పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, మార్చి 2014, శుక్రవారం

Usha Rani K కవిత

మరువం ఉష | కవుల చేవ -------------------------- అయం బన్ధురయం నేతి గణనా క్షుద్రచేతసామ్। ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్।। "అల్పమైన ఆలోచనలు కలవాళ్లకి వీడు చుట్టం వీడు చుట్టం కాదు అన్న పట్టింపులు ఉంటాయి. అదే గొప్ప నడువడి కలవారికి ప్రపంచమంతా తన కుటుంబమే," అని ప్రపంచకవులను ఉద్దేశ్యించి ఒక వ్యాసకర్త అభిప్రాయం. కవి ప్రపంచబంధువు అలాగే All that is best in the great poets of all countries is not what is national in them, but what is universal" - Henry Wadsworth Longfellow స్వాప్నిక జగత్తు కాదది, గడచిన ఘనచరిత్ర కానే కాదు. సంపూర్తి కానున్న చిత్రమది. సృష్ట్యాది నుండి సాగిన గానమది. రానున్న మహత్తర భావి అది, మానవీయ మధుర కావ్యమది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల నడుమ పృధ్వి ఒక్కటే. వేలు, వేవేలు, లెక్కలేనన్ని, పాలపుంతల పలుచుక్కల నడుమ ఆకాశం ఒక్కటే. భాష, వేషం, రంగు, రూపు భిన్నస్వరాల ఏకీభావం ఒక్కటే. యుద్దభీతి, కీర్తికాంక్ష, స్వార్థభక్తి, కుటిలనీతి పెకలించిన జాతి అది. శాంతి, సమత, మమత, ఆత్మీయత విలసిల్లిన రీతి అది. తరులు, గిరులు, నదులు, మైదానాలు సాంత్వన చెందిన ప్రకృతి అది. కదలాలి కలాలు, పాదాలు కలిసికట్టుగా మానవత్వమే సాధనగా, కవిత్వ పథాన రావాలి నవతరం కొత్త పుంతలు తొక్కుతూ సాహిత్య ప్రపంచం కావాలి వసుధైవకుటుంబకం 21/03/14

by Usha Rani K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1r4eDQo

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి