పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎

3, మే 2014, శనివారం

Venkat Chadalavada కవిత

If jagan can become cm then thats end of democracy ....I get glimpses of a ruler called callugla who ruled Rome on his personal agenda the same will happen in andhra ....he was also great crowd puller but a selfish psychopath ....it's same to same ... Callugla didn't hesitate to sleep with own sister ...jagan can do worst than that to become cm...

by Venkat Chadalavada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q14C8F

Posted by Katta

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || మారని తలరాత || ========================== ఓ నేతన్నా ! నేతలెందరు మారిన రాత మారదు గీత మారదు తలరాత మారదు. బతుకు రాత మారదు గాంధీ మెచ్చిన ఖాది తెచ్చింది అంతర్జాతీయ ఖ్యాతి నేతన్నా! నీకు మాత్రం దిక్కేది ఆదరించే దారేది? కడుపు నింపని బతుకులు తీరేనా? ఆకలి వెతలు! సరిజట్టు కూలీల మోతలు ఆగేనా ?ఆత్మహత్యలు సాగేనా? వలసలు పట్టని నేతలు పట్టించుకోని ప్రభుత్వాలు ఆకలి బాధలు వలస బతుకులు శ్రమ శక్తీ నీదన్న లాభం దళారిలదన్న దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు ఓ!నేతన్న! నిన్ను కరుణించే వారు ఏరన్న!!! ======మే 03/2014====

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Rfcnbh

Posted by Katta

Mothi Mohanaranga కవిత

మోతి మోహనరంగా........//// ఒకమ్మాయి కావాలి క్యాస్ట్ అడిగే కట్నం తచ్చే పరిక్షలు పెట్టే యక్షప్రశ్నలు వేసే కండిషన్స్ పెట్టే కా0ప్రమైజ్ అయ్యే అమ్మాయి నాకొద్దు. కఠావుగా మాట్లాడే కర్షకంగా ప్రవర్తి0చే రాక్షసంగా చూసే రాసిరంపాన పెట్టే రంకెలు వైసే రాజీ పడే అమ్మాయి నాకొద్దు. రూపవతి ప్రేమవతి గుణవతి దానవతి ధైర్యవతి అయిన అమ్మాయి కావాలి. తనకు నచ్చినట్టు ఉ0టు తల్లీలా చూసుకునే తండ్రిలా పాలి0చే ఫ్రే0డ్లలా సూచనలి0చే కొట్టినా ఎ0 లేదు గాని వళ్ళో కూర్చో పెట్టుకొని ఉయ్యాల ఊపే అమ్యాయి కావాలి. 03-05-204

by Mothi Mohanaranga



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iawahM

Posted by Katta

Venu Madhav కవిత

కరిగిపోయిన కాలం తిరిగిరాని జ్ఞాపకం తలచి తలచి నిలిచిపోతే సాగదు నీ జీవితం తిరిగిరాదు నీకు ఇస్టమైనా గతం ఎన్ని ఆటపోట్లు ఎదురైనా ఆగదు నీ హృదయం అది ఆగేసరికి మిగలదు ఈ జీవితం మారేందుకు నీ దరికి రానీ వాటికై ఈ ఆరాటం అనుభవించు కష్టమైన నష్టమైన తిరిగిరాని ఈ నిమిషం మీ వేణు

by Venu Madhav



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mp3tX0

Posted by Katta

Arcube Kavi కవిత

కుళ్ళిన పళ్ళతోట-7 ________________ఆర్క్యూబ్ అది దొంగకు లొంగని డెంటయిన్ మూలం మెత్తని కరవాలం పెయ్యికి వెన్నుదన్ను ఎనామిల్ గన్ను పట్టుకొని పాయువుదాకా కాపల పన్నే కిరీట దారి పళ్ళే పెద్ద పటాలం ఊట తీర్థం ..స్వేత పద్మం వాక్ భువనం ..మేరున్నగం ఎగిలివారంగనే వేప పుల్లోపనిషత్ బట్టీయం ఇపుడిట్లా- దంతదావనం శ్రుతి తప్పి ఓర్చుకోలేని బాధ పురికెక్కుద్ది టైం చూసుకుని నోస్టాల్జియ అది -తీరికున్నప్పుడే ప్రత్యక్షమయ్యే మంత్రగత్తే గతాన్ని ముందు పెట్టి శబరి లెక్క కొసరి కొసరి ఫోజు గొడుతుంటది వద్దన్నా-లాలాజల ఓలలాటలో జ్ఞాపకాలు సొర్రేస్తయి గర్బస్తమైన పన్ను కేంద్రంగా బాల్యం విస్తరిస్తది రైకల నిండ పండిన పాలపండ్లే బోసినోట్లో చుక్క పొద్దై కథ నడుపుతై ఆ కథల్నే - దవడ ఎముకల్లో దేహ సౌందర్యం మొలకేత్తి పాల పన్నైతది పైన కిరీటం లోన వేళ్ళు అవి నరాలు రక్త నళాలు నది రక్తం పేఠభూమి మాంసం ఎలపట దాపట జీవన్మరణం సాగవుతున్న భూగోళం మనిషి నడిచే పళ్ళతోట ఆ తోటే దేహపు కుల గోత్రం శాశ్వత మురిపాల వంశవౄక్షం * (ఇంకా వుంది )

by Arcube Kavi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ne6hmM

Posted by Katta

DrAcharya Phaneendra కవిత

నరకమైన నేమి ? నగ్నసత్య మగుచో - దాని స్వీకరింతు ధైర్యముగను ! స్వర్గతుల్య మది - అసత్యమైన యెడల - దాని ఛీత్కరింతు ధర్మమనగ ! (3 may 2014)

by DrAcharya Phaneendra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iV7Aqm

Posted by Katta

Chi Chi కవిత

_హింసాత్మ_ ఆత్మలంట వ్యక్తులంట పందులేం తింటాయో తెలిసి కూడా పందుల్ని తినేవాళ్ళు పందులే!! నువ్వేమాలోచిస్తావో అది నువ్వవుతున్నప్పుడు నువ్వేం తింటావో కూడా అది నువ్వైపోతూంటావ్ మనసొక్కటేకాదు మరి మనిషంటే.. అవ్యక్తమైన స్పృహని వాక్యాల్లో కక్కునే అసమాన దృష్టున్నందుకు, దివ్యత్వాన్ని పంచే తాపత్రయం ఉండొచ్చేమో వ్యక్తికి!! అంత మాత్రాన మనసుని మాత్రమే అనుకునే వ్యక్తిత్వానికి తిండెందుకు?? మలమెపుడూ వ్యక్తిగతమే.. పంచక్కర్లా!! కాదని మలం పట్టి తెచ్చే పుచ్చెక్కిన పుర్రెలకి మనసే మలం కాయం మరుగులో!! ఒంటిక్కావాల్సిన మోజుల్లో కంటికి ఒళ్ళే కనిపించనంత పరమాత్మావేశానిది ఆకలే తప్ప ఆలోచన కాదు!! ఆ దేహానికి లోకమొక రోగమంతే దాహం తీరక!! పొయ్యేదే ఏ దేహమైనాన్న నొప్పిలో పాడె మీద బతుకీడ్చేయాల్సిందే!!____ (3/5/14)

by Chi Chi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iUYABC

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: నువ్వేమనుకుంటే నాకేంటి..: నువ్వేమనుకుంటే నాకేంటి.. ఇక్కడ నా గుండెలో తిష్ట వేసుకున్నదే నీవు..! నువ్వేమనుకుంటే నాకేంటి.. ఇక్కడ నా శ్వాసలో ఉచ్వాసనిశ్వాసనములయినదే నీవు..! నువ్వేమనుకుంటే నాకేంటి.. అంత తేలికగ నను వదలగలవేమో నేనయితే ప్రాణాలే వదలగలను..! నువ్వేమనుకుంటే నాకేంటి.. నేను నీలో బందీయయి నేనుగ శూన్యమై చాలా రోజులే అయ్యింది..! నువ్వేమనుకుంటే నాకేంటి.. పోతావా..ఉంటావా..ఇది నీ నిరంతర సంఘర్షణ.. చావులోను నీ చేయి వదలని సడలని విశ్వాసం నాది..! నువ్వేమనుకుంటే నాకేంటి.. ప్రాణాలన్ని నీయందుంచి శిలా సదృశ్యుడనయినాను నన్నేవరూ గాయపర్చలేరు..! దిక్కున్న చోట చెప్పుకో..!! చేతనయ్యింది చేసుకో..!! 03/05/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kv00PL

Posted by Katta

Nirmalarani Thota కవిత

ఒక్క సారి నవ్వాలని ఉంది ఒక రోజులోనే వసి వాడినా ఓడని వీడని పరిమళాల శ్వాసతో అరవిరిసిన సిరిమల్లిలా స్వచ్ఛంగా భేషజాల ముసుగు తీసి ఒక్క సారి నవ్వాలని ఉంది ! * * * ఒక్క సారి ఏడ్వాలని ఉంది ఒక పూటలో విడివడినా మలయ సమీరపు స్పర్శకు కరిగి కురిసే నీలాల నీరదంలా ఆర్ద్రంగా అస్తిత్వాల ఆనవాళ్ళు చెరిపేసి ఒక్క సారి ఏడ్వాలని ఉంది ! * * * ఒక్క సారి స్నేహించాలని ఉంది అల్లంత దూరాన ఉన్నా అందని ఆకాశపు ఆత్మీయతకై అలుపెరుగక ఎగిసే అలల జవ్వనిలా ఆత్రంగా ఓటములన్నీ ఒడ్డున పెట్టేసి ఒక్క సారి స్నేహించాలని ఉంది ! * * * ఒక్క సారి ప్రేమించాలని ఉంది తన రాకతోనే ఆవిరైపోతానని తెలిసీ ఒక్క ఘడియ తనలో నిండే వర్ణాతిశయపు అనుభూతికై సూరీడి కడగంటి చూపు కోసం వేచి చూసే మంచు బిందువులా తమకంగా కదిలే కాలపు హద్దుల్ని మరిచి ఒక్క సారి ప్రేమించాలని ఉంది ! * * * ఒక్క సారి ముద్దిడాలని ఉంది తాకుతూనే అవని గుండెల్లోకి ఇంకిపోయే స్వాతి చినుకులా వెచ్చగా తీరని తపన అణువణువూ నిండేలా ఒక్కసారి ముద్దిడాలని ఉంది ! * * * ఒక్క సారి హత్తుకోవాలని ఉంది పెను తుపానుకు వెరువక ధరణి మేను కరుచుకునే గడ్డి పరకలా ధైర్యంగా ఆలంబనై అల్లుకునే ఎదను నిశ్చింతగా ఒక్క సారి హత్తుకోవాలని ఉంది ! * * * ఒక్కసారి జీవించాలని ఉంది తను కరుగుతూ నలుదెసలా వెలుతురు నింపే కొవ్వొత్తిలా కనుమరుగవుతూ కాంతిని పంపే చీకటిలా స్వార్ధాల అర్ధాలన్నీ చిదిమేసి ఒక్కసారి తరించాలని ఉంది . . ! * * * ఒక్క సారి బ్రతకాలని ఉంది మరచిపోయిన స్పందనలన్నీ సజీవంగా ఎదురొస్తే తెరలు పొరలు . . అహాలు అడ్డుగోడలు దాటేసి మనసున్న మనిషిలా.. ఒక్కసారి.. ఒక్కసారి బ్రతకాలని ఉంది . .! నిర్మలారాణి తోట ( తేది: 03.05.2014 )

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i4CQm2

Posted by Katta

విష్వక్సేనుడు వినోద్ కవిత

ప్రేతాత్మతో ప్రేమ! కైపెక్కించే నీలికళ్ళ సుందరికి సైటేద్దామంటే సిసలైన సాఫ్ట్వేర్ ఇంజినీరైతేనే వాటేస్తానంది సన్న నడుమున్న చలాకీ పిల్లకి ప్రపోస్ చేస్తే సివిల్ సర్వీస్ లో ఉంటేనే తనకో స్టేటస్ అంది కాలి గజ్జల కొంటె కోమలాంగిని కోరుకుంటే కాంట్రాక్టర్ అయితేనే కోరికలు తీరతాయంది లేత పెదవుల లేటెస్ట్ లేడీకి లవ్ లెటర్ రాస్తే లాయరైతేనే తనపెదాలతో వాదించగలడంది వాలుజడ వయ్యారికి చిరునవ్వును విసిరితే విమానాలు నడిపెవాడివి కాదంటూ కసిరేసింది ఇవన్నీ కాని నేను ప్రేతాత్మను ప్రేమిస్తానంటే ప్ర్రాణంలేని తను నా ప్రాణమై ఉండిపోతానంది

by విష్వక్సేనుడు వినోద్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKGFhj

Posted by Katta

Maheswari Goldy కవిత

COULORFUL BUTTERFLIES ARE DANCING IN MY LIFE…!! MAHESWARI GOLDY Today My heart shines like a yellow butterfly My poetic sense sparkling like silver stars in the sky...!! Wow.....!! Too amazing I think I can imagine easily What is the secret behind my happiness? Oh...!! God My soul not reveal clearly Hey soul gives a proper spirit to my mind mirror To feel the perfect fragrance...!! May be They all lightening my cherish in the presence of him only At the same time they all have to plan For resembles my life consciousness In the red carpet of the white palace...!! Yes yes I could catch them now All pearls of all shades jewel my mind closely…!! But…!! How can I hold them in my arms? Now I should share that shade to him definitely. How? I hope it is only possible with my poems Because those poetic letters Absolutely delight the charm of him…!! And colorful butterflies made my thoughts more beautiful To vanish the trembling darkness between us…!!

by Maheswari Goldy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKGF0M

Posted by Katta

Ravela Purushothama Rao కవిత

ధ్వని ముద్రితం కాని సంభాషణ ====================== రావెల పురుషోత్తమరావు కలకాలం గుర్తుండిపోయేది కల కాదుకదా వారానికొక్క సారయినా మన జీవిత గమనాన్ని మనం మూల్యాంకనం చేసుకోగలగాలి. అప్పుడే మోడు వారిన జీవలతికలపైనా కొత్త చిగురుటాకులు మొలిచే వీలుకలుగుతుంది. ఒక్క సారయినా అలా చేయలేని మౌనం నేరంగానే పరిగణించ బడాలని నా భావం. చేసిన తప్పొప్పుల పట్టికను చేరదీసి చిక్కుదీసి సమీక్షించుకోవడం సరయిన కార్యక్రమం కాదని ఎలా చెప్పగలను?. దాగుడు మూతలతో ఆటమొదలయినప్పుడే దండనల జోరూ మొదలవుతాయి. అంతరంగాన్ని మధించకుండా అన్యోన్యతనూ అభిమానాన్నీ సాధించడం కష్టతరమని నా ప్రగాఢ విశ్వాసం. వెలుగునీడలమధ్యన పెల్లుబికే వేదనలనూ అశృత్యాత్మక్షోభను అణచలేమని కూడా మనం అర్ధం చేసుకోగలగాలి నిరంతరం మౌనమే సమాధానమనీ కాలమే గాయాలను మానుపుతుందని , అలా నిరంతరం ఎదురుచూపులతో నిరాశా నిస్పృహలతో గడుపుతూండడం ఎంతవరకు సమంజసమో భావ్యమో నీవే నీకుగా తెలుసుకో ! మేలుకో దూరమైనా గమ్యం చేరుకునేదాకా విశ్రాంతిని కోరుకోకు. కడుపునిండా నవ్వుకుని కంటనిండా కునుకును నింపుకుని ఎన్నాళ్ళయిందో గమనించు. అభద్రతాభావంతో ఎన్నాళ్ళని అంతర్గత సంఘర్షణనూ ఆక్రోశాన్ని అణచి వున్వుకోగలమో ఊహించు.ఈ స్థితి ఆరోగ్యప్రదం కాదని ఎన్ని సార్లు నేను నొక్కి వక్కాణించానో ఒక్కసారి పునరాలోచన చేసుకో. ధ్వని ముద్రితం కాని ఏ సంభాషణయినా చిరకాలం చెవుల్లో రింగు రింగు మనదని గుర్తుంచుకో 03-5-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i9I8s9

Posted by Katta

Mohan Krishna Ananthoju కవిత



by Mohan Krishna Ananthoju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lKE9aW

Posted by Katta

Udaya Babu Kottapalli కవిత

నానీలు నోటు నల్లముసుగు లో ఓటు అమ్ముకుంటే . . పాలించేది నేత కాదు . . నిలువునా దోచేసే జాతి పీత . . . అమ్మ పాలు ..వేసే ఓటు . . . అమృతం అంత పవిత్రం . . నోటు తో చేయకు దానిని గరళం . . . . . నాయకులు . . . . గురువులు లేని పూ . . జారులు . . లింగంపాటు గుడినీ . . . కబ్జా చేయగల జాలరులు . .

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Retz0w

Posted by Katta

Udaya Babu Kottapalli కవిత

నానీలు ఓటు పతివ్రత అని ఎవడన్నాడు . . రాజకీయ కౌరవ దర్బారులో వలువలు ఒలిచే దుశ్శాసనుడినడుగు . . . . . నీ చూపుడువేలు పైన పెట్టినది ఓటు చుక్క కాదు . . అచ్చమైన సేవకుడి నుదుట వీరతిలకం . . . . . . అంపశయ్య మీద రాజకీయ కళేబరానికి నీ ఓటే ధీటైన సంజీవని . . . . . కొత్తపల్లి ఉదయబాబు . . 20.4.2014

by Udaya Babu Kottapalli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q0aYVB

Posted by Katta

Panasakarla Prakash కవిత

కాలవాతల‌ అప్పుడెప్పుడో నాన్నా నేను కలిసి పడవ మీద కాలవాతలి పొలానికి ఎళ్ళేవోళ్ళ౦ నాన్న దూళ్ళకి గడ్డి కోసి౦తరవాత‌ అదే కొడవలితో నేను ము౦జిగెళ్ళని బర్రా బర్రా కోసేవోడ్ని మా పొల౦ సుట్టూ అరవై డబ్భై తాటిసెట్లు౦డేవి మరి కళ్ళు గీసుకోమని ఈడిగోళ్ళ సీనుకి కొన్ని తాటిసెట్లు అప్పసెప్పినా మిగతావి మా కొడవలికి సమాధాన౦ సెప్పాల్సి౦దే వేసవికాలమ౦తా మా కళ్ళు తాటిసెట్లమీదే గరిగమ్మలు గీసుకుని రక్త౦ కారతన్నా అసలా దెబ్బల్ని లెక్కే సేసేవోళ్ళ౦ కాదు రె౦డు కళ్ళ ము౦జుల్ని పక్కనాడేసి మూడుకళ్ళ ము౦జులతోనే బళ్ళు కట్టేవోళ్ళ౦ మన బ౦డి లాగేది ఆ తినేత్రుడే కదా...! సిన్నప్పట్ని౦చీ నాకు కాలవాతల పొలమ౦టేనే ఇట్ట౦ ఎ౦తుక౦టే నా బాల్య౦ ముడిపడు౦ది దానితోనే మొన్నామద్య గట్టిగా అప్పు పడి ఆ పొల౦ అమ్మేసాడు నాన్న... అప్పుడ౦దర౦ కన్నీళ్ళెట్టుకున్నా౦ నాన్నైతే ఇ౦క సెప్పక్కర్లెద్దు ఆ బాత్తో నాన్నటెల్డ౦ మానేసాడుగాని నేనటు ఎప్పుడెల్నా తాటిసెట్టు ఆకులూపుతూ పైరు పచ్ఛగా తలూపుతూ నన్నే పలకరిత్తన్నట్టినిపిత్తాది వేసవొచ్చి౦ద౦టే సాలు మా కాలవాతలి పొల౦ గుర్తొచ్చి కొడవలితో గు౦డె కోత కోసేసినట్టు౦టాది.. పడవెక్కి అవతలగట్టుకెళ్ళాల౦టేనే బె౦గ ఒకప్పుడు పడవ దాటి౦చిన కిట్టమూర్తే ఇప్పుడు మమ్మల్ని పరాయోళ్ళుగా సూత్తన్నాడని.......! పనసకర్ల 3/05/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kuBUo1

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

నా కవితలపై స్ఫందిస్తున్న మీ అందరికీ నాధన్యవాదాలు -ఎస్జీడీ

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i9qrsH

Posted by Katta

Chandrasekhar Sgd కవిత

శ్మశానాల వాకిట వెలసిన ఓపిశాచాల్లారా! ఈ భూబకాసురులు శ్మశానాల్ని కూడా కబళిస్తారు జాగ్రత్త

by Chandrasekhar Sgd



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i9qu7O

Posted by Katta

Vempalli Gangadhar కవిత

కొత్తగా పుస్తకాలు ప్రచురించు కోవాలనుకునే వారికి ఆర్థిక సహాయం ....... LINK; http://ift.tt/1rOKwKb

by Vempalli Gangadhar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fDDOqC

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/ఖాళీ ---------------------------- నాలోకి తొంగి చూసాను లోపలంతా శూన్యమే తెలియని డొల్లతనాన్ని పూడ్చడానికి ప్రయత్నించాను నా ఆలోచనలన్నీ నన్ను వీడి సుదూరంగా ఎక్కడికో వలసపోయాయి నన్ను కాదని బహుశా వాటికి కూడా మనసు సాంద్రత తెలిసినట్టు లేదు కటిక కిరణాల కింద తడుస్తున్న దర్పణంలా నేను/ఎంతకీ వక్రీభవించని కొన్ని ఎడారి పూలు మండుతున్న చితిలో నిశ్చలంగా ఒళ్ళు కాల్చుకుంటున్న ఓ శరీరం/ పాకుడురాళ్ళపై నిశ్శబ్దంగా కొన్ని నీటివిత్తనాలు ప్రతి క్షణాన్ని పారేసుకున్న ఒంటి గడియారంలా కొన్ని ప్రవాసాలు నా చుట్టూ తిలక్ బొమ్మరాజు 28.04.14 03.05.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rOzZPd

Posted by Katta