పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మార్చి 2014, ఆదివారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ।। తాటాకు ఇల్లు ।। ---------------------- కొప్పున తాటాకు పువ్వులను తురుముకుని సిగ పాయలను తాళ్ళతో బంధాలు వెయ్యించుకుని మన రక్షణకై నిలిచే అమ్మలాంటి తాటాకు ఇల్లు. పుట్టినప్పటినుండి తొలి నేస్తమై బ్రతుకుని దిద్దుకునే క్రమంలో కన్నీటి సంతోషాలను పంచుకునే శాశ్వత బంధువులా. ఊరు పుట్టకముందే పుట్టి తనలో ఎన్నో పురుళ్ళు పోసుకుని సుఖ ధుఖ్ఖాలను సమానంగా సహించింది. తుఫాను రేగి కుండపోత వర్షం వొంటిని తడిపి కోసేసినా చెక్కు చెదరక బరించింది అభాగ్యుల గూడుకి దిక్కై నిలిచింది. రోళ్ళు పగిలే వేసవి పంజా విసిరినా గొడుగై ఎండ కాచి తన బిడ్డలకు చలిమర గదిలా. మక్కువతో కాంక్రీటు భవనం నిర్మించబోతే రవ్వంత బాధపడి చేసేదేమీలేక యజమాని అభిలాషకై నిలువునా కూలిపోయింది ఆశల సౌదం కింద పునాది రాయిలా మిగిలిపోయి ! (02-03-2014) (నాకు 20 ఏళ్ళు వచ్చేవరకూ మాది తాటాకు ఇల్లే )

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kHcHIZ

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి