పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, ఫిబ్రవరి 2014, శనివారం

Kavi Yakoob కవిత

యాకూబ్ | నిర్భయలోకం .............................. నెత్తుటి విత్తనాల్ని వెదజల్లి శాంతివనాల్ని కోరుకోలేం . పల్లేరుకాయల్లాంటి పలుకుల మధ్య సహజీవనాన్ని ఊహించలేం . పొదుగుల్నికోసి తెల్లని క్షీరదారల్నిఆశించలేం . ప్రతి అడుగులో అవమానాల వంతెనలు వేసి సాఫీగా సాగే ప్రయాణాల్ని కలగనలేం . నిరంతరం నిప్పుకణికలా జ్వలించే ఆత్మతోనే అసలైన అవసరం. అద్దంముందు నిలబెట్టి ప్రతిబింబాల్లోంచే అసలైన నిజాల్ని వెలికితీయాలి. ఊచలవెనుక ఉన్న ఊహల్ని సీతాకోకచిలుకల్లా నిర్భాయలోకంలోకి ఎగరేయాలి . అంతరంగం శిలువపై రక్తమోడుతున్న కాలాన్ని విముక్త ఔషధంతో బతికించాలి. అప్పుడిక శాంతివనాలు, సహజీవనాలు, నిర్భయగానమూ.....! [ 'ఎడతెగని ప్రయాణం' నుంచి,2009 ]

by Kavi Yakoob



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f3BDJL

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి