పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఏప్రిల్ 2014, ఆదివారం

Renuka Ayola కవిత

కోరుకున్న సంభాషణ వేళ్ళలోతులలో రంగులుముంచి మనసు గుమ్మాలకి కుంచె లు ఆనించి ఉదయం నుంచి అర్దరాత్రి వరకు రంగులలో నానిన చిత్రం ప్రదర్శనలో గోడ గుండెల మీద నిల్చోగానే సముద్ర ఆగధత్వం, ఆనందం, ఆత్మపిలుపు చూస్తారని ఎదురుచూడడం మొదలు పెట్టింది ఎన్నో జతల కళ్ళు నీరెండమెరుపులా వాలి సౌందర్యాన్ని దిగులులోముంచి చర్చిస్తూ అర్దంకాని సమూహలుగా పక్షుల గుంపులై ఎగిరిపోయాయి దేహాన్ని ఆవరించిన ప్రేమ నేత్రాలలో ప్రకాశించడం తామరపూలు వికసించి నవ్వడం ప్రేమించిన స్త్రీ పెదవులమీద మోహరించిన నవ్వుని చూస్తారని వెతకడం మొదలుపెట్టింది పడకగది గోడలమీద ఆనుకుని వాళ్ళనేచూస్తూ రంగులతో ఎప్పటికైనా సంభాషిస్తారని రంగులలో ముఖాలు స్పర్శలు వెతుకుతారని కళ్ళువిప్పార్చి చూస్తూనే ఉంది ఒక మాటకోసం ఒక ముఖం కోసం ఒక సంభాషణ కోసం.... (సారం గాలో ఒక కప్పు కాఫీ శీర్షికలో కృ ష్ణ ఆశోక్ గారి చిత్రాలు చూసాక రాసిన కవిత ఇది )

by Renuka Ayola



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fbVeES

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి