పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, మార్చి 2014, ఆదివారం

R K Chowdary Jasti కవిత

శ్రీనివాస్ వాసుదేవ్ ఆకుపాటపై నిన్న సాయంత్రం ఒక అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో హైదరాబాద్ లోని Golden Threshold లో శ్రీనివాస్ వాసుదేవ్ గారి “ఆకుపాట” కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు నాకు సంతోషం గా ఉంది. Kavi Yakoob గారు ఒక ఆకాశహస్తమై కవులను ఒక చోట సమావేశపరచి కవిత్వాన్ని ముందుకు తీసుకుపోవడంలో పోషిస్తున్న ఆతని పాత్ర ఎంతో ముదావహం. ఈ ఆవిష్కరణలో పాల్గొన్న అరుణ్ సాగర్ గారు, కవి యకూబ్ గారు, హెచ్చర్కే గారు, నారాయణశర్మ గారు ఆకుపాటపై తమ తమ స్పందనల్ని అత్యద్బుతంగా వివరించారు. చివరగా కవి శ్రీనివాస్ వాసుదేవ్ మాట్లాడుతూ ఆకుపాట నేపద్యాన్ని క్లుప్తంగా చక్కగా తెలియచేశారు. నేనింకా పుస్తకాన్ని చదవలేదు. నిన్న సభకి అధ్యక్షత వహించిన వారు పుస్తకంలోని కొన్ని కవితల గురించి తమ స్పందనలని తెలియచేస్తుంటే అది తప్పకుండా అద్బుతమైన కవితల సంకలనమని చదవకుండానే తెలిసింది. అయితే పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత మరో సారి నా స్పందనల్ని తెలియచేయగలను.. ఆకుపాట ముందు అక్కడ వర్షం కురిసి ఆకుపాటని, శ్రీనివాస్ వాసుదేవ్ ని, మా అందరి కవుల్ని, ఇతర మిత్రుల్ని స్వాగతిస్తూ ఆవిష్కరణ ముగిసే వరకూ తను ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఆకుపాటని వింటూ మౌనంగా ఉండిపోయింది. విచిత్రం కదూ. ఈ సందర్భంగా శ్రీనివాస్ వాసుదేవ్ గారిని అబినందిస్తూ ఆకుపాట మంచి ఆదరణకి నోచుకోవాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. ఇటువంటి కావ్యావిష్కరణలు మరెన్నో జరగాలని కవిత్వం కోసం ఎంతో విలువైన సమయాన్ని వెచ్చిస్తూ కవిత్వాన్ని ఒక దైనందికవిషయంగా స్థిరపరచాలని ఒక మంచి సంకల్పంతో ఎంతో కృషి చేస్తున్న కవి యకూబ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ...... - జాస్తి రామకృష్ణ చౌదరి

by R K Chowdary Jasti



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pMZxhF

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి