవి చంద్రుల దాగుడు మూతలు.. రాతి పొరల్లో ని నీ పాత స్మృతుల్ని గొర్రెల కాపరి పాటలపిట్టల్ని చేసి లోకమంతా ఎగరేస్తూ ....!! యుగాలుగా ప్రవహిస్తూ అలసిన వృద్ధ నదుల చుట్టూ, ముద్ద బంతుల దండలతో అజ్ఞాత కవుల నిరీక్షణ !! రాకాసి బల్లుల రక్త గుహల్లో బిక్కు బిక్కు మంటున్న నిశాచర జీవాలు ..!! ఎడతెగని ఈ అన0త యానం ప్రాణాల పరిమళాల్ని మాత్రం తగ్గనివ్వదు..! కోట్ల జీవాల్లో కోటికాంతుల శక్తేదో ప్రాణ0గా మారి, ప్రకృతిని పాదాక్రాంతం చేసే విఫల యత్నం అజరామరం ....! ఆకలి ఆయుధమైన వేళ అసిధార అనివార్యమే ? మంచుపర్వాతాలంచున కుంకుమ పూల సి0ధూరాన్ని ధరిస్తన్న పృథ్వి ! శిలాయుగపు ఆది మానవం ఇగ్లూ .....ఎస్కిమో ... పిరమిడ్ ..మమ్మీలు అన్నీ బుద్ధుని చరణాల్లో లీనమవుతూ ..! అహం ..మోహం అంతు లేని ‘కామదహనం’ కాల ఝరీలో పీడకలలై ఉలిక్కి పడుతూ ..!! అంతులేని చరిత్రలన్నీ కడలి అడుక్కి క్రమంగా జారిపోతూ ..!! ఆదినుండి అంతం దాకా దుఃఖానికి చుక్కానవుతూ చరాచర జగత్తు ...!! హిమగిరుల్నుండి మంచుపూల మందహాసంతో మళయ మారుత మధుర యానం ..! వాన చినుకై జీమూతం ! నిప్పుకణికై అనలం ! అచల అనంత గగనం !! పాంచ భౌతిక గమనం పాంచ జన్యమై ప్రతి ప్రాణిలో ప్రణవమై ... ప్రకృతి –పురుషుడు జీవన్మరణాల కారక ప్రేరణై ఆచంద్రార్ఖ అమృత గానమై విశ్వమోహన రాగమై నాలో జన్మ జన్మల జ్ఞాపకాల్ని సృష్టిస్తూ ... ......................................... 19 – 06 -2014

by Laxman Swamy Simhachalamfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/T96jSv

Posted by Katta

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి