పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, మార్చి 2014, శుక్రవారం

Ravela Purushothama Rao కవిత

దైవమిచ్చిన వరం *************** రావెలపురుషోత్తమరావు పల్లె నాకు దైవమిచ్చిన వరం పసితనపు పలవరింతల్లోనే పచ్చని పొలంలా సాక్షాత్కరించి పట్టు గొమ్మగా వెలిసింది. ఆరుగాలాలపాటూ అపురూపంగా ఎదిగి అన్నపూర్ణగా భాసించింది. వరికంకులన్నీ పాలపొట్టమీదకు రాగానే నిండు గర్భిణిలా తలవంచి నావైపు చూసి సిగ్గుగా తలవొంచుకుని నిలుచుంది కోతలన్నీ పూర్తికాగానే సంతానలక్ష్మిలా సౌభాగ్య సుందరంగా ఇలా ఇంటికిజేరి పుట్టింటి గౌరవాన్ని ఇనుమడింపజేసింది. మరోవంక మల్లెల మరువంపు దవనాల మేళవింపుగా సురభిళ పరిమళంలా పుట్టింటి ఆడబడుచులా మెట్టినింట అడుగునిడి మెట్టునెక్కి మురిసిముక్కలయి పున్నమి వెన్నెలై పుచ్చపూవులా విరిసింది కళ్ళాల్లో ఆరబోసిన పంటలన్నింటినీ కంటికి రెప్పలా కాపాడుతూ కొట్టొచ్చిన కళతో గంతులేస్తూ చిందులేసింది. పల్లె నాకు కల్పవృక్షంతో సమానం. ఆ ఆనందపు జీవనదితో నేననవరతం మమైక్యం. ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ 07-03-2014

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NEnTvk

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి