పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, మార్చి 2014, శుక్రవారం

Rajaram Thumucharla కవిత

నడక లేనితనం (కవిత ) రచన :- రాజారామ్.టి తేది :-5-3-14 నడక మినహా... అంతా బాగున్నట్లేనని అనిపిస్తోంది నాకు- ఇదొక సుఖపు బాధలా నమిలేస్తోంది. దేహాన్ని మూటగా కట్టి అటక మీదేసినట్లు కుర్చి మీదకు గిరాటేస్తోంది నన్ను నడకలేనితనం- మూలనుంచిన బియ్యం బస్తాలోంచి ప్రతి రోజు కొన్ని వాడేస్తుంటే రోజులు గడిచే కొద్ది బస్తా బరువు తగ్గినట్లుగా నొప్పి తూకం తగ్గిపోతు గత ఙ్ఞాపకం భారం పెంచుతోంది- నడక తప్ప అంతా సజావుగానే సాగుతున్నట్లున్నది. యముని మహిషం తాకీతాకకుండా నన్ను చావు గొయ్యిలోకి నెట్టేసినప్పుడు పైన వున్న మెరుపులన్ని ఏకమై కాళ్ళ నుంచి కళ్ళలోకి ప్రవహించినపుడు వొక పేలవమైన పుల్ల పుటుక్కున విరిగిన నిశ్శబ్దపు ఉరుముల చప్పుడు. అంతా బాగానే వుంది నడక మినహా నిశ్చల నీటి కొలనులో కదలగనైన లేని సౌందర్య రహిత కలువలా జీవితం చప్పగా- కదలాడితేనే కదా!పద్య పాదానికైనా మనిషికైనా మనోహర సౌందర్యం దేనికైనా ఇప్పుడు ఎవరోఒకరిపైన నేను ఆధారపడి జీవించడం ఎంత బాగుందో అంతా బాగుండదనిపిస్తోంది- (కాలు విరిగిన అనుభూతి కీ స్పందించి)

by Rajaram Thumucharla



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nn4wU4

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి