పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, ఏప్రిల్ 2014, ఆదివారం

Ravela Purushothama Rao కవిత

ఆకాశమందించే సందేశం రావెల పురుషోత్తమరావు ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ఆకాశాన్ని ఎప్పుడు చూసినా నాకు నిత్యనూతనంగా సర్వావస్థలలోనూ నిండు జవ్వని గానే దర్శనమిస్తుంది. ఆటుపోటులన్నీ అలవాటు పడిన అనుభవాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా అనిపిస్తుంది. బాల్యావస్థలో దాన్ని చూసినప్పుడు బాలురవెంట నంటి పెట్టుకుని పరుగెట్టే తోటి సహచరిగానే అగుపించేది. సూర్యచంద్రుల విధినిర్వహణలో స హా యపడే సహచరిగానే నిపించేది. యవ్వనంలోకడుగిడగానే ఓ అందమైన బృందావనిగా . తళుక్కుమనే సూర్య చంద్రుల మధ్యన తల్కొత్తే శృoగార చిత్ర కధా నాయకుడిలాగోచరిస్తూ సాక్షాత్కరించేది. ఉరుములూ మెరుపుల ఆర్భాటాలతో ఉద్యమ కార్యశీలిగాఎదురు నిలిచినట్లుండేది. వయసు నొసలుపై ముసలిరేఖలు గీచే సందర్భంలో పశ్చిమాద్రిన అస్తమయపు దశలోకూడా పడమటి సంధ్యారాగానికి రంగులద్దే చిత్రకారిణిలా చిన్మయ రూపంలో కనుపట్టేది. ఉదయాస్తమానాలమధ్యన సర్వ ప్రాణికోటికీ ఊపిరులూదే జీవామృత ధారగా రూపుదిద్దుకునేది. అందుకే మనిషిగూడా ఆకాశాన్ని జూసి అలవర్చుకోవాల్సిన సుగుణాలెన్నో ఉన్నాయనిపిస్తుంది. ఉరుములకూ మెరుపులకూ సద్యస్ఫురణతో ఉలిక్కి పడినట్లు కనిపించినా జయాపజయాలకు చెక్కుచెదరని ధీరోదాత్తతను అలవర్చుకోగలగాలి. ఆ తర్వాత యేర్పడే ఫ్రశాంతతనుగూడా మానవుడు తన మస్తిస్కంలో పొందుపరుకునేందుకు యత్నించాలి. అడుగులు తడబడే అవసాన దశలో సైతం ఆయాకాలాలలో ఆయాస్మృతులను పునశ్చరణ గావించుకుంటూ ఆనంద నందనవనంలా బ్రదుకును తీర్చిదిద్దుకోవాలనే ఈ వినీలాకాశమందించే విశాల సందేశమని పదికాలాల పాటూ పదిలంగా గుండెకు హత్తుకోవాలి. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^20-4-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pjdg1I

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి