పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

3, మే 2014, శనివారం

Ravela Purushothama Rao కవిత

ధ్వని ముద్రితం కాని సంభాషణ ====================== రావెల పురుషోత్తమరావు కలకాలం గుర్తుండిపోయేది కల కాదుకదా వారానికొక్క సారయినా మన జీవిత గమనాన్ని మనం మూల్యాంకనం చేసుకోగలగాలి. అప్పుడే మోడు వారిన జీవలతికలపైనా కొత్త చిగురుటాకులు మొలిచే వీలుకలుగుతుంది. ఒక్క సారయినా అలా చేయలేని మౌనం నేరంగానే పరిగణించ బడాలని నా భావం. చేసిన తప్పొప్పుల పట్టికను చేరదీసి చిక్కుదీసి సమీక్షించుకోవడం సరయిన కార్యక్రమం కాదని ఎలా చెప్పగలను?. దాగుడు మూతలతో ఆటమొదలయినప్పుడే దండనల జోరూ మొదలవుతాయి. అంతరంగాన్ని మధించకుండా అన్యోన్యతనూ అభిమానాన్నీ సాధించడం కష్టతరమని నా ప్రగాఢ విశ్వాసం. వెలుగునీడలమధ్యన పెల్లుబికే వేదనలనూ అశృత్యాత్మక్షోభను అణచలేమని కూడా మనం అర్ధం చేసుకోగలగాలి నిరంతరం మౌనమే సమాధానమనీ కాలమే గాయాలను మానుపుతుందని , అలా నిరంతరం ఎదురుచూపులతో నిరాశా నిస్పృహలతో గడుపుతూండడం ఎంతవరకు సమంజసమో భావ్యమో నీవే నీకుగా తెలుసుకో ! మేలుకో దూరమైనా గమ్యం చేరుకునేదాకా విశ్రాంతిని కోరుకోకు. కడుపునిండా నవ్వుకుని కంటనిండా కునుకును నింపుకుని ఎన్నాళ్ళయిందో గమనించు. అభద్రతాభావంతో ఎన్నాళ్ళని అంతర్గత సంఘర్షణనూ ఆక్రోశాన్ని అణచి వున్వుకోగలమో ఊహించు.ఈ స్థితి ఆరోగ్యప్రదం కాదని ఎన్ని సార్లు నేను నొక్కి వక్కాణించానో ఒక్కసారి పునరాలోచన చేసుకో. ధ్వని ముద్రితం కాని ఏ సంభాషణయినా చిరకాలం చెవుల్లో రింగు రింగు మనదని గుర్తుంచుకో 03-5-14

by Ravela Purushothama Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i9I8s9

Posted by Katta

1 కామెంట్‌: