పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఏప్రిల్ 2014, ఆదివారం

Kotha Anil Kumar కవిత

@ విస్పోటన గీతం @ ఇవి శాంతి కపోతపు రెక్కల టపటపలు కావు రెక్కలు తొడిగిన ఉన్మాదపు రాబందులు సృష్టించిన హింసాత్మక పెలపెలలు అవి కంపించిన భూగోళపు కదలికల బడబడలు కావవి. ఉన్మత్త వికటాట్టహాసం చేస్తున్న తీవ్రవాదపు రాక్షస దరహాసపు ద్వనులు. ఇదంతా చెల్లాచెదురైన పరిసరాల రోధన కాదు. మానవత్వం మరిచిన రక్కసి కళ్ళలో ప్రస్పుటమౌతున్న అకారణ ప్రతీకారనందం. ప్రపంచ శాంతి జ్యోతిని వెలిగించే ఉజ్వలిత అగ్నిజ్వాలలు కావవి. ప్రపంచపు అనుబంధాలను మసి చేసి వేరు చేసే అమానుష వర్గపు నిప్పు కానికలు మనిషి చేతిలో విస్పొటనమైన ప్రాంతం కాదది జాతి ఐక్యతను విచ్చిన్నం చేసిన అమానవత్వాన్ని చూసి తలవంచిన ప్రకృతి పేలుడుకు తునాతునకలైన మృత దేహాలు కావవి మనిషి వికృత చేష్టలకు సిగ్గుపడి నేలనతికిన మనిషి ముక్కలు. ప్రేమానురాగాలతో విలసిల్లుతున్న భాగ్యనగరం కాదది ఉగ్రవాద క్రోధం లో చిక్కి శిదిలమైన వేదన నగరం. విధి చేసిన గాయానికి విలపిస్తూ వంచితులు చేసిన గానాలు కావవి. ఉన్మాద వర్గపు రాక్షసానందంలో... వినిపించిన విస్పొటన గీతాలు. _ కొత్త అనిల్ కుమార్. ( write on : 30/5/2013_post .19/4/2014)

by Kotha Anil Kumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1llpDbX

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి