పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఏప్రిల్ 2014, ఆదివారం

Chand Usman కవిత

చాంద్ || నాలుగు కాళ్ళు || నాలుగు కాళ్ళు మనమంతా పుట్టింది వాటికే ******* అవి జతగా కలిసి పంచుకున్న జీవితాన్ని దాదాపు నీకు నాకూ ఖర్చుచేసేసాయి ఎదురుగా ఉన్న తలుపుల నుండి కాదు చిల్లుపడిన లోపలి గోడలు నుండి చూడు ఇప్పుడు అది దేహాలను కాదు మనసులను ఒక్కటి చేసే దాంపత్యం ******* బరువైన జీవితం క్రింద నలిగి చచ్చుపడిన మనసులు అవి ముసలితనానికి వ్రేలాడుతున్న దేహాలకు ఊతమిచ్చే పిల్లలో పిల్లలాంటివాళ్లో లేక పిట్టలు వాలని మోడులా బహుశా మనమే వదేలేసామేమో ******* నాలుగు కాళ్ళు ఏమి మాట్లాడుకుంటాయి మన బాల్యం గురించే కదూ అవేగా నిజంగా అవి బ్రతికిన రోజులు అందుకేనేమో పచ్చటి జ్ఞాపాకలను గుమ్మాలకి కట్టుకొని ఎదురుచూస్తున్నాయి ******* నాలుగు కాళ్ళు రెండే అడుగులు జీవితాన్ని గెలిచి మిగిలిన దూరాన్ని దాటుతున్నాయి మీ చాంద్ || 20.04.2014 ||

by Chand Usman



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i194jq

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి