పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

7, మార్చి 2014, శుక్రవారం

బాలసుధాకర్ మౌళి కవిత

స్తబ్దత నది నదిలా లేదు పడవ పడవలా లేదు ప్రయాణం ప్రయాణంలా లేదు దరులను వొరుసుకుంటూ నీళ్లలా భ్రమింపచేస్తున్న పొడి యిసుక- దున్నల కాళ్లకడ్డం పడుతూ తెగిపడుతున్న తూనీగల రెక్కలు- ఆకాశం నడిమింట నెత్తుటెండను స్రవిస్తున్న సూరీడు- అంతా స్తబ్దతావరణం అవిశ్రాంత అలజడిమబ్బు నిశ్శబ్దం పాము చుట్టలు చుట్టుకుని బద్దకంగా కాలం రాయి కింద పడి వుంది అడుగు తీసి అడుగు వేస్తే ముళ్లు- ముళ్లు పరుచుకున్న నేల మీద యుద్ధాన్నెలా రచిస్తావు- అంతా ఎడారి నిశ్శబ్దం శ్మశాన నిశ్శబ్దం యుద్ధం తర్వాత యుద్ధక్షేత్రంలో చెల్లాచెదురుగా పడివున్న క్షతగాత్రుల అవయవ నిశ్శబ్దం ఓటమి నిశ్శబ్దం శిలాసదృశ్యమైన నేల మీద యుద్ధాన్నెలా రచిస్తావు- * కళ్లంలో కొంటికర్రతో సొప్పను పైకెత్తుతున్నాడొక రైతు పుల్లలను కూడేసి రాజేసిన మంటలో దుంపను కాలుస్తున్నాడొక పిల్లాడు పూలగంపను నెత్తిన పెట్టుకుని చెరువు కట్టెంబట ఊరిలోకి బయలుదేరుతుంది ఒకామె * నిశ్శబ్దం కొండ కూలుతుంది జనం నది కదులుతుంది ---------------------------------- Date: 07.03.2014

by బాలసుధాకర్ మౌళి



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g60ZY8

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి