పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఫిబ్రవరి 2014, శనివారం

Bhaskar Kondreddy కవిత

kb ||జీవితానికి సరిపడా కవిత్వం|| కవి సంగమంలో అడుగుపెట్టిన మొదటిరోజు చదివిన కవితనుకుంటాను, కవి సంగమానికి నన్ను అతికించిన కవిత కూడా,.బహుశా ఇది,..ఇప్పటికి అప్పుడప్పుడన్నా దాన్ని చదువుతుండకపోతే ఎందుకో మనసుకి శాంతిగా వుండదు,.జీవితంలో ఎదురయ్యే భిన్న సందర్భాలను తీసుకుంటూ,వాటిని ఎదుర్కోవటానికి అవసరమయ్యే చిట్కాలను సైతం సుతిమెత్తగా హత్తుకుని హృదయంలోకి నిశ్శబ్ధంగా చొచ్చుకొనిపోయే కవిత ఇది,. మొత్తంగా తొమ్మిది ముత్యాల మాల ఇది,.ఒక్కోసారి అంటూ,.మొదలై , ఒక ఆశావాహ దృక్పథంతో ముగిసే ఒక్కోక్క భాగము,..ఒక్కొక్క తాత్విక వాక్కులాగా అనిపిస్తుంది,నాకు,.. అందకనేనేమో,,,నేను దీనికి ఎంచుకున్న టైటిల్, జీవితానికి సరిపడా కవిత్వం,. అని,.. మనలోకి మనం తొంగి చూసుకోవల్సిన అగత్యం గురించి,.నిశ్శబ్ధాన్ని ఆశ్రయించాల్సిన అవసరం గురించి, ఆలోచనలు ఆర్పి శూన్యాన్ని ధ్యానించాల్సిన సమయం గురించి,.మనతో చర్చించినట్లే వుంటుంది, శత్రువు కూడా, అపోహలు తొలిగించుకుంటే స్నేహితుడిని ఎలా మించిపోతాడో,, జీవితాన్ని ఆత్మతో చేసే రసవత్తర ప్రణయంగా ఎలా మార్చుకోవాలో, వస్తువులతో కాదు, అనుబంధాన్ని ఆత్మీయులతో ఎలా పెంచుకోవాలో,.. తెలుసుకోవాలంటే ,,ఈ కవితను గుండెలోపలి చెమ్మగా మార్చుకోవలసిందే,.. సంతృప్తిగా సౌఖ్యాన్ని, కుదురుగా కూర్చోని గెలుపుని, పరీక్షలేకండా జీవితాన్ని ఎంత ప్రశాంతంగా ఆస్వాదించాలో అర్థం చేసుకోవాలంటే ఈ కవితను,.మనలోకి వంపుకోవలసిందే,.. ఒక భారమైన విషయాన్ని కవితా వస్తువుగా ఎలా మలుచుకోవచ్చో,ఎంత సరళంగా ఒక కవితను అల్లుకోవచ్చో, భావాన్ని ఎంత సూటిగా నాటుకోవచ్చో , స్పష్టంగా చెప్పిన కవిత ఇది,.. సమస్త సంశయాలు ధ్వంసం కావడం, రసవత్తర ప్రణయం గా తర్జుమాకావడం, గమ్యంలో వున్న గెలుపు గమనంలో దొరకడం, పరీక్ష అనుకొని జీవితాన్ని చదవడం మానేయడం, ఈ కవితలో నాకు బాగా నచ్చిన వాక్యాలు,... ,.కొంచెం నిడివి తగ్గించివుంటే మరంత బావుండేదేమో,.అని ఒక్కోసారి అనిపించినా,..లోతైన విషయం దృష్ట్యా అది మరగున పడుతుంది,కొన్నిసార్లు,. స్నేహితుడిని మించి శత్రువు సహాయం చేయడం,..అనే మాట కొంచెం కటువుగా ధ్వనిస్తుంది,.కానీ అలా జరిగే సందర్భాలను కూడా తోసిపుచ్చలేం. ఈ కవిత మీద కొందరి అభిప్రాయాలు ,. అణిముత్యమిది, భావనలో పరిపక్వత ప్రతి అక్షరంలోనూ ద్యోతకమౌతుంది, పునరుక్తి లేకుండా ఇలాంటి వస్తువుతో ధీర్ఘకవిత రాయడం కత్తిమీద సామే,………కరిముల్లా ఘంటసాల మనసుకి పండుగలా వుంది , ఈ కవిత చదివాక,జీవన తాత్వికతను కవితగా మలవడం గొప్పగా వుంది............కవి యాకూబ్ అందరికి ఎప్పుడో ఓ సారి మనసులో కదలి చెరిగిపోయే చిత్రం, చక్కగా గీసావు,..నందకిషోర్ ఒంటరి తనం నడిమధ్యలోకి నడవాలి,..ఆ లైన్ దగ్గర నేను నడక ఆపానేమో,,ఈ కవితలో ,...నా కవిత్వంలోనూ,........అఫ్సర్ ఒక్కోసారి ఇలాంటి కవితలు చదువుతుండాలి, ఏమో అలా చేస్తే కవితలెలా రాయాలో అవగతమవ్వావచ్చు,....సురేష్ వంగూరి,. ఉదాత్తమైన ఆలోచనా ధోరణి. మనిషికి, సమాజానికి ఆరోగ్యాన్ని చేకూర్చే ఔషధం లాంటి కవిత,.....బివివి ప్రసాద్ కవిత్వం ఎలా వుండాలో చూపాలంటే, ఇలా అని ఖచ్చితంగా చూపాల్సిన కవిత,..కట్టా శ్రీనివాస్ నచ్చిన కవితను గురించి చెప్పేటప్పుడు, సాధారణంగానే,.కొంత ఎక్కువగా రాసేస్తాం,.కవిత్వం నచ్చడం వ్యక్తిగత అనుభవం కాబట్టి అసలు ఆ కవితలో ఏముందో తెలుసుకోవాలంటే వెంటనే చదివేయండి, మరి,. మీ కోసం ఆ కవిత,.మీ అభిప్రాయన్ని కూడా పంచుకుంటారని ఆశిస్తూ,. ఒక్కోసారి.. కిరణ్ గాలి 1. ఒక్కోసారి సమూహాలకి సాధ్యమైనంత దూరంగా,ఒంటరితనం నడిమధ్యలోకి నడవాలి నిన్ను నువ్వుగా కలవాలి, పలకరించాలి, పరామర్శించాలి ఏమో అలా చేస్తె సమూహాలలొ లేని స్నేహం, స్వాంతన, కోలాహలం నీకు నీలోనే దొరుకుతుందేమొ........ 2. ఒక్కోసారి శబ్ధాలను బహిష్కరించి నిశ్శభ్దాన్ని ఆహ్వానించాలి కాలం అడుగుల చప్పుడు వినపడని ఖామోషి తేవాలి ఏమో అలా చేస్తే నిశ్శబ్ధం మౌనం వీడి నీతో మట్లాడవచ్చు, నువ్వు ఇదివరకెరుగని నిజాలను చెప్పవచ్చు నువ్వు నిజమనుకున్న అబద్దాలను చెరపావచ్చు 3.ఒక్కోసారి ఆలోచనలన్నింటిని ఆర్పేసి,శూన్యాన్ని వెలిగించి ధ్యానించాలి స్తబ్ధతలోని చైతన్యాన్ని, చైతన్యంలోని నిశ్చలతను అన్వేషించాలి ఏమో అలా చేస్తె ఆ ధ్యానంలోనే సర్వసత్యాలు సాక్షాత్కరించవచ్చు, సమస్త సంశయాలు ధ్వంసం కావచ్చు *** 1. ఒక్కోసారి స్నేహితులని కాకుండా , శత్రువనుకున్న వాడినీ సంప్రదించాలి అహాలు అపోహలు అడ్డురాకుండా అడగవలసినవి అడగాలి ఏమో అలా చేస్తే స్నేహితుడిలా సలహాలతో సరిపెట్టకుండా సహాయం కూడా చేస్తాడేమో 2. ఒక్కోసారి మనిషితో కాకుండా మనసుతో పరిచయించాలి తనువుతో కాకుండా ఆత్మతో సహచరించాలి ఏమో అలా చేస్తే పరిణయంగానె మిగిలిన ప్రహసనం, రసవత్తర ప్రణయంగా తర్జుమా కావచ్చు 3. ఒక్కోసారి కూడ బెడుతున్న సంపాదన కాకుండా దాచి పెడుతున్న కాలాన్ని కూడా ఆత్మీయులకు ఖర్చు పెట్టాలి ఏమో అలా చేస్తే కొని తెచ్చిన వస్తువులు ముడివెయ్యలేని అనుబంధాన్ని కలిసి గడిపిన క్షణాలు, కడవరకు తోడు తేవచ్చు *** 1. ఒక్కోసారి పొందవలసిన సుఖాల జాబితా పక్కన పెట్టి పోగొట్టుకున్న సంతోషాల చిట్టా విప్పి చూసుకోవాలి ఏమో అలా చేస్తే లేని వాటిలో వున్న సౌఖ్యం కన్న వున్నవాటిలో లేని ఆనందంమేముందని తెలుస్తుంది 2. ఒక్కోసారి పరిగెత్తటం మానేసి ఆయాస పడుతున్న కాలాన్ని, కుదురుగ కూర్చొని చూడాలి రాలి పడిన క్షణాలని, నిమిషాలని, రోజులని, దులుపుకొని జేబులో దాచుకొవాలి ఏమో అలా చేస్తే గమ్యంలో వుందనుకున్న గెలుపు గమనంలో దొరకావచ్చు 3. ఒక్కోసారి ప్రశ్నలడగడం, జవాబులు వెతకటం మానెయ్యాలి పరీక్ష అనుకొని జీవితాన్ని చదవడం ఆపెయ్యాలి ఏమో అలా చేస్తే ఫలితం గురించిన బెంగ లేకుండ స్వేచ్చగా జీవించవచ్చు, సంతృప్తిగా మరణించనూవచ్చు -------------------------------------------------- వీడియో చూస్తూ వినాలనుకుంటే,. ఇక్కడకెళ్లండి., http://ift.tt/1eehZMn -------31-1 -2014--------

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eehZMn

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి