పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

19, జూన్ 2014, గురువారం

నవీన్ కుమార్ కవిత

!!ఆత్మీయ అక్షరం!! గువ్వంతగుండె ఎగరలేక ఎగాదిగా అయినపుడూ పిసరంత ప్రేమలేకా బతుకుపాట తడబడినపుడూ పెన్నూ పుస్తకమందుకుంటాను అలలెత్తే అశ్రువులు అక్షరాలుగా ఒదిగి నన్నల్లుకుంటాయి పెనువిషాదం పలకరించినపుడూ మరలిరాని నేస్తం మళ్లీ గురుతొచ్చినపుడూ పెన్నూ పుస్తకమందుకుంటాను కలం నుంచీ కరిగి కన్నీళ్ళు కళ్లల్లో కాంతిరేఖలై మెరుస్తాయి అంతరంగంతో అనేక యుద్ధాల్లో ఓడినపుడూ నమ్మకాలు నిలువ నీడలేక రాలినపుడూ పెన్నూపుస్తకమందుకుంటాను కాగితంపై చింది రుధిరాక్షరాలు రేపటికి మరోనన్ను ఆవిష్కరిస్తాయి నవీన్ కుమార్ !! 18/06/2014

by నవీన్ కుమార్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ynILKc

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి