పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, మార్చి 2014, శుక్రవారం

Kapila Ramkumar కవిత

చేరాతో ముఖాముఖి వ్యాసాలు » సెప్టెంబర్ 1999రచన : చేరా [ శ్రీ చేకూరి రామారావు గారి వివరాలు కొన్ని, వారి మాటల్లోనే. ఉస్మానియాలో B.A., ఆంధ్రాలో M.A. Telugu, Madison, Wis.లో, Cornell Univ.లో Linguistics చదువు. M.A., Ph.D. Linguistics from Cornell. ఉస్మానియాలో 196994 Lecturer, Reader, Professor, Dean వగైరా. తెలుగులో పుస్తకాలు. 1. రెండు పదుల పైన. పద్య గేయ సంకలనం. 2. తెలుగులో వెలుగులు. భాషా వ్యాసాలు. 3. వచన పద్యం లక్షణ చర్చ. సంపత్కుమారతో కలిసి. 4. తెలుగు వాక్యం. (తెలుగు వాక్య నిర్మాణ పరిశీలన) 5. ముత్యాల సరాల ముచ్చట్లు ఛందో వ్యాసాలు. 6. చేరా పీఠికలు. 7. చేరాతలు సాహిత్య విమర్శ, పరామర్శ (చేరాతలు 1986-94 మధ్యలో ఏడున్నర ఏళ్ళు. అందులో కొన్ని మాత్రమే సంకలనంలో వచ్చాయి.) ఇంగ్లీషులో Linguistics essays సంకలనం కాలేదు. సంకలనం కాని వ్యాసాలు చాలా ఉన్నాయి. ఇతరం. A.P. Open University B.A. Telugu సిలబసుకు ప్రధాన చోదకుడు. Indira Gandhi National Open Universityలో B.A. తెలుగు పాఠాలు రాశాడు. ఈ రెండూ ఆధునిక భాషను సిలబసులో పెట్టాయి. ఇదీ క్లుప్తంగా. ] _____________________________________________________________ ఒక అంశం -- మచ్చుకు మిగతాది: ఈ లింక్‌లో చదవండి http://ift.tt/1l8vixY ______________________________________________________________ వచన కవులకి కూడా ఛందో పరిజ్ఞానం, సాంప్రదాయ సాహిత్యంతో పరిచయం అవసరమని మీరు భావిస్తారా? భవిష్యత్తులో రాయాలనుకొనేవారికి సాంప్రదాయ సాహిత్య పరిజ్ఞానంలో కనీసార్హతలుగా మీరేమైనా సూచిస్తారా ? చేరా. వచన కవులకు ఎంత సాహిత్య పరిజ్ఞానం అవసరం అనేది ఎవరూ నిర్ణయించలేరు. వచన కవులకే కాదు, ఏ కవులకైనా సరే. ఆ మాటకొస్తే ఎవరికైనా సరే. ప్రత్యేక జ్ఞానాల విషయం వస్తే ఛందః పరిజ్ఞానం అవసరమా అంటే, వచన కవిత్వం రాసే వాళ్ళకి దానికి మాత్రమే పరిమితమయ్యే వాళ్ళకి ఛందః పరిజ్ఞానం అవసరం లేకపోవచ్చు. కాని కొంచెం విస్తరించదల్చుకుంటే ఈ లోపం కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది. ..కొన్ని ఉదాహరణలిస్తాను. 1. రావులపల్లి సునీత అనే కవయిత్రి “అన్వేషణ” అనే కవితా సంపుటి ప్రకటించింది. అందులో “పుష్పవిలాపం” పద్ధతిలో ఏదో ప్యారడీ లాంటిది ఉంది. (రిఫరెన్స్‌ నా దగ్గర లేదు) కరుణశ్రీ గారి పద్యాలను (ఛందఃపరిజ్ఞానంతో) చదివినవారు అయ్యో ఇది ఛందస్సులో లేకుండా ఇదేం ప్యారడీ అనిపిస్తుంది. 2. కొండేపూడి నిర్మల కూడా ఇట్లాగే ఒకటి అంటే పద్యాలకు వచనకవిత్వం ప్యారడీ రాస్తే నేను తీవ్రంగా వ్యతిరేకించాను. తరవాత అచ్చువెయ్యటం మానుకుంది. 3. శ్రీశ్రీ ప్రాసక్రీడలు అందరికీ తెలిసిందే. అది మాత్రా ఛందస్సులో ఉంది. దాని వివరాల జోలికి వెళ్ళను. విశాలాంధ్ర వాళ్ళు అచ్చువేసిన నా “ముత్యాల సరాల ముచ్చట్లు”లో ఉంది. జయప్రభ, రంగనాయకమ్మ మీద “అసలే కోతి” అని (యశొధరా వగపెందుకే?), చేరా మీద “ముళ్ళకంప ఛందం!” అని చింతల నెమలి లో రాసింది. ఈ రెండూ తిట్టి కవితలు. శ్రీశ్రీ ప్రాసక్రీడలు మాత్రాఛందస్సుల్లో రాసిన సెటైరు. ఆ సెటైరు పాదానికి పన్నెండు మాత్రలుండే ఛందస్సులో ఉంది. శ్రీశ్రీ ప్రాసక్రీడల పరిజ్ఞానం ఉన్న ఎవరైనా జయప్రభ రాసిన రెండు సెటైర్లూ ప్రాసక్రీడల మోడల్లో రాసినట్లు చెప్పగలరు. కాని ఛందస్సు అర్థం కాకపోవటం వల్ల వాటిలో అతిక్రమణలు చాలా ఉన్నాయి. ఛందస్సు తెలిసిన పాఠకులకు అవి రుచించవు. నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను, నీ ఇష్టం ఐతే చదువు లేకపోతే మానెయ్యి అనటానికి వీల్లేదు. సరే ఇది ఛందస్సుకు సంబంధించింది. ఇక భాషావిషయం. కవిత్వానికి మాట్లాడే భాష నిషిద్ధం కాదు కాని దానికే పరిమితం కాదు. కవిత్వభాషలో ప్రాచీనభాష నిషిద్ధం కాదు. భాషలో దొరికే అన్ని వనరులనూ కవిత్వభాష వాడుకుంటుంది. ఉదాహరణకు మళ్ళీ జయప్రభ కవిత్వాన్నే చూడండి (ఆమె స్పెల్లింగులను వదిలెయ్యండి). ఈనాటి వచన కవులలో ఇంత ప్రాచీనభాష వాడిన కవులు ఇటీవలి కవుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. కాని అద్భుతంగా వాడింది. (జయప్రభ కవిత్వంపై నా అభిమానానికి అదొక కారణం.) వచనకవులకు ప్రాచీన కవిత్వ భాషా పరిజ్ఞానం అవసరమా అంటే ఏం చెప్పాలి? ఆ పరిజ్ఞానం ఎట్లా వస్తుంది? ప్రాచీన కావ్యపఠనం వల్ల వస్తుంది. నా కక్కర్లేదు అంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఉద్యోగాల్లోనో, కోర్సుల్లోనో చేరేవారికి లాగా, అర్హతలను (కనీసమైనా, గరిష్టమైనా) సూచించటం నాకు చేతకాదు. కాని సంప్రదాయ సాహిత్యాన్ని మాకు అక్కర్లేదని వదిలెయ్యటం అయాచితంగా దొరుకుతున్న ధనాన్ని కాలదన్నుకోటం లాంటిదని నా అభిప్రాయం! 7.3.14

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l8vixY

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి