పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఏప్రిల్ 2014, బుధవారం

డాక్టర్ ప్రతాప్ కత్తిమండ కవిత

కత్తిమండ ప్రతాప్ || రక్త పాదాలు || ======================== పాదాలు పరిగెట్టలేక అలసిపోయాయి దేహాలు సొమ్మసిల్లి పడిపోయాయి ఎముకలు మాత్రం గూడై నవ్వుతున్నాయి గాయాలు మాత్రం పాద ముద్రలు వేస్తూనే ఉన్నాయి బ్రహ్మజెముడు మొక్కలు వెక్కిరిస్తున్నాయి మొగలిపొదల్లో మాత్రం విష పాములు బుషలు కొడుతున్నాయి నాలుకమచ్చల మాటలు ఇంకా కాటేస్తున్నాయి కుల అహంకారం కరిగే మంచుదుప్పటై కాటేస్తుంది నీ మాటాల విష తూటాలకు మొగలిరేకులు వాడిపోతున్నాయి కరిగే కాలం ముసుగేసింది దేహాలు మాత్రం సజీవంగానే చూస్తున్నాయి బతుకు జీవశ్చవాలను ఊహించుకుంటూ పాద ముద్రలను ముద్దెట్టుకుంటూ గాయాల లేపనం కోసం సంచరిస్తూ... రోదనలు అరణ్యం ఐతే మృత సంజీవని అక్కడే దొరుకుతుంది కాబోలు గాయాలైన అలసిన పాదాలు అటువైపే పరిగెడుతున్నాయి ============ 16/ఏప్రిల్ /2014

by డాక్టర్ ప్రతాప్ కత్తిమండ



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l2BKKP

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి