పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, ఏప్రిల్ 2014, బుధవారం

Sky Baaba కవిత

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండపై కవిత -3 -------------------------------------------- ముస్లిం వాడలు - - - - - - - - - స్కైబాబ వాడు అందలంపై కూర్చొని నా దళితుల్ని కింద కూర్చోబెట్టేవాడు నా ఆదివాసుల్ని కాళ్ల దగ్గర పడి వుండమనేవాడు చేతులు కట్టుకొని నిలబడ్డం చేతులు జోడించడమే వాడు నా వాళ్లకు నేర్పింది మతం మారడం ఒక తిరుగుబాటు 'ఖాందా ఖాందా బరాబర్‌'గా నిలబడే మజీదుల్లోకి చర్చిల్లోకి నా వాళ్లు ప్రవేశించారు వాడి అహం దెబ్బతిని విడదీసి హత్యలు చేసే వాడి అసలు నైజాన్ని మరోమారు ప్రదర్శిస్తున్నాడు వాలి సుగ్రీవుల్ని విడదీసినట్లు దళితుల్ని ముస్లింలనుంచి వేరు చేశాడు వానరుల్ని వాడుకున్నట్లే ఆదివాసీల్ని ముస్లింలపైకి ఉసిగొల్పాడు యుగాల వారసత్వం కదా నా వాళ్లపైన సలసలకాగే సీసం పోశాడు బతుకు చక్రాన్ని నడపకుండా బొటనవేళ్లని నరికాడు ఖననానికి లేకుండా వేలమందిని సజీవ దహనం చేశాడు మళ్ళొకమారు నా వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డం చూస్తున్నాను మళ్ళొకమారు నా వాళ్ళు భయం భయంగా కింద కూర్చోడం చూస్తున్నాను ఒకరి మీద ఆధారపడడం తెలియని నా జాతిని ఇవాళ వాడు సర్కారు రూపమెత్తి 'దేహీ' అని చేయి చాపమంటున్నాడు అది వాడి హైందవ 'రాజ నీతి'! దళిత వాడలు ఊర్లలో కలుస్తున్న ఆనందం ఒళ్ళంతా పారకముందే ఇప్పుడక్కడ ఊరిబైట ముస్లింవాడలు వెలిశాయి

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QanK42

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి