పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మార్చి 2014, ఆదివారం

Ramakanth Vengala కవిత

పోలవరం-చలిజ్వరం ============== నియంత్రిస్తున్న నేత్రాల్ని పరాజితుల్ని చేస్తున్న.. దుస్స్వప్న౦.. పోలవరం! అది నిర్మితమవుతున్న క్రమంలో.. వైద్యమందని గూడాలను.. వణికిస్తున్న చలిజ్వరం!! విభజన నేపథ్యంలో గిరిజనుల ఉరికంబం! ఆస్తుల పంపకంలో ఏలికల వర్తకం! తూనికరాళ్ళలో ఏదో మోసం!! ఫలితంగా.. గోదారి పదఘట్టనల కింద నేలమట్టమవుతున్న పూరిగుడిసెలు! తెలంగాణా తుదిఘట్టంలో.. తాకట్టుపెట్టబడ్డ ఆదిమనుషులు!! ఈ పీడకల నిజమైతే.. ఇక..విముక్తి నిర్వచనం.. 1947- అర్థరాత్రిస్వాతంత్ర్యం! 2014- అర్థరహితస్వాతంత్ర్యం!! -రాము

by Ramakanth Vengala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hR78Gf

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి