పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, మార్చి 2014, గురువారం

Rambabu Challa కవిత

చల్లా చమక్కులు /Dt.6-3-14 రోజూ నా గుండె తలుపులు తెరచి దీపం పెట్టేదానివి నువ్వు రానంటే చీకటి లో బ్రతికేదెలా ప్రియా! కళ్ళు తెరచి నిన్ను చూసే నేను నీవు లేక మూసిన కళ్ళతో చూస్తున్నాను అంధుడనై పోతానేమో! నీవు రాకపోతే సరి- విలువైన వస్తువుని తీసుకుపోయావు నా హృదయాన్ని తిరిగివ్వమంటే మొండికేస్తున్నావు నీ తోడు లేని దారంతా చీకటే నీ నవ్వుల రతనాలను ఏరుకొని నా చీకటి బ్రతుకులో వెలుగు నింపుకుంటా

by Rambabu Challa



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1osXxYn

Posted by Katta

Swatee Sripada కవిత

ఇంకేం చెయ్యను? మాటల్లేకుండా మౌనయుద్ధం చేద్దమనుకు౦టానా కొంగట్టుకులాగి వెనువెంటే తిరిగే తప్పటడుగుల బుడిబుడి నడకల పాపడి పలవరి౦తల్లా నీ తలపులు నిశ్శబ్దాన్ని సాగదీసి నీకూ నాకూ మధ్యన గాలివంతెన వేద్దామనుకు౦టాను రివ్వురివ్వుమంటూ అటూ ఇటూ పరుగులుపెడుతూ హోరెత్తించే ప్రవాహమవుతు౦ది అదృశ్యంగా నీ ఉనికి మంకు నేర్చిన చిన్నరిలా దొర్లిదొర్లి మారాం చేసే మనసును గట్టిగా కసిరి ఓ మూలను౦డమని గదుముతానా కళ్ళనిండా నీళ్ళు నింపుకు ఎర్రబడ్డ కళ్ళను వేళ్ళవెనకవైపుతో తుడుచుకునే చంటి కూనను ఓదార్చే మెత్తని చేతుల్లా నీ మాటల ప్రతిధ్వని 2. నిజమే అయినా కష్టంగానే ఉంటుంది అనుక్షణమూ దూరమవుతూ మరింత దగ్గరవడం మాటి మాటికీ తొంగి చూసే మధురోహల మాలలల్లుకుని ఏమ్చేయ్యాలో తోచని వేళ పక్కన లేకపోవడం నరకంగానే అనిపిస్తుంది ఉదయాలూ మధ్యాన్నాలూ సాయంత్రాలూ ఇంటిచుట్టూ మూగిన పావురాళ్ళు గా బలవంతాన విసిరే శబ్ద గరిమల లోంచి అడుగు తీసి అడుగు వేసే యుగసంధి మధ్య పాక్కుంటూ రావడం ఎంత కష్టం మరి 3. తీరికలేని ఖాళీ జీవితాన్ని చివరి బొట్టు వరకూ ఒంపుకు తాగి మసకబారుతున్న సచేతనత నీడలో సేదదీరే౦దుకు క్షణం పాటు ఒరిగి స్థబ్దతలో కాస్సేపు ఒదుగుదామనుకు౦టానా పొట్టమీద పాకే ముని వేళ్ళ పలకరింపులు నిలువెల్లా పులకరింతల నదులై పూర్తిగా తడిపెస్తాయి తెప్పరిల్లిన ఊహలు కొత్త మొలకలై తలలెత్తుతాయి వద్దన్నపుడు కురిసే అల్లరి వానలా ఓ జల్లు చల్లగా ఏ మూల నుండో ఎదపై వాలుతుంది 4. ఇదీమీ కొత్తకాదుగా చూసే కళ్ళకు టేబుల్ పై మోచేతులాంచి పెనవేసుకున్న వేళ్ళపై తలనుంచి కళ్ళు మూసుకున్న పనిలేని తనమే కనిపిస్తుంది. ఓ ముగింపులేని నిరంతర కధనంలో నా పాత్ర అంతేనని ఎవరికీ తెలుసు?

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e469zG

Posted by Katta

Vijay Kumar Svk కవిత

విజయ్ కుమార్ ఎస్వీకె ** ఐ ** సమస్తం మంచుముద్ద ఐ - మేఘం ఒడిలో నేనో చినుకు బొట్టు- గింజల్ని మింగు పావురం దప్పిక నేను- నేలంతా బురదగుంతల చిక్కదనం నేను- ఎండ ముద్దు పెట్టి కరిగించు రాత్రి నేను- గుండె పిండు యేడుపులో చిన్న నవ్వు నేను- ఐ , ఒక దారి ఇంకో దారీ పరుచుకున్న కలల నిప్పుపై నడక నేనై- ఐ - 05/03/14

by Vijay Kumar Svk



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAnCHP

Posted by Katta

Balu Vakadani కవిత



by Balu Vakadani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lAhCPq

Posted by Katta

Kapila Ramkumar కవిత

Vadrevu Ch Veerabhadrudu నేను రాజవొమ్మంగి వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లో నా పాతపుస్తకాల్లో 'క్షేత్రయ్య పదములు ' (1963) కనబడింది. విస్సా అప్పారావుగారు సంపాదకత్వం చేసిన పుస్తకం. రాజమండ్రిలో సరస్వతి పవర్ ప్రెస్స్ వాళ్ళు అచ్చువేసింది. 1986 లో రాజమండ్రి పుస్తకప్రదర్శనలో పాల్గొన్నందుకూ, కార్యకర్తగా పనిచేసినందుకూ, ఆ కమిటీ వాళ్ళు నాకా పుస్తకం ఇచ్చారని ముందు పేజీలో రాసుకున్నాను. ఆ పుస్తకం నాకు చాలా విషయాలే గుర్తుచేసింది. 1983 నుంచి 86 దాక రాజమండ్రి పుస్తక ప్రదర్శనల్లో మేమంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళం. ప్రతి ఏటా డిసెంబరులో జరిగే ఆ వేడుకల్లో మేం వక్తలం,కార్యకర్తలం, సంస్కర్తలం కూడా. అద్దేపల్లి అండ్ కో వారి తరఫున సరస్వతీ పవర్ ప్రెస్ అచ్చువేసిన అపురూప గ్రంథాలెన్నో, రాజమండ్రీ, తక్కిన తెలుగుప్రపంచమూ మర్చిపోయినవాటిని నేనే మళ్ళా నలుగురికీ పున: పరిచయం చేసాను.కేంద్రసాహిత్య అకాదెమీ కోసం ప్రచురించిన గోపినాథ మొహంతి 'అమృతసంతానం ', కాకాసాహెబ్ కాలేల్కర్ 'జీవనలీల ', విభూతిభూషణుడి 'వనవాసి ', పురిపండా అప్పలస్వామి అనువాదం చేసిన 'విశ్వకథావీథి 'ఆరుసంపుటాలులతో పాటు శ్రీపాదవారి చిన్నకథలు కూడా. క్షేత్రయ్య పదాలు చదువుతూంటే మళ్ళా మరొక కొత్త లోకమేదో సాక్షాత్కరించినట్టే అనిపించింది. పారశీకకవుల్నీ, ఉర్దూకవుల్నీ, టాగోర్ నీ ఇంగ్లీషులో చదివి పరవశిస్తున్న మనం ఈ తెలుగు మహాకనినెట్లా మర్చిపోయేమా అనిపించింది. అయితే ఇందుకు కారణమూ లేకపోలేదు. ఉర్దూకవులకి ముషాయిరాలున్నాయి. ప్రసిద్ధ గజల్ గాయకులు ప్రతి రోజూ ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రతి రోజూ మీర్ నీ గాలిబ్ నీ పాడుతూనే ఉంటారు. నస్రత్ ఫతే ఆలీఖాన్ లాంటి మహనీయుడు అమీర్ ఖుస్రోని లారీ డ్రైవర్లకు కూడా సన్నిహితుణ్ణి చేసేసాడు. ఇక టాగోర్ సంగతి చెప్పనక్కర్లేదు. రవీంద్ర సంగీతం సప్తసముద్రాలమీదా పయనించింది.కాని క్షేత్రయ్యని తలుచుకోవడానికి. ఆ పదాలు పున:పున: స్మరించడానికి దారేదీ? ఈ ప్రశ్న నేను కాదు, ఈ పుస్తకానికి సుమారు అరవయ్యేళ్ళకిందట ముందుమాటరాసిన జమ్ములమడక మాధవరాయశర్మగారు కూడా వేసుకున్నాడు. ఆయనేమన్నాడంటే క్షేత్రయ్య పదం కేవలం సాహిత్యం కాదు, కేవలం సంగీతం కాదు, కేవలం నృత్యం కాదు.కేవలం అలంకరణ కాదు. అన్నిటి సామరస్యంతో విలసిల్లే సాహిత్యం. ఇప్పుడు సంగీతం, సాహిత్యం,నృత్యం, రంగాలంకరణ వేరువేరుగా విడిపోయినకాలంలో క్షేత్రయ్య పదానికి పూర్తి న్యాయం చేయగలిగినవారేవ్వరు? సాహిత్యకృతిగా తీసుకున్నా కూడా క్షేత్రయ్యని అర్థం చేసుకోవడానికీ,ఆస్వాదించడానికీ రసజ్ఞహృదయాలకు తగిన శిక్షణ ఇవ్వగలిగినవారెవ్వరు? తమిళసంగం కవుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తొల్కాప్పియం చెప్తుంది. ఆధునిక కవిత్వాన్నెలా అర్థం చేసుకోవాలో న్యూక్రిటిక్స్ వివరిస్తారు. కాని ఒక అమరావతి శిల్పాన్ని, ఒక క్షేత్రయ్య పదాన్ని ఆస్వాదించడమెలానో ఎవరు చెప్తారు? అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పదమే చూడండి. ఈ పదం తెలుగు కవిత్వంలోని అత్యంత సుందరమైన కృతుల్లో అగ్రశ్రేణికి చెందిందని తెలుగురసజ్ఞ లోకం గుర్తుపట్టగలిగిందిగాని,ఆ సౌందర్య రహస్యమెక్కడుందో ఇప్పటికీ తెలుసుకోలేకపోయింది. మగువ తన కేళికామందిరము వెడలెన్ వగకాడ మా కంచివరద తెల్లవారెననుచు /మగువ/ విడజారు గొజ్జంగి -విరిదండ జడతోను కడుచిక్కుబడి పెనగు-కంటసరితోను నిడుదకన్నులడెరు-నిదురమబ్బుతోను తొడరి పదయుగము-దడబడెడు నడతోను /మగువ/ సొగసిసొగయని వలపు-సొలపుజూపులతోను వగవగల ఘనసార-వాసనలతోను జిగిమించి కెమ్మోవి-చిగురుకెంపులతోను సగముకుచముల విదియ-చందురులతోను /మగువ/ తరితీపు సేయు సమ-సురతి బడలికతోను జరుత పావడ చెరగు-జార్పైటతోను ఇరుగడలకైదండ-లిచ్చు తరుణులతోను పరమాత్మ మువ్వగో-పాల తెల్లవారెననుచు /మగువ/ అత్యంత రమణీయమైన నీటిరంగుల చిత్రంలాంటి ఈ పదం మీద రసలోకం ఎప్పటికీ ఎడతెగని చర్చ జరుపుతూ ఉండొద్దా? ఈ పదం తమని ఎందుకు సమ్మోహపరుస్తోందో ఎంతచెప్పుకున్నా తనివి తీరడంలేదని భావుకులు నిస్పృహకి లోనుకావలసిన అవసరంలేదా? తెలుగుపదాల్ని కొన్నింటిని ఇంగ్లీషులోకి When God is a Customer అని ఎ.కె.రామానుజన్, వెల్చేరు నారాయణరావు అనువదించినప్పుడు అందులో క్షేత్రయ్య పదాలు కూడా కొన్నింటిని అనువదించినప్పుడు, ఈ పదాన్ని ఎందుకు వదిలిపెట్టేసారో వాళ్ళని అడగక్కర్లేదా? అన్నమయ్య పాడిన పదం 'పలుకుతేనెలతల్లి పవళించెను 'ఈ పదానికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చునని విస్సా అప్పారావుగారు చక్కగానే నిదానించేరు. కాని ఆ పదంలో అన్నమయ్య 'కలికితనమున విభుని కలసి ', 'పరవశంబున పవళించిన తల్లి 'ని స్తుతిస్తే, ఇందులో క్షేత్రయ్య 'కేళికామందిరం వెడలుతున్న మగువ ' నెందుకు చిత్రించాడు? అక్కడ తల్లి, ఇక్కడ మగువగా ఎందుకు మారిపోయింది? విజయనగర సామ్రాజ్యం ఉచ్చస్థితిలోకి చేరుకోక ముందు వచ్చిన ఆ పదంలోనూ, విజయనగర సామ్రాజ్యం ధ్వంసమై, రాజకీయంగా దేశం బలహీనపడ్డకాలంలో వచ్చిన ఈ పదంలోనూ కూడా పదలాలిత్యం, భావనాసౌకుమార్యం, సురతస్మరణ ఎందుకు ప్రధానమయ్యాయి? ఇట్లాంటివే ఎన్నో ప్రశ్నలు ఈ రోజంతా మీకూ, నాకూ.

by Kapila Ramkumar



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nfRZSd

Posted by Katta

Katta Srinivas కవిత



by Katta Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f9SRkU

Posted by Katta

Vani Koratamaddi కవిత

మనోగతం..... మాసిపోదు మనోగతం మది చేరదు ఆశాకిరణం చెరిగిపోని చేదు నిజం చేరువవదు చిరు దీపం జ్ఞాపకాల నిట్టూర్పులు మదిదాటని భావాలు ఆరిపోని ధు:ఖాలు ఆగిపోని బాష్పాలు మరువలేని అనుభవాలు మరలిరాని ఆశలు పెదవిదాటని మాటలు కనుమరుగైన బాటలు స్వర్గంలో నువ్వు శోకంలో నేను స్వప్నంలో నువ్వు శూన్యంలో నేను అమరమై నువ్వు అవనిలో నేను స్పర్స లేక నువ్వు స్మరిస్తూ నేను నీ రూపం నిజం.... నీవన్నది అమరం.. అంకురమే... అంతిమమై...! వాణి కొరటమద్ది 6/3/2014

by Vani Koratamaddi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mXdXwJ

Posted by Katta

Panasakarla Prakash కవిత

సాగుమూల౦ ఒక శరీర౦ విత్తన౦ నాటే రైతు మరొక శరీర౦ విత్తనాన్ని పొదుగుతున్న నేల‌ స౦సారపు సాగులో... ఒక ఆత్మ సహన౦ మరొక ఆత్మ బాధ్యత‌ వాటిని మరి౦త బ౦ధీ చేస్తూ.. మరో ఆత్మ పుట్టుక.. రె౦డు హృదయాలు ప్ర్రాణ౦పోసిన మొక్క‌ నెమ్మదిగా చిగురులు తొడిగి.. నేలలో౦చి..నేరుగా ఈ లోక౦లోకి విచ్చుకుని కళ్ళు తెరుస్తు‍‍‍‍‍‍‍౦ది... ఆలన పాలనల ఒడిలో అన౦త విశ్వమై ఆడుకు౦టూ... నిస్వార్ధమైన దు:ఖానికి ఆన౦దానికి సిసలైన చిరునామాగా విలసిల్లుతూ అ౦దరి హృదయాలను అ౦దుకు౦టు౦ది.. భేద౦ ఏమీ లేదు సృష్టిలో.. జీవి ఏదైనా..సరే విత్తన౦ ఎక్కడ పడుతు౦దో... దేహ౦ అక్కడే పుడుతు౦ది ఒక శరీర౦ మరొక శరీరాన్ని గాయ౦చేసే సమయ౦లోనే ఒక ఆత్మ మరొక ఆత్మను వెలిగి౦చడానికి సిద్దమౌతు౦ది అదే బ౦ధ౦............. పనసకర్ల‌ 6/03/2014

by Panasakarla Prakash



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MPdrQz

Posted by Katta

Bhaskar Kondreddy కవిత

kb||ఇక, ఆ తరువాత.....|| పీల్చుకుపోయిన బుగ్గల మీద జారుతున్న ఒకానొక నూత్న మృత్యునీడల్లో కూడ, కాస్తంత దయ కనపరుస్తూ, ఎండిన కళ్లల్లో కాస్తంత మెరుపుని కూడతీసుకుంటున్న ప్రయత్నాన్ని, ఫలప్రదంగా అనువదిస్తూ చిరునవ్వుగా నాకందిస్తూ, అదే ఘోషను చెవుల్లోకి పదేపదే ప్రతిఫలింపచేసే ప్రాణపు ఉనికి తాలూకు గసలో ఓ ఆదిమ లయకి ఊపిరూదితూ, నా ముఖానికి తన రెండు అరుచేతులనద్ది, ఇక తన నోరు, నిజానికి ఓ కోరిక కూడ కోరక తెరవబడే వుండిపోయింది,. మూతలుబడని కనుల సాక్షిగా. ఎలాంటి మార్పులేని, పాతకాలపు అరిచేతులు గర్భాశయపు గోడల మీద పారుడుతున్న శబ్ధపు జాడల్లో ఓ దుఃఖం. అది ఒక సందర్భం, బహుశా నన్ను నేను నిరాకరించుకునే సందర్భం. ---------6/3/2013.

by Bhaskar Kondreddy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Nyqhn6

Posted by Katta

చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ కవిత

శుభోదయం నిదురోతుంటే కల్లోకొస్తా_కనులుతెరిస్తే నీముందుంటా ..@శర్మ \6.3.14\

by చెన్నాప్రగడ వీఎన్నెస్ శర్మ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NyqgQf

Posted by Katta

Chandra Shekhar Vemulapally కవిత

వేములచంద్ర || మాతృమూర్తి || కడుపులో దాచుకుని భద్రం గా తొమ్మిది మాసాలు .... ఓ మాతృమూర్తి కన్నావు నన్ను .............. భూమ్మీద పడ్డాక కూడా నా బ్రతుకును నేను నేనుగా బ్రతకగలిగేలా అవసరమైన సమయస్పూర్తిని, విజ్ఞతను, ధైర్యాన్ని నా రక్తనాళాల్లో నింపి ............. అక్కడ, ఆ ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక జీవితాన్ని ఆవిష్కరించావు నీ ప్రేమను ఉగ్గుపాలు గా చేసి ఎంతో శ్రద్ధగా, మురిపెం గా నన్నో ధైర్యవంతుడ్నిలా దిద్దావు. .......................... నా అవసరాలు, నా ఆలోచనలు నన్ను పక్కదోవ పట్టించకుండా దిశా నిర్దేశం చేసావు .................... ఒక పరిపూర్ణ మాతృముర్తి లా శ్రమ, సహనం, స్వేదం, నమ్మకానివై నా ఎదుగుదలలో అమూల్యం .... నీ పాత్ర ................... అప్పుడప్పుడూ నీలో బాధను గమనిస్తున్నాను.. నీ పెంపకం లో లోపం ఉందేమో అని నీలో నీవు అనుకోవడమూ విన్నాను. ................... లోపరహిత జీవనం సాధ్యమా అమ్మ ఈ ప్రపంచం లో ..... పరిపూర్ణత అనేదే లేదు. ఆ దిశగా నడుస్తున్నాను. అదే చాలు!. అమ్మా! నీకోసమే ఈ కవిత రాసుకుంటున్నాను. . నీకు తెలియాలని కాదు.. నా మనసు మాటలివి. ................ నీ ప్రేమ లో పుత్ర మోహాన్ని మించిన దేవతాతత్వాన్ని చూసానని, నీ ప్రతి చర్యలో అంకితభావనను గమనించానని, ................ నీకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా చూడాల్సిన బాధ్యతే ఒక వరం అని, మనసు మాటకు అక్షర రూపం ఇస్తున్నా! అంతే! ................. నీ అనురాగం, నీ మమకారం నీ రూపం నీవు కాదా కారణం? .... అమ్మా! ప్రతి స్త్రీలోనూ ..... పవిత్రతను, తాపసి నే చూడగలగడానికి .... నీ ఆశిస్సులు శ్వాసగా .....!! 06MAR2014

by Chandra Shekhar Vemulapally



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ospJum

Posted by Katta

Thilak Bommaraju కవిత

తిలక్/స్పురిస్తూ నేను --------------------­-------- ఇక నిన్ను ముగిద్దామని చూస్తుంటే అనంతమయ్యావు మనసు పొరల్లో చెమ్మగిల్లిన దారులన్నీ నీ గురుతులే ప్రకృతి అంతటా నీ వదన కుసుమాలే అల్లుకుపోయాయి నీ ఊహల తరంగాలు మది దర్పణం గుండా ప్రసరిస్తున్నపుడు వక్రీభవించని నా చూపుల కోణాలను లెక్కించేదెలా ఆరాధనో ఆవేశమో మోహమో వ్యామోహమో నిలువెల్లా కమ్ముకున్న ప్రేమ పొర చలించే కాలంలో కొన్ని జ్ఞాపకాలుగా మిగిలే ఉన్నాయి ఇంకా. తిలక్ బొమ్మరాజు 05.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P2kEyM

Posted by Katta

Nvn Chary కవిత



by Nvn Chary



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hNdqbV

Posted by Katta

Kodanda Rao కవిత

కె.కె//గుప్పెడు మల్లెలు-69// ******************** 1. కవరుపేజీ చెప్పగలదా, కహానీ మొత్తం, చూసినంతనే అంచనాలెందుకు? 2. తినలెదేచెట్టు పళ్లెప్పుడూ, కారణాలెందుకోయ్, సాయం చెయ్యాలనుకున్నప్పుడు 3. గెలుపన్నది సులభమే, అల ఒచ్చినప్పుడు, తలొంచడం తెలిస్తే... 4. తప్పుదారి తగులుతుంది, ప్రయాణంలో చాలాసార్లు, కొత్తదారి పరిచయానికి 5. కాలమంటే గడియారమా, నచ్చినప్పుడు సరిజెయ్యడానికి, పరిగెత్తయినా సరే... అందుకోవాలంతే 6. ప్రతిమెట్టు అనువే, కులాసాగా కూర్చోవడానికి, నువ్వు లొంగొద్దు ఆ మోసానికి 7. వర్షంలో తడుస్తున్నప్పుడు, ఆగాక నడుస్తున్నప్పుడు తేడాలేదా, జీవితమంటే రెండూ కలిపేకదా 8. కాలకూటంలా అడ్డుతగిలే, తడిగుడ్డ వాక్యం, "అదిసరే... కానీ" 9. నీకధ చెప్పడానికి సిగ్గెందుకు? అయితే ఆడికో పాఠం, లేదా గొప్ప గుణపాఠం. 10. అవసరాన్ని మించి, మనిషి ఖర్చుపెట్టేది ఏమిటో, అబ్బో... అది విశ్రాంతే అనుకుంటా. ==================== Date: 06.03.2014

by Kodanda Rao



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e2puBp

Posted by Katta

Sri Modugu కవిత

//శ్రీ మోదుగు // చెప్పగలవా?..... // ప్రభువు సన్నిధిలో వింతైన జ్వాలతో వెలిగే సూర్యుడా ఇచ్చుకోవడానికి కొన్ని పూలని నివేదించు కోవడానికి కొన్ని నీళ్ళని ఇంకొంచం తీసుకోవడానికి హృదయాన్ని తెచ్చుకుంటాను ఐనా ఏమవుతావని ఒక సారి ఏమీకావని మరో సారి అంతా మనమే అని ప్రతీ సారీ కలుసిపోతూ, విడిపోతూ, త్యజిస్తూ,భ్రమిస్తూ….. దోసిళ్ళలో పూవులకై వేగిర పడుతూనే ఉంటాను …. మరి ఇక మరింత హత్తు కునేదెలా చెప్పగలవా? 05/03/2014

by Sri Modugu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/P1iTlg

Posted by Katta

Shaik Meera కవిత

ఎద గూటిలో ఎరుపెక్కినది...... కనుల్ని కోవ్వోత్తులై మలచి చూపుల్నిచుక్కాల్లా చేసి మనసుని మల్లెల్లా పరచి వయసుని కత్తుల్లా ఉయ్యాల్లా కట్టి కలల్నికాంతుల్లా రంగుల్లా అల్లి జల్లి ఆశల్నిఅలల్లా లేపి కలిపి గుండెల్నినీ బందీకి కోటగా నా వలపుకు గెలుపుగా నా జన్మకు బహుమతిగా నిత్యం నాలో విరిసే ప్రణయ పుష్ప పరిమళమై నా ఎద గూటిలో ఎరుపెక్కిన నే చెక్కిన అపురూప లావణ్యమే నువ్వే చెలి......షేక్ మీరా ...... 06/03/2014

by Shaik Meera



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7mXy9

Posted by Katta

Abd Wahed కవిత

చిరుగాలిల ఊహ ఒకటి వెన్ను చరిచి పోయిందీ కంటిలోని కలలవాన కురిసి కురిసి పోయిందీ మరణించిన నిన్నలోన, బతికి ఉన్న నేటిలోన మొలకెత్తని రేపు కూడ సైగ చేసి పోయిందీ చేయిపట్టి నడిపించే నీడకూడ చీకటిలో మంచులాగ కరిగి కరిగి నన్ను వదిలిపోయిందీ అంతరంగ గగనంలో మబ్బులాంటి భావమేదో చినుకులాగ నేలపడి మదిలో ఇంకి పోయిందీ ఎండలోన చెట్టునీడ విశ్రాంతిగా నిదురిస్తే యుద్ధాశ్వం బతుకు కూడా గడ్డిమేసి పోయిందీ సెలయేటికి ఎదురీదే చిరుచేపల కరవాలం మెరుపు చూసి దియా, మేను పులకరించి పోయిందీ

by Abd Wahed



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7mRXr

Posted by Katta

Sriramoju Haragopal కవిత

తను వొచ్చే దారిలో... కంతల్లపడ్డ చూపులకు తగిలి శేరడుకొరిగిన కన్నీళ్ళయాదిని, కావులిచ్చుకుని అడిగింది కడప ఆమెతోని వాకిట్ల యాపశెట్టు ఆకులురాలిన ముచ్చట్లు వాడొస్తడా యాల్లకు, వాడిపొయ్యొస్తడా ఈ కాలానికి మునగదీసుకున్న ఆకాశం మబ్బుల్ని కప్పుకుంది ఎండపూట చలినెగళ్ళు దారి నిండా వూరేగింపు గోగుపూలు తానమాడి ఎర్రనీళ్ళు పోసుకున్నయి ఎవరికో వాగ్దానం చేసినట్లుంది వసంతం లేలేత చిగుళ్ళువాలిన చెట్లకొమ్మలు ఆమె నడిచిపోయిన తొవ్వనిండ నవ్వులమడుగులు పూతపిందెల మామిళ్ళలోగిళ్ళు రుతువు నవనవోన్మేషమంత ఆమె దోసిట్ల -హరగోపాల్ శ్రీరామోజు 05.03.14

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7mUmb

Posted by Katta

Kontham Venkatesh కవిత

కొంతం వేంకటేశ్: షరామామూలే..: షరామామూలే నా అలుకలు నీ కులుకులు..! షరామామూలే నా గుసగుసలు నీ రుసరుసలు..! షరామామూలే నీ గర్జనలు నా తర్జనభర్జనలు..! షరామామూలే ప్రణయ బృందావనమున నేను ప్రళయ ఝంఝామారుతము వోలె నీవు..! షరామామూలే సంపెంగ మొగ్గల నవ్వుల విరివాన నేను అర విరిసిన కెంపు గులాబీ బుగ్గల తోయజాక్షి నీవు..! షరామామూలే పరుచుకున్న పచ్చదనపు సౌభాగ్యం నీవు వెచ్చని నీ కౌగిలిన ఒదిగిపోయిన కొత్తదనం నేను..! షరామామూలే నాలో నిండిన నీవు నీలో మిగిలిన నేను..! 5/2/2014

by Kontham Venkatesh



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NUNDTO

Posted by Katta

దాసరాజు రామారావు కవిత

శ్రీ శ్రీ ఒక ప్రయోగం,ఒక మలుపు,ఒక యోధా,మేధాక్షరం.అయన 'ప్రజ' నేలవిడిచి సాము చేయదు. సమాజాన్ని విడనాడదు. పద్యంలో 'ప్రాసక్రీడ' లా, గద్యంలో వాక్బాణం 'ప్రజ' అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఇవి హాస్యం, ప్రయోజనాల మేలు కలయిక. విజ్ఞాన వికాసాల మేళవింపు. సమాచారం, విశ్లేషణల సహజరూపం. మహాకవి శ్రీశ్రీ విశ్వరూపం 'ప్రజ'. ఇంతకూ ప్రజ అంటే ప్రశ్న జవాబులు .శ్రీశ్రీ సాహిత్యసర్వస్వం - 19, విరసం ప్రచురణ : డిసెంబర్ 1990.ఆ గ్రంధం లోంచి కొన్ని .................... 1.మీకు నచ్చిన కవి ఎవరు? * జపాన్ చక్రవర్తి . ఈయనఏడాదికో పద్యం రాస్తాడు .( జపాన్ చక్రవర్తి షోవా రాజవంశానికి చెందిన హిరోహిత ( 1901-89). రాజ్యాదినేతగా1926నుంచి చనిపోయేవరకు కొనసాగాడు .మంచి మెరైన్ బయలజిస్టు.గొప్పకవి). 2.మీరు రష్యాని ఎక్కువగా పొగడుతారు. ఎందుకు? * నాది భట్రాజు పొగడ్త కాదు. యాభై ఏళ్లకిందట ఇప్పుడు మన దేశంలో లాగే రష్యాలో దరిద్రం,అజ్ఞానం ,అనారోగ్యం తాండవిస్తూఉండేవి. ఈ స్వల్ప కాలంలో ప్రప్రంచం లోని అగ్రరాజ్యాలలో ఒకటిగా రష్యాదేశం మారింది. ఇందుకు కారణమేమిటో మిరే ఆలోచించుకోండి.ఇది మెచ్చుకోదగిన విషయం అవునో, కాదో మేరె తేల్చుకొండి. 3.మీరు దేవుణ్ణి నమ్ముతారా? * మానవుణ్ణి నమ్ముతాను. 4.రచయిత మానవ బలహీనతల్ని చిత్రించగలడు. కానీ అవే బలహీనతల్ని తనే ఎందుకు ప్రదర్శిస్తుంటాడు ? * రచయితకూడా మానవుడే కాబట్టి. 5.కవిత్వానికి ఏది గీటురాయి ? * జ్ఞాపకం వుండేది కవిత్వం. మరచిపోయేది కవిత్వం కాదు.ఈ అభిప్రాయం చెళ్ళపిళ్ళ వరూ అన్నారు. అంతకుముందు అల్లసాని పెద్దన కూడా "రాతిరియున్ పవల్ మరపురాని హొయల్ " అని అన్నాడు. 6. యువరచయితలకు ప్రాచీనసాహిత్య అధ్యయనం అవసరమా ? * పాట కవిత్వం ఎందుకు చదవాలంటే అది ఇపుడు ఎందుకు వ్రాయ కూడదో (why not to write) తెలుసుకోవడానికి . 7.జనసామాన్యాన్ని కవిత్వంతో మార్చవచ్చునంటారా ? * ఇది కొంచెం గడ్డుప్రశ్నే . జన సామాన్యానికి ఇది ఎంత చేరువలో వుంటుంది అన్నదానిపై ఆధారపడివుంటుంది.మనకి ముప్పూటలు కాదు. రెండు పూటలు కూడా తిండి దొరకడం లేదు. జనసామాన్యం కవిత్వాన్ని భోగ ద్రవ్యం గానే చూస్తున్నర. మినిమం అవసరాలు తీరాకనే కవిత్వం . మయకోవస్కి కవిత్వాన్ని ఇరవై ఏళ్ళ కిందటికన్నా ఇప్పుడు ప్రజలు ఎక్కువ ఆస్వాదిస్తున్నారు .ప్రజలలో కవిత్వాభిరుచి ని పోషించుకుంటూ రావాలి. 8. ఈనాడు సాహిత్యానికి రాజకీయాలకి వున్నదూరమెంత ? * ఇదివరకు మైళ్ళలెక్కన వుండేది. ఇప్పుడు సెంటిమీటర్లలో కొచ్చింది.రాజకీయ దృక్పధం సరిగా లేనివాడు సాహిత్యంలో రాణించలేని స్థితి వచ్చింది. 9. మహాకావ్యం ఎప్పుడొస్తుంది ? * అసాధ్యాన్ని సాధించడానికి మార్గాలు అన్వేషిస్తున్నప్పుడు కళాశీలి అనుభవించే అశాంతి లోనే మహాకావ్యం ఆవిర్భవిస్తుంది. 10. మీ కవిత్వానికి marxism కు సంభందం ఏమిటి ? * " మహాప్రస్థానం " అన్న గీతం రాసేనాటికి నాకు marxism ను గూర్చి తెలియనే తెలియదు. నేను marxism ను తెలుసుకున్నది సాహిత్యం ద్వారానే గని రాజకీయాల ద్వారా కాదు. 5-3-2014.

by దాసరాజు రామారావు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1q7mRqs

Posted by Katta