పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మార్చి 2014, ఆదివారం

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 24 . నిన్నను ఒక మిత్రుడు తను కవిత్వం రాయలేకపోతున్నందుకు ఉత్తరం రాస్తూ, ఏమి వ్రాయను? ఏది రాద్దామన్నా ఎవరో ఒకరు ఇంతకుముందే వ్రాసేరేమోనన్న అనుమానం వెంటాడుతోంది. అందుకని రాయడం మానేసి చదువుతున్నాను అని రాసేడు. ఏ రచయితకైనా చదవడం చాలా ముఖ్యం... కవికి మరీను. అయితే, శ్రీశ్రీ చెప్పినట్టు "మనం చెప్పింది ఇంతకుముందు ఎవడో చెప్పే ఉంటాడు, ఆ చెప్పింది మనకంటే బాగా చెప్పి ఉంటాడు" అని అనుకుని రాయకపోవడం వల్ల కవి సృజనాత్మకతకి భంగం వస్తుంది. ఆ మాటకి వస్తే, ఏ ప్రపంచ సాహిత్యంలోనైనా కొన్ని వందల ఏళ్ళ సాహిత్య చరిత్రచూస్తే రాసిన వస్తువుమీదే ప్రతి తరంలోనూ కవులు రాస్తున్నారు. అయినా పాతతరాలకంటే మంచికవిత్వం కొత్తతరంలో వస్తూనే ఉంది. కారణం వస్తువు కొత్తదని కాదు, చెప్పే విధానం కొత్తది. అందిస్తున్న పాఠకుడు కొత్తవాడు; ఉపయోగిస్తున్న ప్రతీకలు వాటి సమకాలీనతవల్ల పాఠకుడి అనుభూతిపరిధిలోనివి... అందుకు. అదే పాత ఉపమానాలూ, పదబంధాలూ ఉపయోగిస్తే పాఠకుడు తప్పకుండా కవికి తలుపులు మూసెస్తాడు. ఇక్కడ ఒక చిన్న రహస్యం కూడా ఉంది. ప్రతికళాకారుడికీ ప్రవృత్తితోపాటు ఒక వృత్తి ఉంటుంది. అది అతని ప్రత్యేకత. ఆ వృత్తిపరిధిలోని విషయాలనూ, అనుభూతులనూ అతను "ప్రత్యేకతనుండి సార్వజనీనతకి ("from specific to Universal") తీసుకెళ్ళగల ప్రతిభావంతుడైతే, అతను ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. రావిశాస్త్రి కథకుడుగా రాణించడానికి అతని వృత్తిలోని అనుభవాలను అతను సార్వజనీనికం చెయ్యగలగిన సమర్థతే. ఈ చిన్న కవితకూడా ఆ కోవలోకే వస్తుంది. ప్రకృతిలోని Macro cosm , Macro Cosm ఈ రెండింటిలో ఎంత సామ్యం ఉందో ఒక శాస్త్రజ్ఞుడు ఎంత అందంగా చెప్పాడో పరికించండి. మైక్రోస్కోప్ లో ... . ఇక్కడకూడా మతిపోగొట్టే సుందర దృశ్యాలూ, చంద్రోపరితలాలూ, నీరవ ప్రదేశాలూ ఉన్నాయి. ఇక్కడకూడా జీవకణాలూ, సేద్యగాళ్ళూ, తమజీవితాన్ని తృణప్రాయంగా త్యజించగల యోధులైన కణాలూ ఉన్నాయి. ఇక్కడకూడా సమాధులూ, కీర్తిప్రతిష్టలూ, గుర్తింపులేకపోడాలూ ఉన్నాయి. వ్యవస్థలమీద తిరుగుబాటు గూర్చి నేను గొణుగుడు వింటున్నాను . మిరొస్లావ్ హోబ్, చెక్ కవి, వ్యాధినిరోధశాస్త్రజ్ఞుడు (13 September 1923 – 14 July 1998) . In the Microscope . Here too are the dreaming landscapes, lunar, derelict. Here too are the masses, tillers of the soil. And cells, fighters who lay down their lives for a song. Here too are cemeteries, fame and snow. And I hear the murmuring, the revolt of immense estates. . Miroslav Holub (13 September 1923 – 14 July 1998) Holub is one of the foremost Czech poets of the 20th century (and of Europe) and a reputed Immunologist. He has 10 volumes of poetry to his credit. His poems frequently deal with the grim realities of life and are written with scientific exactitude. He is widely translated (into more than 30 languages).

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mT4LpH

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి