పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఫిబ్రవరి 2014, శనివారం

Thilak Bommaraju కవిత

తిలక్ /అంతర్లీనం ------------------------ నిన్న జ్వలించిన ఆలోచనలు నేడు పుడుతున్నాయి మళ్ళీ కొత్తగా ఇక్కడే నా దేహంలో ఎప్పుడో ఎండురెప్పల వెనుక ఇంకిపోయిన నాలుగు ఊహా చిత్రాలేవొ రంగులద్దుకుంటున్నాయి­ బహిర్గతమయ్యేట్టు విరమించిన శకలాలన్ని కడుపులోనే అంతమవుతూ నన్ను నాకు గుర్తుతుకు తెస్తుంటాయి అప్పుడప్పుడూ ఇంకెన్ని సార్లు మరణించాలో కొత్తగా పుట్టడానికి ఎప్పటికప్పుడు నడిచొచ్చిన నేల గుర్తులను చెరుపుకుంటూ రహదారిని చిలకరించినట్టు నిడివిలేని అంతర్లీనం మనసున ఎన్ని కోరికల కూటములో లెక్కే లేవు కంటున్న ప్రతిసారి కాంక్షిస్తూనే ఉంటుంది. తిలక్ బొమ్మరాజు 01.02.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ijp4KT

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి