పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఏప్రిల్ 2014, ఆదివారం

Jaya Reddy Boda కవిత

// జయ రెడ్డి బోడ // వంచన // చెట్టూ చేమ, రాళ్ళూ రప్పలు, పాములు తేల్లతో సావాసం ఏ ఆపద లేని కర్షక జీవితం ఒకనాడు, కేవలం కడుపునింపే పశువు లాంటి ఊడిగం నాకొద్దని లేని సుఖాల కోసం,డబ్బు మూటకై వెదుకుతూ దూర తిరాలకేగుతివి ..... "పెళ్ళం బెల్లం తల్లి అల్లము" అయి, నా బ్రతుకు తడికల షెడ్డు కు బదిలీ చేసి నువ్వెళ్ళి పొయ్యాక ..... వంగిన నడుముతో వణికే ప్రాయంతో, ముడుతల చర్మాన్ని కప్పుకొని, శరీరం సహకరించకున్నా కూలీ పనితో పొట్ట నింపుకొని కొడిగడుతున్న దీపం వలే, తల్లి మనసుతో ఎదిరిచూస్తూ నీ కోసమే నేను కాలం గడిపితి.. నువ్వు అక్కడ అడివిలో ఎండుగోలే...ఎండినవో,,వాగుల రాయోలే నానినావో .. నువ్వేం తెచ్చినవొ లేక నీ 'జిందగీ' ఆడ పోగ్గుట్టుకున్నవో కానీ నువ్వు కట్టుకున్నది లెక్క చెప్పలేదనో లేక, లెక్క దప్పిందనో ఏందో గాని, గుడ్డి దాన్ని నాకేం ఎరుకగానీ బిడ్డా, నువ్వు వచ్చినకాడ్నుండి దినాం లొల్లే నాయే,, "అది చేసిన మోసమేనో .. నువ్వు చేసుకున్న పాపమేనో" నమ్మలేని నిజాన్ని జీర్ణించుకోలేని అమాయకత్వంలో, నీలో నువ్వే మధన పడి.. కాసుల కోసం కయ్యల పడితినని బెంగపడి, మనసు చంపుకొని ఈ వంచనల కాపురం నాకొద్దని ... కొడుకా .... 'పళ్ళ పుల్ల' కోసం వేప చెట్టు క్రింద నిల్చున్నావని నా మసక కళ్ళకు భ్రమ కలిగించి,,,,,,, ఇంటి ముందు వృక్షాన్నే 'ఉరి కంబం' గా మార్చుకొని ప్రాణాలు విడచి పైలోకాలకెలితివా నాయనా బాపు రెడ్డి... అమాత్య ఫోను 'నీ మరణం ' అప్పుల భాదతో బలవన్మరణంగా' ధ్రువీకరించి పంచనామాలో నమోదు కావించ పడ్డాక, నీకూ నీ ధనాశకు, లేక నీకు నీ తల్లి నైన నాకు మధ్య మాతృ ద్రోహానికి, లేదా నీకు నువ్వు కట్టిన తాళికి పెరిగిన దూరం రగిలించిన ఓ 'వాంఛ'కు చివరాకరికి .. ఓటుకు అధికారానికి నడుమ ఒప్పందంతో, నీ శవానికి జరిగిన మోసానికో.. లేదా వీటి అన్నింటి మధ్య నలిగిన న్యాయదేవతదేనేమో, తప్పు అంటే ...ఏమని చెప్పాలి? ఏదైతే నేమి, "తప్పు ఒప్పుల మధ్య "రాజీపడి" బ్రతకనులేక,,ఘర్షణ పడి జీవించనులేక నువ్వు బలవన్మరణానికి లొంగి ఈ లోకం విడిచాక నీవు చేసిన పిరికి చర్యే ఇది అని ప్రజల్లో తేలాక ,,,," ఇక ఇక్కడ ఏ పంచాయతీ లేదు ఏ న్యాయాన్యాయాలు లేవు నీతి,న్యాయం,శీలం,.... గతించిన కాలం సమస్యలు తప్ప ,,,, నీ చావు క్షణ కాలపు బాధ అయి, పిదప ఓ మరుపై మరుగున పడ్డాక ఇక ఇప్పుడు ఇక్కడా అన్నీ భౌతికానందాలే ... ఆ పాత పేపర్లో వెల వెల పోతున్న నీ చావు వార్త తప్ప.... ( 20-04-2014 )

by Jaya Reddy Boda



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gVMyGP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి