పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, ఫిబ్రవరి 2014, శనివారం

Oddula Ravisekhar కవిత

ఇదే కదా మరణం ఇచ్చే సందేశం! సర్వ బంధాలనుండి విముక్తి సమస్త బాధలనుండి స్వేచ్చ కలగన్నవి, పెంచుకున్నవి, పంచుకున్నవి అన్నింటిని తుంచివేసే సంపూర్ణ స్వేచ్చ మృత్యువు జీవితానికి చివరి అంచు కాదు ప్రతి క్షణం మరణ స్ప్రుహ తో జీవించడం మనిషి పోగుచేసుకున్నవన్నీ విసర్జించడం అదే కదా మృత్యువు యొక్క ఆంతర్యం జీవించడమంటే మరణించడమే ప్రతిరోజు పెంచుకున్న బంధాల్ని ఒక్కొక్కటిగా తుంచుకోవడమే జీవించి ఉండగానే బంధాలన్నీ వదలగలిగితే మృత్యువు తర్వాత అదే కదా జరిగేది జీవిస్తూనే మృత్యువును అనుభూతించడం అదే సిసలైన ధ్యానం మరణించడమంటే ప్రేమతో జీవించడం ప్రేమించగలిగే హృదయం కలిగి ఉండటం ప్రతి క్షణం మనతో ఉండే నేస్తం మృత్యువు ప్రతి క్షణం మరణించాలి మన జ్ఞాపకాలకు మరు క్షణం జననం ప్రేమిం చటానికి క్షణక్షణం జనన మరణ స్పృహ ఇదే జీవనం సజీవ జీవనం ఇదే కదా మరణం ఇచ్చే సందేశం (జిడ్డు కృష్ణమూర్తి తత్వ సారం మరియు మరణాన్ని దగ్గరగా చూసిన అనుభవం తో )

by Oddula Ravisekhar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1abyaci

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి