పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

15, ఫిబ్రవరి 2014, శనివారం

Boorla Venkateshwarlu కవిత

*ప్రేమ కోసం ఒక రోజు*బూర్ల వేంకటేశ్వర్లు* మనిషికొక పుట్టిన రోజున్నట్టు ప్రేమకొక పుట్టిన రోజుండడం అది కొవ్వొత్తై కరిగిపోతూ నాకోసం వెలగడం ఆ వెండి వెలుగుల్లో హృదయం తెల్ల పావురమై ఎగరడం ఎంత గగుర్పాటు ఎవరైనా ఒకనాడు చూపుల్లో తేనె సముద్రపు నావ వలె చిక్కిపోయి నవ్వుల్లో మైమరచి కదలని కన్నులా నిలిచిపోయి మాటల్లో కాలమంతా పూలవర్షమై కురిసిపోయి నిలువెల్లా పాదపీఠి దగ్గర పూవులా ఒదిగిపోతే అది ప్రేమ కాక మరేమిటి? దిగంతాల ఆవలి పాలమీగడల సౌందర్యం వొళ్ళో తలదాచుకున్నట్టు బంగారు జలపాతాలు చుట్టు ముట్టి హృదయం స్వర్ణ కాంతి మయమైనట్టు సమ్మోహన పూల సౌరభం లోబరచుకున్న కాంక్షల పరిష్వంగంలో దేహం నీటిమీది ఆవిరై తేలినట్టైతే అది ప్రేమ కాక మరేమిటి? చెంపమీద నెమలీకలు కదిలినట్టు కంఠంమ్మీద ముని వేళ్ళతో నిమిరినట్టు హృదయం మీద తారాడే మెత్తని స్పర్శ ప్రేమ కాక మరేమిటి? ఒక రోజుతో అలసిపోతే ఒక రోజాతో విసిగిపోతే పర్సు ఖాళీ అయి వెల వెల పోతే కత్తులు నూరితే కాట్నాలు పేరిస్తే కోర్కెలన్నీ తీరిపోతే కొలతలన్నీ మారిపోతే నేల రాలే తోకచుక్క ప్రేమ కాదు కదా! అది విశ్వాన్ని చుట్టిన అనంత వస్త్ర చైతన్యం మనుషుల్లో పసిపాపల కళ్ళలాంటి నైర్మల్యం భూమ్మీద ఉచితంగా దొరికే కైవల్యం ప్రేమ కోసం ఒక్కరోజుండడమేమిటి? సమస్త మానవాళి హృదయాలింగనం కోసం నేను రోజూ ఒక రోజాపువ్వుతో ప్రేమగా ఎదురుచూస్తుంటాను. తేది: 14.02.2014

by Boorla Venkateshwarlu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jlNALm

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి