పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, మార్చి 2014, శుక్రవారం

Srinivasa Bharadwaj Kishore కవిత

మొన్న ఒకరోజు భారతదేశంలో వున్న నా స్నేహితునితో పిచ్చా పాటీ కాసేపటికి పిచ్చి-పోటీ అయి "త్త" సంయుక్తాక్షరంతో అంతమయ్యే పదాల వరుసలో మాట్లాడుకోవడం లోకి దిగింది. ఉదాహరణకు "ఏమిటి కొత్త - ఏముంది చత్త, ఉత్త....., అత్త...." వగైరా వగైరా. ఉన్నట్లుండి నేస్తం నన్నుద్దేశించి - "ఉత్త, మా అత్త, మత్తు, మీ అత్త" అన్న పదాలు ఉపయోగించి ఒక కందపద్యం వ్రాసి ఆతరువాతనే తనతో మాట్లాడమని ఠక్కున ఫోను పెట్టేశాడు. నాకు గొంతులో వెలక్కాయ పడింది కానీ ఈ ఛాలెంజీ సరదాగా బాగానే వుందనుకుని, కళ్ళుమూసుకుని ఇరవైనాలుగు గంటలూ వీణవాయించే ఆవిడను తలచుకుని రంగంలోకి దిగతే వచ్చిందిది - ఉత్తగడ౦బాలుపలికె మత్తునయున్నపుడుతెల్క మాయత్తికమీ యత్తయుతక్కువకాదుగ పుత్తడికాన్కని ఇత్తడిపూసలనిచ్చెన్ (ఒక అత్త డంబాలు పలికితే, ఇంకొకావిడ బంగారం అని చెప్పి ఇత్తడిపూసలనిచ్చింది) సరదాగా ఈ పద్యం వ్రాసిన తరువాత మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఆవిడ వీణవాయించడం ఆపేసి ఆడవాళ్ళంటే, అందునా ఆత్తలంటై మరీ లోకువైపోయారా నీకు - అన్నట్లు నా వైపు కొరకొర చూడడం చూసి భయం వేసి, ఆవిడను మచ్చిచేసుకునే ఉద్దేశ్యంతో మళ్ళీ మొదలు పెట్టాను ఉత్తమ విద్యలతొ సమా యత్తముచేసిన నినువిడి యాచి౦చితి మీ యత్తను స౦పదలాశను మత్తువదలినది క్షమి౦పు మమ్మ పుత్రునిన్ (విద్యలనొసగిన సరస్వతీదేవిని కాదని ఆమెకు అత్త - అంటే లక్ష్మీదేవిని యాచించినందుకు క్షమాభిక్షనివ్వమని వేడుకున్నాను) మరి ఆ తరువాత కళ్ళుమూసుకుంటే ఇంకేమి కనిపిస్తుందో - ఊహించండి

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWnOvg

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి